తిట్టిపోస్తున్నారు: సెలక్టర్ అవుతానన్న సెహ్వాగ్

Submitted on 13 August 2019
Virender Sehwag gets trolled after expressing his desire to become selector

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ వైవిధ్యమైన ట్వీట్లతో మెప్పించే వీరేంద్ర సెహ్వాగ్‌కు సైతం కౌంటర్లు తప్పలేదు. తన సహచర క్రికెటర్లకు, ప్రముఖ సెలబ్రిటీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంలో వీరూ భాయ్ డిఫరెంట్ స్టైల్ వాడుతుంటాడు. 20మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న వీరూ.. ఆగష్టు 12న ఒక ట్వీట్ చేశాడు. 'నాకు జట్టు సెలక్టర్ కావాలని ఉంది. కానీ, నాకెవరు అవకాశం ఇస్తారు?' అని పోస్టు చేశాడు. 

ప్రస్తుతం టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ కొనసాగుతున్నారు. సెటైరికల్‌గా అనుకుంటుంది చెప్పేసే సెహ్వాగ్.. 
బహుశా ట్వీట్‌ ఉద్దేశ్యం టీమిండియా సెలక్షన్ కమిటీ వ్యవహారం బాలేదని తాను సెలక్టర్‌గా ఉంటే వేరేలా ఉండేదని అనుకొని ఉండొచ్చు. 10ఓవర్ల ఫార్మాట్‌లో మెరిసిన సెహ్వాగ్  గత సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్‌ పదవి నుంచి రాజీనామా చేశాడు. 

పలువురు సెహ్వాగ్‌కు అంత సీన్ లేదని తీసిపారేస్తుంటే, పాకిస్తాన్ కోచ్‌ ఈ మధ్యనే రాజీనామా చేశారు. ఆ పోస్టు ఖాళీగా ఉంటుంది దానికి అప్లై చేసుకొమ్మని సూచిస్తున్నారు. ఇంకొందరు నీకు కోచ్ అయ్యేంత సినిమా లేదు... నువ్వు సెలక్టర్‌వి ఎలా అవుతావని ప్రశ్నిస్తున్నారు. సెహ్వాగ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మై టీమ్ 11యాప్‌లో ఆల్రెడీ సెలక్టర్‌గానే ఉన్నావంటూ విమర్శలకు దిగుతున్నారు.  

virender sehwag
Sehwag
cricket
Selection

మరిన్ని వార్తలు