ఓటేసిన పలువురు మంత్రులు..

11:50 - December 7, 2018

హైదరాబాద్: డిసెంబర్ 7 రాష్ట్రం అంతా ఓట్ల కోలాహలంగా వుంది. పలువురు రాజకీయా నేతలుతమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ ప్రచారంతో ఓట్లు అడిగిన నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోవటమే కాక అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆపద్ధర్మ మంత్రులు తమ సతీ సమేతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. 
పోలింగ్ ప్రారంభంలోనే మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ఈ క్రమంలో హన్మకొండ టీచర్స్‌కాలనీలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎల్లపల్లి గ్రామంలో.. మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జ్లిలా కొల్లాపూర్‌లో.. మంత్రి లకా్ష్మరెడ్డి మహబూబ్‌నగర్‌లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సమేతంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఓటేశారు.
 

Don't Miss