లోయర్ ఆర్డర్ సిద్ధంగా ఉండాలి: కోహ్లీ

Submitted on 26 May 2019
virat kohli says, Lower order needs to be ready when top order fails

ఇండియా టాపార్డర్ గాడి తప్పిన సమయంలో జట్టును ఆదుకునేందుకు లోయర్ ఆర్డర్ సిద్ధంగా ఉండాలని కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్డేడియం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తలపడిన భారత్ 179పరుగులు చేయగలిగింది. కేవలం 39పరుగులకే టాపర్డర్ కుదేలైన పరిస్థితుల్లో జట్టు అంతటి స్కోరు చేస్తుందని ఊహించలేదని విరాట్ పేర్కొన్నాడు.

'ప్లాన్ ప్రకారం వెళ్లలేదు. మ్యాచ్ మంచి చాలెంజింగ్‌గా అనిపించింది. ఇంగ్లాండ్ కొన్ని ప్రదేశాల్లో వాతావరణం అనుకూలించదు. 50పరుగులకే 4వికెట్లు కోల్పోయినా 180పరుగుల టార్గెట్ నిర్దేశించడం చక్కని ప్రయత్నం' అని కెప్టెన్ కోహ్లీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.

'కొన్ని సమయాల్లో వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లలో టాపార్డర్ ఫెయిల్ అవొచ్చు. కానీ, హార్దిక్ పాండ్యా పరుగులు రాబట్టడం, ఎంఎస్ ధోనీ ఒత్తిడి తగ్గించడం, జడేజా హాఫ్ సెంచరీ ఇవన్నీ జట్టుకు మంచి బలాలు. మూడు విభాగాల్లోనూ జట్టు బాగా రాణించింది. ఫీల్డర్లు కీలకంగా వ్యవహరించారు. కొత్త బంతితో కొంచెం సీమింగ్ మాత్రమే అనుకూలించింది. స్వింగ్ పెద్దగా ప్రభావం చూపలేదు. స్పిన్నర్ల నుంచి అంతగా రాబట్టలేకపోయాం. రెండో వార్మప్ మ్యాచ్‌లో బాగా రాణించగలమని ఆశిస్తున్నా' అని కోహ్లీ వెల్లడించాడు.

Virat Kohli
india
Team India
cricket
2019 icc world cup
world cup 2019
2019 Cricket World Cup

మరిన్ని వార్తలు