విజయవాడలో 1137 కిలోల గంజాయి పట్టివేత

Submitted on 26 May 2019
Vijayawada has 1137 kg of ganjai seize by police

అమరావతి: విజయవాడలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇసుక సరఫరా ముసుగులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.  ఇసుక లారీలో అక్రమంగా తరలిస్తున్న 1137 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

నర్సీపట్నం ఏజెన్సీ సాపర్లతండా నుంచి హైదరాబాద్‌కు ఇసుక లారీలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ తో గంజాయిని పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. లారీని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2.27 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


 

AP
Amravati
vijayawada
1137 Kg
ganjai
seizemmpolicem

మరిన్ని వార్తలు