Own స్టిక్కర్ క్రియేట్ చేయాలంటే : వాట్సాప్ లో కొత్త స్టిక్కర్ ప్యాక్

Submitted on 12 June 2019
WhatsApp gets a new sticker pack, Create Your Own Sticker you can download 

ప్రముఖ ఫేస్ బుక్ సొంత మెసేంజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త కొత్త అప్ డేట్స్, ఫంక్షనాల్టీ ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. బ్రాండ్ న్యూ ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకోస్తోంది. వాట్సాప్ లో అప్ డేటడ్ స్టిక్కర్లతో పాటు కొత్తగా బ్రాండ్ న్యూ స్టిక్కర్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది. కొత్త స్టిక్కర్ ప్యాక్.. ‘Opi’ పేరుతో వాట్సాప్ రిలీజ్ చేసింది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ బేసిడ్ యాప్ యూజర్లకు ఈ కొత్త స్టిక్కర్ ప్యాక్ ను అందుబాటులోకి తెచ్చింది. మీ స్మార్ట్ ఫోన్ వాట్సాప్ లో కొత్త స్టిక్కర్ ప్యాక్ ఎలా యాక్సస్ చేసుకోవాలి.. డౌన్ లోడ్ చేసుకోవాలో తెలియదా? ఈ కింది సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు.. ఈజీగా స్టిక్కర్ ప్యాక్ ను మీ వాట్సాప్ లో పొందవచ్చు. 

ఒకవేళ.. మీరు డౌన్ లోడ్ చేసుకున్న కొత్త స్టిక్కర్ ప్యాక్.. మీకు నచ్చకుంటే.. అక్కడే డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు. లేదంటే.. ప్రత్యేకించి స్టిక్కర్ ప్లాక్ కావాలనుకుంటే.. యాప్ లో.. All Stickers ఆప్షన్ పై ట్యాప్ చేయండి. వాట్సాప్ అందించే స్టిక్కర్ ప్యాక్స్ కాకుండా.. మీ వాట్సాప్ అకౌంట్లో మీరే కొత్త స్టిక్కర్ ప్యాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు.

ఇందుకోసం మీరు థర్డ్ పార్టీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ‘స్టిక్కర్ మేకర్ ఫర్ వాట్సాప్ ’ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ ఆప్ స్టోర్ నుంచి కస్టమైజడ్ స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  ఈ స్టిక్కర్లను ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లో సొంత స్టిక్కర్ ప్యాక్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడండి. 

* మీ ఫోన్ లో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయండి. 
* అకౌంట్.. వ్యక్తిగత లేదా గ్రూపు చాట్ విండోను ఓపెన్ చేయండి.
* లెఫ్ట్ కార్నర్ దగ్గర.. స్టిక్కర్స్ ఆప్షన్ పై ట్యాప్ చేయండి. 
* ఇక్కడ మీకో మెనూ కనిపిస్తుంది.. GIF, Stickers అని ఉంటుంది.
* ట్యాప్ ఆన్ స్టిక్కర్ ఐకాన్ 
* మెనూ రైట్ కార్నర్ పై ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
* ఇక్కడ అన్ని రకాల స్టిక్కర్లు కనిపిస్తాయి.
* టాప్ లో కొత్త Opi స్టిక్కర్ ప్యాక్ చూడవచ్చు. 
* ట్యాప్ అండ్ డౌన్ లోడ్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

సొంత స్టిక్కర్ క్రియేట్ చేయాలంటే  : 
* స్టిక్కర్ మేకర్ యాప్ ఓపెన్ చేయండి. 
* క్రియేట్ న్యూ స్టిక్కర్ ప్యాక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* యాడ్ స్టిక్కర్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. క్రియేట్ న్యూ స్టిక్కర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
* అవసరమైన Imageను సెలక్ట్ చేసుకోండి.. స్టిక్కర్ గా కన్వర్ట్ చేసుకోండి.
* ఫోన్ గ్యాలరీ లేదా గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోలతో కూడా స్టిక్కర్ క్రియేట్ చేసుకోవచ్చు.
* సెలక్ట్ చేసిన Imageను Crop చేసుకోండి.
* స్టిక్కర్ ప్యాక్ పబ్లీష్ చేయండి.. 
* వాట్సాప్ అకౌంట్లో ఇతర స్టిక్కర్లతో పాటు క్రియేట్ చేసిన స్టిక్కర్లు కూడా ఆటోమాటిక్ గా కనిపిస్తాయి. 

 WhatsApp
 new sticker pack
Create Own Sticker
Opi sticker pack

మరిన్ని వార్తలు