సిట్యువేషన్ వెరీ సీరియస్ : రైళ్లలో చెన్నైకి మంచినీళ్లు

Submitted on 12 July 2019
Water move in Chennai train with 50 bogies

చెన్నై మ‌హాన‌గ‌రం మంచి నీటి స‌మ‌స్య‌తో అల్లాడిపోతోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ఓ ప్రత్యేక రైలు ద్వారా మంచినీటిని తరలిస్తున్నారు. జోలార్‌పేట్ రైల్వే స్టేష‌న్ నుంచి బయ‌లుదేరిన నీళ్ల రైలు జూలై 12వ తేదీ శుక్రవారం ఉదయం చెన్నై సిటీకి చేరుకుంది. 50 బోగీల ద్వారా మంచినీళ్లను తీసుకొచ్చారు అధికారులు.

రైల్వే వ్యాగ‌న్ల ద్వారా నీటిని చెన్నైకు తీసుకురావటంతో తాగటానికి నీళ్లు అందుబాటులో వచ్చాయి. విల్లివ‌క్కం దగ్గర రాష్ట్ర మంత్రి నీళ్ల రైలుకు స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. వ్యాగ‌న్ల‌లో ఉన్న నీటిని.. కిల్‌పాక్ వాట‌ర్ వ‌ర్క్స్‌కు స‌ర‌ఫ‌రా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి న‌గ‌ర‌ంలోని అన్ని ప్రాంతాలకు స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. మొత్తం రెండు రైళ్ల ద్వారా నీటిని త‌ర‌లించ‌నుండగా.. ఒక రైలు జోలార్‌పేట్ నుంచి, మ‌రో రైలు అవ‌ది రైల్వే యార్డ్ నుంచి బ‌య‌లుదేరనున్నాయి. రెండు రైళ్లలోను 2.5 మిలియన్ల లీటర్ల  నీరు ఉంది. 

Chennai
Water
Problem
50 bogies move
train

మరిన్ని వార్తలు