రోడ్ బ్లాక్..వాహనం దిగి నడిచి వెళ్లి గిరిజనుల సమస్యలు తెలుసుకున్న పవన్..

11:30 - November 5, 2018

తూర్పుగోదావరి : పవన్ రాకను అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు రోడ్డుపై భారీగా మట్టిని పోసి మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ వాహనం దిగి మట్టిని దాటుకుని  కాలినడకన వెళ్లి గిరిజనులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఈ సందర్బంగా మాట్లాడిన పవన్ మాఫియా దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే తన పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డును బ్లాక్ చేశారని మండిపడ్డారు. మాఫియా అడ్డుకున్నా తన పర్యటన ఆగదని పవన్ స్పష్టం చేశారు. జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. స్థానిక గిరిజనులకు మంచినీటి సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మైనింగ్ మాఫియా గిరిజనుల భూములను భయపెట్టి లాక్కుందని ఆరోపించారు. ఇప్పటికీ అసలు భూముల పట్టా గిరిజనుల పేరు మీదే ఉందని వెల్లడించారు. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో పవన్ నిన్న రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై భారీగా మట్టివేయటంతో వాహనం వెళ్లటానికి వీలు లేకపోవటం వాహనం దిగి పనవ్ కళ్యాణ్ నడుచుకుంటు గిరిజనుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

Don't Miss