వాయు తుపాను : గుజరాత్‌లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Submitted on 12 June 2019
vayu cyclone, Gujarat govt on high alert.. schools colleges closed in coastal districts

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను తీవ్ర రూపం దాల్చింది. గుజరాత్ వైపు కదులుతోంది. దూసుకొస్తున్న వాయు తుపాను గుజరాత్ తీర ప్రాంత ప్రజలను భయపెడుతోంది. గురువారం(జూన్ 13,2019) ఉదయం వాయు తుపాను గుజరాత్‌ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కచ్‌ నుంచి దక్షిణ గుజరాత్‌ వరకూ ఉన్న కోస్తా తీర ప్రాంతాల నుంచి 3 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గుజరాత్‌లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుజరాత్‌, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలకు సమాచారాన్ని, సలహాలను అందజేసింది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా గుజరాత్ కు తరలించారు. సహాయక చర్యల కోసం బలగాలను రంగంలోకి దింపారు.

తుపాను కారణంగా గురువారం గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించారు. కొన్ని రోజుల పాటు చేపల వేటపై నిషేధం విధించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. కచ్, దేవభూమి ద్వారకా, పోర్ బందర్, జునాగర్, డయూ, గిర్ సోమనాథ్, అమ్రేలి, భావ్ నగర్ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కొంకణ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానాల్లో గుజరాత్ లోని జామ్ నగర్ ఎయిర్ పోర్టుకి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించారు.

Gujarat
Govt
high alert
Schools
colleges
Closed
coastal districts
vayu cyclone

మరిన్ని వార్తలు