కలిసి చచ్చిపోదాం రా: 12రోజుల్లో 10వేల మెసేజ్‌లు

Submitted on 15 August 2019
"We Die Together": Man Sent Woman 10,000 Texts In 12 Days, Say Police

పూరీ జగన్నాథ్ సినిమాలోలా ఇది వూర మాస్ పంచ్ కాదు. జార్జియాలోని ప్రాంతంలో ఓ వ్యక్తి 12రోజుల్లో 10వేల మెసేజ్‌లు పంపుతూ మహిళను వేధించిన ఘటన ఇది. నికోలస్(48) అనే వ్యక్తి మహిళకు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యాడు. నెంబర్ ఎలా దొరికిందో తెలియదు కానీ, ఇబ్బందికరమైన మెసేజ్‌లు పంపడం ఆరంభించాడు. 

'నువ్వు నేను, కలిసి చచ్చిపోదాం', 'ట్యాంక్ ఖాళీ అయ్యేంతలా అమెరికాలోని చర్చిలు మొత్తం తిరిగొద్దాం', అంటూ మెసేజ్‌లు చేసేవాడట. ఒకానొక సందర్భంలో మహిళ బంధువుల ఇంటి ముందు బట్టల బాక్స్ తెచ్చిపెట్టి.. దాంతో పాటు ఓ మెసేజ్ పెట్టాడు. అందులో 'ప్లేన్ ఎక్కి పారిపోదాం రా' అని రాసి ఉంది. 

ఈ మెసేజ్‌లు అన్నీ ఏప్రిల్ 5నుంచి పంపుతుండటంతో విసుగు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ విషయం తెలుసుకున్న నెల్సన్ తాను ఆత్మహత్య చేసుకునే టైప్ కాదని కావలంటే జైలుకు వెళ్తానంటూ మళ్లీ మెసేజ్ చేశాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరచగా తనపై జాలిచూపించాలని జడ్జిని కోరాడు. పట్టించుకోని న్యాయస్థానం తనకు శిక్ష విధించింది. 

We Die Together
man
Woman 10
000 Texts
Police

మరిన్ని వార్తలు