కలర్‌ఫుల్‌గా ‘ఎఫ్ 2’ ఫస్ట్ లుక్...

16:40 - November 5, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతున్నాయి. వీటికి సీనియర్ హీరోలు..యంగ్ హీరోలు మొగ్గు చూపుతున్నారు. యంగ్ హీరోలతో నటించడానికి సీనియర్ హీరోలు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. వెంకటేష్..నాగార్జునలు ఇప్పటికే యంగ్ హీరోల సరసన నటించి మెప్పించారు. తాజాగా వెంకటేష్ మరో మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వరుణ్ తేజతో జత కడుతున్నారు. 
Image result for F2 First Lookఅనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఈయన దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్, పటాస్, రాజా ది గ్రేట్ చిత్రాలు మంచి టాక్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రూపొందుతున్న ‘ఎఫ్ 2’ సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 
వెంకటేశ్ సరసన తమన్నా..వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్‌లు నటిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సినిమా మొదటి లుక్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మంచి కలర్ ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకొంటోంది. ఈ పోస్టర్ ద్వారా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం

Don't Miss