సాహో వాయిదా: గ్యాంగ్‌ లీడర్ కు వచ్చిన కష్టాలు!

Submitted on 17 July 2019
What Will Happen To Gang Leader`s Release Date

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తోన్న సినిమా సాహో. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. ప్రభాస్ అభిమానులు ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తోందా..అని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ సినిమాను రెండు వారాలు లేటుగా ఆగస్ట్ 30కి మార్చినట్లు తెలిసింది. 

సినిమాకు సంబంధించి డబ్బింగ్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయట. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలో ఇంకా క్లారిటీకి రాలేదంట మూవీ యూనిట్. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం కాబట్టి ఎలాంటి నష్టాలు రాకుండా ‘సాహో’ సోలోగా బాక్సాఫీసును ఏలే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  అందుకనే ఆగస్టు 30వ తేదీన సినిమాని రిలీజ్ చేస్తున్నారట. 

దీంతో గ్యాంగ్‌ లీడర్‌ కు పెద్ద కష్టం వచ్చి పడింది. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన మూవీ యూనిట్‌ సినిమాను ఆగస్టు 30 రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా వాయిదా పడటంతో. గ్యాంగ్ లీడర్‌ రిలీజ్‌ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది.

Gang Leader
Sahoo
Nani
Prabhas

మరిన్ని వార్తలు