వెదర్ అప్ డేట్ : రెండు రోజులు వర్షాలు

Submitted on 20 August 2019
rains for telangana

ఉత్తర జార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తా తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని  హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళ(ఆగస్టు 20,219), బుధవారాల్లో(ఆగస్టు 21,2019) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని  పలు ప్రాంతాల్లో వర్షం పడింది.

పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 9 సెంమీ, రామగుండంలో 8 సెమీ, మంథనిలో 3 సెమీ, జనగాంలో 6 సెమీ, నర్మెట్టలో 4 సెమీ, జఫర్ గడ్ లో 3 సెమీ, భదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 4 సె..మీ, అశ్వారావుపేట, మణుగూరులో 3 సెమీ చొప్పున, కొండపాక(సిద్ధిపేట), భూపాలపల్లిలో 4 సెమీ చొప్పున, చెన్నూరు(మంచిర్యాల), మంచిర్యాల, బెజ్జూరు(కొమురం భీం), పరకాల(వరంగల్ రూరల్),  సిర్పూరు(కొమురం భీం), పర్వతగిరి (వరంగల్ రూరల్), దహేగాన్(కొమురం భీం), హన్మకొండలో 3 సెమీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

కాగా, రెండు మూడు రోజులుగా హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. ఎండలు మండిపోడుతున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సూర్యూడు నిప్పులు కురిపిస్తున్నాడు. చెమట్లు పట్టిస్తున్నాడు. వర్షాకాలం సమయంలో ఇలాంటి వాతావరణం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు నగరవాసులు. ఎండవేడి, ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. ఏసీలు, ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి. మళ్లీ సమ్మర్ వచ్చేసిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ప్రముఖ బ్యాంకు కీలక నిర్ణయం : డెబిట్ కార్డులకు గుడ్ బై

Telangana
Rains
Update
Weather
Low pressure

వాతావరణ వార్తలుమరిన్ని..