ఆధార్ ఉన్నవారికి రూ.2లక్షల రుణం

Submitted on 10 June 2019
vedanta limited anil agarwal suggestions narendra modi government

ఢిల్లీ: దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ముద్రా యోజన కింద రూ.2లక్షలు రుణం మంజూరు చేయాలని వేదాంత లిమిటెడ్‌ అధినేత అనిల్‌ అగర్వాల్‌ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలు 3 రెట్లు గొప్పగా పని చేస్తాయన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించొచ్చని, ఉద్యోగాలను సృష్టించొచ్చని చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని అనిల్ అగర్వాల్ అన్నారు. 
Also Read : ఏంటీ బాదుడు : బ్యాంక్ నుంచి 10 లక్షలు డ్రా చేస్తే.. పన్ను కట్టాలి

భారత దేశ పరిస్థితిని ఆయన ‘మదర్‌ ఇండియా’ సినిమాతో పోల్చారు. ఆ సినిమాలో రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణమిచ్చిన వారు పట్టుకుపోతున్నారని, అలాగే, భారత్‌లోనూ 50శాతం ఆదాయాలను దిగుమతుల పైనే ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఆ తర్వాత వడ్డీలకు చెల్లింపులు పోగా మిగిలేది ఏమీ లేదన్నారు. సహజ వనరులు, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికి తీయాల్సిన అవసరాన్నిఆగర్వాల్ గుర్తు చేశారు.

ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి రుణం ఇవ్వాలని అనిల్ అగర్వాల్ చేసిన సూచన బాగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అది ఆచరణ సాధ్యమా అనే డౌట్లు వస్తున్నాయి. అనిల్ అగర్వాల్ చేసిన సూచనను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా.. దానిపై ఫోకస్ పెడుతుందా.. ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షలు రుణం ఇస్తారా.. లేదా అనేది చూడాలి.
Also Read : కస్టమర్ కు కట్టండి : సోనీ టీవీ కంపెనీకి రూ.3లక్షల జరిమానా

vedanta
anil agarwal
Aadhaar
narendra modi 

మరిన్ని వార్తలు