ఇదో వైవిధ్యం : కప్పల పెళ్లికి శుభలేఖలు కొట్టించారు

Submitted on 8 June 2019
Wedding Of Frogs In Udupi For Rains

కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు పడతాయనే నమ్మకం ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తోంది. వర్షాలు కురిసి సంతోషంగా ఉండాలని కప్పలకు పెళ్లి చేస్తారు రైతులు. ఏరులు పారాలీ, పంటలన్నీ పండాలీ, చెరువులన్నీ నిండాలని కర్నాటక రాష్ట్రం ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాన దేవున్ని ప్రార్థిస్తూ స్థానికులు కప్పలకు వైభవంగా పెళ్లి తంతు నిర్వహించారు.

పెళ్లంటే ఏదో అల్లాటప్పాగా చేయలేదు. గ్రాండ్ గానే చేశారు. కప్పల పెళ్లికి శుభలేఖలు కూడా కొట్టించారు. ఊరంగా పంచిపెట్టారు. కప్పల పెళ్లి తర్వాత అతిధులకు భోజనాలు కూడా ఏర్పాటు చేయటం ఇక్కడ వెరీ వెరీ విశేషం. ఉడుపి కిదియూర్‌ హోటల్‌ ఆవరణలో ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించారు.

2019, జూన్ 8వ తేదీ శనివారం ఉదయం 12.05 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఉడుపి నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లి బృందం ఊరేగింపు జరిగింది. పాత డయాన సర్కిల్‌ వైపు నుంచి కవి ముద్దణ మార్గంలో ఉడుపి కిదియూర్‌ హోటల్‌ వరకు భారీ ఎత్తున.. బ్యాండ్ బాజాలతో సాగింది ఈ తంతు. జనం భారీగానే తరలివ చ్చారు. వధూవరులుగా ఉన్న కప్పలను దీవించి వెళ్లారు. వింతలు - విశేషాల్లో ఇదో రకం.. 

Wedding Of Frogs
Udupi For Rains
2019

మరిన్ని వార్తలు