మండే ఎండల్లో వెరైటీ చోరీలు : ఇంట్లో కూల్ డ్రింక్స్.. ఐస్ క్రీమ్స్ మాయం

Submitted on 6 June 2019
Variety thieves..Cool drinks at home, robbers eating ice cream in Faridabad

దేశ రాజధాని సమీపంలో ఫరీదాబాద్‌లో తరచూ చోరీలు జరుగుతున్నాయి. దొంగలు ఇళ్లల్లో దొంగతనాలు చేశాక అక్కడి నుంచి కామ్ గా ఉడాయించటలేదు. ఇంట్లో నగలు, డబ్బు దోచేసుకున్నాక.. చక్కగా అక్కడే బైఠాయించి.. ఫ్రిజ్ లో స్టోర్ చేసి ఉంచుకున్న ఐస్ క్రీములు.. కూల్ డ్రింక్ ఖాళీ చేసేస్తున్నారు.

అంతేకాదు వంటగదిలో తాపీగా కూర్చొని ఆహార పదార్థాలను లాగించేస్తున్నారు. సైనిక్ కాలనీలోని ఒక ఇంటిలోకి కిచెన్ గ్రిల్స్ కట్ చేసి మరీ ఇంట్లోకి చొరబడిన దొంగ బెడ్ రూం తలుపువేసేసి..ఇంటి యజమానుల్ని లోపల బంధించాడు. ఫ్రిజ్ తెరిచి ఐస్‌క్రీం, కూల్‌డ్రింకులను తాగేశాడు. తర్వాత తాపీగా వాటర్ బాటిల్‌ను పట్టుకుని దర్జాగా వెళ్లిపోయాడు. 

మరుసటి రోజున ఇంటి యజమాని పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో బంగారం, డబ్బులు దోచుకుపోయారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ ని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. ఇంట్లో ఆహార పదార్ధాలతో పాటు ఫ్రిజ్ లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు మాయం అయినట్టు గుర్తించారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Variety thieves
Cool Drinks
home
Robbers
eating
ice cream
Delhi
Faridabad

మరిన్ని వార్తలు