లంచం తీసుకోం: ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయం.. అభినందించిన కలెక్టర్

Submitted on 12 July 2019
We Will Not Bribery  Mahabubnagar Panchayat Raj, Revenue Employees Decision

ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అంటు ఓ కవి చెప్పినట్లుగా..ఒక్క అడుగుతో ప్రారంభమైన మంచి పని వెంట ఎన్నో అడుగులు పడతాయి. అటువంటి మంచి నిర్ణయంవైపు అడుగులు వేశారు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఉద్యోగులు. ఇకపై ‘లంచాలు తీసుకోం’ అంటు  ప్రతిజ్ఞ చేశారు.

గవర్నమెంట్ ఆఫీసుల్లో పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిందే. అమ్యామ్యాలు లేకుంటే పనివైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఇదీ ప్రస్తుతం ఇంచుమించు ప్రతీ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న పరిస్థితి. కానీ ‘మేం లంచం తీసుకోం మాపై భరోసా ఉంచండి’’ అంటున్నారు మహబూబ్ నగర్ పంచాయితీ రాజ్ శాఖ,రెవెన్యూ శాఖల్లో ఉద్యోగులు.

అవినీతిని రూపు మాపేందుకు తామంతా నిర్ణయించుకున్నామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్‌కు స్పష్టం చేశారు. మంచిపని తలచుకున్నప్పుడే ప్రారంభించాలని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలో అవినీతి రహితం సమాజం కోసం శుక్రవారం (జులై 12) నుంచే తాము లంచాలకు స్వస్తి చెప్పేందుకు శ్రీకారం చుడుతున్నామని దీని కోసం తామంతా నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్‌కు తెలిపారు.
 
గతంలో ఏం జరిగిందో ఇప్పుడది అప్రస్తుతం..కానీ మార్పు మంచిదే అన్నట్లుగా మహబూబ్ నగర్ జిల్లాలోని పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల సిబ్బంది తీసుకున్న ఈ నిర్ణయం అభినందించాల్సిందే. ఇకపై మా రెండుశాఖల్లో అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందిస్తామని పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల ఉద్యోగులు స్పష్టంచేయగా.. వారు తీసుకున్న నిర్ణయం పట్ట కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆనందం వ్యక్తం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ జడ్పీ మీటింగ్ హల్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ సిబ్బంది తీసుకున్న మంచి నిర్ణయాన్ని  పోస్టర్‌ను విడుదల చేశారు. రెండుశాఖల సిబ్బంది ముందుకు రావడం మంచి శుభపరిణామనీ, వీరిని ఆదర్శంగా తీసుకుని మిగితా శాఖల వారు కూడా ముందుకు రావాలని సూచించారు.

మా భరోసా అనే కార్యక్రమాన్ని గ్రామగ్రామాన విస్తృతమైన ప్రచారం చేయాలని అందుకు అందరూ సహకారమందించాలని మహబూబ్ నగర్ జిల్లాకలెక్టర్ రోనాల్డ్ రోస్ కోరారు. జిల్లాలో ఎక్కడైనా ఈ రెండు శాఖల సిబ్బందితో పాటు ఇంకెవరైనా ప్రజల నుండి లంచాలు తీసుకున్నా, అడిగినా 08542-241165 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయమని 24గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ వెల్లడించారు

Mahabubnagar
Panchayat Raj
Revenue
employees
decision
bribery
Collector Ronald Ross


మరిన్ని వార్తలు