ఓటేసిన జోథ్ పూర్ రాజ వంశీకులు..

16:19 - December 7, 2018

జైపూర్‌ (రాజస్థాన్) :  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చివరి రెండు రాష్ట్రాలైన తెలంగాణ, రాజస్థాన్‌లో శుక్రవారం పోలింగ్‌ కొనసాగుతోంది. జోధ్‌పూర్‌ రాజవంశీకులు గజ సింగ్‌, ఆయన సతీమణి సర్దార్‌పురా నియోజకవర్గంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. యువత నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. 100 ఏళ్లు పైబడిన వృద్ధులు సైతం కుటుంబీకుల సాయంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రామ్‌గఢ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మృతితో 199 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 4.77 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 

Don't Miss