నడిరోడ్డుపై నరికేశాడు: విశాఖలో అందరూ చూస్తుండగా చంపిన యువకుడు

Submitted on 14 July 2019
Visakhapatnam Chodavaram Crime

కారణం ఏంటో తెలియదు కానీ, ఓ యువకుడు మరో యువకుడిని నడిరోడ్డు మీద దారుణంగా కత్తితో నరికి హత్య చేశాడు. విశాఖ జిల్లా చోడవరం పట్టణంలోని బీఎన్‌ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని యువకుడు, చోడవరం ఎడ్లవీధికి చెందిన కోన రాజేశ్‌ (21)ను కిరాతకంగా వేట కొడవలితో హత్య చేశాడు. కత్తితో నరకగానే రాజేష్‌ కుప్పకూలిపోయాడు. 

వెంటనే బైక్ తీసుకుని కొంత దూరం వెళ్లిన హంతకుడు మళ్లీ వెనక్కి వచ్చి కొడవలితో నరకి తలను వేరు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విశాఖలోని చోడవరంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన దృశ్యాలు అన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చనిపోయాడో లేదో అన్న అనుమానంతో మరోసారి కత్తితో వేటు వేయడం ఇదంతా చూస్తుంటే పగతో చేసిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై లక్ష్మీనారాయణ పరిశీలించారు. రాజేశ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరు? దీనికి గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. 

Visakhapatnam
Chodavaram
crime

మరిన్ని వార్తలు