వణికిస్తున్న వాయు తుఫాన్ : గుజరాత్ లో రైళ్లు,విమాన రాకపోకలు నిలిపివేత

Submitted on 12 June 2019
Very Severe Cyclonic Storm ‘VAYU’ is about 290 km west-southwest of Mumbai (Maharashtra)

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను తీవ్ర రూపం దాల్చింది. దూసుకొస్తున్న వాయు తుపాను గుజరాత్ తీర ప్రాంత ప్రజలను భయపెడుతోంది.ప్ర‌స్తుతం ముంబైకి 290 కిలోమీట‌ర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృత‌మై ఉంది. గురువారం(జూన్ 13,2019) ఉదయం గుజ‌రాత్‌ లోని పోరుబంద‌ర్-డ‌యూ నుంచి వీరావ‌ల్ దగ్గర తుఫాన్ తీరం దాటే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. సుమారు 155 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారం ఉద‌యం ఆ గాలులు 170 కిలోమీట‌ర్ల వేగానికి చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇప్పటికే హోంశాఖ.. అధికారులను అప్రమత్తం చేయగా NDRF సిబ్బంది, రెస్క్యూ టీం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి. గుజరాత్ తీరం మీదుగా పోర్ బందర్, మహువా, వెర్వాల్, డియూ రిజియన్ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దీంతో గుజరాత్ తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. కచ్‌ నుంచి దక్షిణ గుజరాత్‌ వరకూ ఉన్న కోస్తా తీర ప్రాంతాల నుంచి 3 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పశ్చిమ రైల్వే బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రైళ్లను రద్దు చేసింది. విపత్కర పరిస్థితుల్లో అత్యవసరంగా ఉపయోగించేందుకు కొన్ని రైళ్ళను సిద్ధంగా ఉంచారు. వీరవల్, ఓఖా, పోరుబందర్, భావ్‌ నగర్, భుజ్, గాంధీధామ్ స్టేషన్ల నుంచి బ‌య‌లుదేరే రైళ్ల‌ను ర‌ద్దు చేశారు.  ఒక ప్రత్యేక రైలును మాత్రమే నడుపుతామని తెలిపింది. అహ్మదాబాద్ నుంచి గురువారం డయ్యూ, పోర్‌బందర్, కాండ్లా, భావ్‌నగర్‌లకు విమానాల రాకపోకలను రద్దు చేశారు.కాండ్లా నౌకాశ్రయాన్ని గురువారం తాత్కాలికంగా మూసివేస్తారు.

కేంద్రప్రభుత్వం అలర్ట్ గా ఉందని మోడీ అన్నారు.పరిస్థితిని కేంద్రప్రభుత్వం దగ్గరగా మానిటరింగ్ చేస్తున్నట్లు మోడీ తెలిపారు.అవసరమైన అన్ని సహాయసహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్,ఇతర ఏజెన్సీలు కంటిన్యూస్ గా పనిచేస్తున్నట్లు మోడీ తెలిపారు.తుఫాను ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలతో తాను టచ్ లో ఉన్నట్లు మోడీ తెలిపారు.

Gujarat
Airport
Trains
stop
Modi
Cyclone Vayu
STROM
PORBANDAR
Speed
GUSTING
WINDS
Maharashtra
severe

మరిన్ని వార్తలు