గుజరాత్ కి తప్పిన గండం : దిశ మార్చుకున్న వాయు తుపాను

Submitted on 13 June 2019
Weather Forecast, Cyclone Vayu changes direction

గుజరాత్ ని వణికించిన వాయు తుపాను దిశ మార్చుకుంది. వాయు తుపాను సముద్రం దిశగా కదులుతోందని, గుజరాత్ లో తీరం తాకదని భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది. గురువారం (జూన్ 13,2019) ఉదయం ఐఎండీ ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ తుపాను కేటగిరీ 2 లో ఉంది. అది కాస్త బలహీన పడి కేటగిరీ 1 గా మారుతుందని చెప్పారు. అయితే వాయు తుపాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. దీని కారణంగా నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను.. నిన్నటి వరకు గుజరాత్ దిశగా కదిలింది. గురువారం మధ్యాహ్నం తుపాను గుజరాత్ తీరం తాకుతుందని అంచనా వేశారు. తీరం తాకే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను గుజరాత్ తీర ప్రాంతానికి తరలించారు. తీర ప్రాంతం నుంచి 3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు తుపాను దిశ మార్చుకుందన్న వార్తతో గుజరాత్ తీర ప్రాంత వాసులు కొంత రిలీఫ్ పొందారు.

వాయు తుపాను గుజరాత్ తీర ప్రాంతం ద్వారాక, వెరావల్ మధ్య గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తీర తాకుతుందని ముందుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పుడు దిశ మార్చుకుందని తెలిపారు. వాయు తుపాను కారణంగా గుజరాత్ తీర ప్రాంతంలోని 10 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజులు(జూన్ 12, 13) సెలవులు ఇచ్చారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. ఐఏఎఫ్ హెలికాపర్లను సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యల కోసం 300 మెరైన్ కమాండోలను రంగంలోకి దించారు. పోర్ బందర్, డయూ, భావ్ నగర్, కేశోడ్, కండ్లాలో విమాన సర్వీసులను 24 గంటల పాటు నిలిపివేశారు. 70 రైళ్లను రద్దు చేశారు.

vayu cyclone
guajarat
storm
Change
direction
land fall

మరిన్ని వార్తలు