ఓటమికి సమాధానం చెప్పండి : విరాట్ కోహ్లీ, రవిశాస్త్రికి ఆర్డర్

Submitted on 12 July 2019
Virat Kohli, Ravi Shastri To Meet Committee Of Administrators After Returning From England

వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఓటమిపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలను ఆదేశించింది. మెగా ఈవెంట్‌కు సరితూగగలిగే ప్లేయర్లను ఎంచుకోలేదని వస్తున్న రూమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. 

సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్, సభ్యులు డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) రవి తోడ్గేలు టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను కూడా వివరణ ఇవ్వాల్సిందేనని సూచించారు. 'వరల్డ్ కప్ టోర్నీ నుంచి తిరిగొచ్చాక కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రితో చర్చించాలనుకుంటున్నాం. వారికి తెలియజేసి వీలు కుదిరిన సమయాల్లో సమావేశం ఏర్పాటుచేస్తాం' అని రాయ్ తెలియజేశారు. 

మరో వైపు టీమిండియా స్పెషలిస్ట్ ప్లేయర్ అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోకపోవడంపై రూమర్లు చాలానే వస్తున్నాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అంబటి రాయుడు లాంటి బ్యాట్స్‌మన్ ఉంటే న్యూజిలాండ్‌ను ఎదుర్కొనేవాళ్లమని, గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. 

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 240పరుగుల టార్గెట్ చేధించే క్రమంలో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 239 పరుగులు చేయగలిగింది. చేధనలో ఆరంభంలో తడబడి చివర్లో పోరాటం చేసినప్పటికీ భారత్ 221 పరుగులు మాత్రమే చేసింది. 

Virat Kohli
ravi shastri
Committee Of Administrators
england
coa


మరిన్ని వార్తలు