వైడ్ యాంగిల్

Tuesday, November 28, 2017 - 21:50

అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టు... ఈ ఇంటర్నెట్ యుగంలో పైపై డెకరేషన్లతో అసలు రంగు దాగుతుందా? నగరాన్ని నివాసయోగ్యంగా మార్చటం, సుందరంగా మలచటం అనేది ఓ నిరంతర ప్రక్రియ. అది రాత్రికి రాత్రో, ఓ వారం రోజుల్లోనో చేసేది కాదు. దానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల పట్ల గౌరవం ఉండాలి. కానీ, అతిధుల ముందు గొప్పలుపోయే ప్రభుత్వాలకు సామాన్యుడి సంగతి పట్టదని మరోసారి రుజువయింది. వారం...

Monday, November 27, 2017 - 20:20

మెట్రో రైలు పరుగులు తీసే సమయం దగ్గరకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న భాగ్యనగర వాసి పిల్లర్లపై పరుగులు తీసే మెట్రోలో పయనించబోతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో పాటు, మరికొన్ని సందేహాలు వినిపిస్తున్నాయి. సదుపాయాలు, పార్కింగ్ గురించి పలుప్రశ్నలు వినిపిస్తుంటే, అసలీ మెట్రో సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా అనే సందేహాలూ.... టికెట్ రేట్లు అనూహ్యంగా పెంచిన తీరుపై విమర్శలూ...

Friday, November 24, 2017 - 20:43

28ఏళ్ల క్రితం తెలుగు తెరపై ఓ అద్భుతం ఆవిష్కృతమయింది. ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుంది? నాటి శివ రేంజ్ లో అద్భుతాలు సృష్టిస్తుందా? తెలుగు తెర దశ దిశను మారుస్తుందా? మరో మైలు రాయిగా మారుతుందా? తనకు మైండ్ దొబ్బింది కానీ.. ఇంకా గుజ్జు అయిపోలేదు అంటున్న వర్మ... ఎళాంటి సంచనాలు సృష్టించబోతున్నాడు? తెలుగు సినిమాపై చెరగని ముద్ర...

Thursday, November 23, 2017 - 20:28

గుజరాత్ ఎన్నికలు బీజెపీ గుండెల్లో గుబులు రేపుతున్నాయా?పరిస్తితి రివర్స్ లో కనిపిస్తోందా?కొన్నేళ్లుగా సాగుతున్న కమలం వెలుగులు మసకబారుతున్నాయా?అందుకే బీజెపీ ఇప్పుడు కంగారు పడుతోందా? అవునంటున్నాయి విపక్షాలు.. గుజరాత్ లో ఏం జరుగుతోంది? బీజెపీ, కాంగ్రెస్ మధ్యలో పాటీదార్లు ....ఈక్వేషన్ ఎలా మారుతోంది? ఎన్నికలు, అధికారం దీని చుట్టూ రాజకీయ పక్షాల ఎత్తులు పై ఎత్తులూ సాగుతుంటాయి....

Tuesday, November 21, 2017 - 20:06

అందరం బాకీ పడ్డాం.. తిరిగి చెల్లించలేనంత బాకీ పడ్డాం..వ్యక్తులుగా, వ్యవస్తగా లెక్క తెలియనంతగా రైతన్నకు రుణపడి ఉన్నాం... మరి ఈ బాకీని తీర్చటానికి మార్గం లేదా? ఉంది.. అది మనం ఎన్నుకున్న ప్రభుత్వం ద్వారా, పాలకుల ద్వారా రైతన్న కళ్లలో వెలుగు నింపటం ద్వారా.. ఆ బాకీ తీర్చగలం. కానీ, ఇవే వీ పట్టని ప్రభుత్వాలు దేశానికి తిండి పెట్టే రైతన్న తాను నేల కూలుతుంటే చోద్యం చూస్తున్నాయి. గంట...

Monday, November 20, 2017 - 20:37

ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు..హామీలు గాల్లో మాటలయ్యాయి.. రాజధాని స్వప్నాలు, స్వర్ణాంధ్ర వాగ్దానాలు ప్రజల కళ్లముందే ఉన్నాయి. రాజకీయ ఎత్తుగడలతో, కుమ్మక్కులతో ప్రజలను మోసగించలేరు.. అందుకే ఈ అధ్యాయం ముగియలేదు.. ఈ పోరు ఆగలేదు.. అంటున్నాయి విపక్షాలు.. ఈ క్రమంలో ప్రత్యేక హోదా గురించి ఛలో అసెంబ్లీ పేరుతో జరిగిన ఉద్యమాన్ని పోలీసు జులుంతో అణచివేసే ప్రయత్నాలు శతవిధాలా చేసిన తీరు...

Wednesday, November 15, 2017 - 20:11

కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట...గరగపర్రు, మంథని, నేరెళ్ల, కందుకూరు, నవీపేట....ఎన్ని గ్రామాలు? ఎందరు బాధితులు? ఇంకా ఎన్నేళ్లు? అణిగిమణిగి బతకాలని దళితులను అనునిత్యం శాసిస్తున్న ఆధిపత్య కులాల అహంకారానికి, పెత్తందారీ వ్యవస్థ స్వభావానికి ముగింపు ఎప్పుడు? చేసిన తప్పేమీ లేదు.. కేవలం ప్రశ్నించారు. అతగాడి అక్రమాన్ని అడ్డుకున్నారు.. అంతే పెత్తందారీ లక్షణం నిద్రలేచింది. ఆధిపత్య కుల...

Tuesday, November 14, 2017 - 20:37

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన...

Monday, November 13, 2017 - 20:51

పిల్లలకు కూడా హక్కులుంటాయా? వాళ్లకేం తెలుసు..? పెద్దవాళ్లు ఏది చెప్తే అది చేయాల్సిందే.. ఇంకా వినకపోతే వీపు పగలగొట్టాల్సిందే.. ఈ మాటలు మన సమాజంలో కొత్తవేం కాదు. కానీ, వాళ్లకూ హక్కులుంటాయి. సీతాకోక చిలుక రెక్కలపై ఎగిరే రంగురంగుల బాల్యాన్ని చిదిమేసే హక్కు... ఆఖరికి తల్లిదండ్రులకు కూడా లేదని.. గుర్తించాల్సిన సమయం వస్తోంది. ఈ క్రమంలో విద్య, వైద్యం. అక్రమ రవాణా, పేదరికం.. ఇలా...

Thursday, November 9, 2017 - 21:36

మామూలుగా గాలి పీల్చక పోతే చస్తారు.. కానీ, అక్కడ గాలి పీలిస్తే చస్తారు.. అది మామూలు గాలి కాదు..  మూతికి మాస్కు లేకుండా బయటికి రాలేని పరిస్థితి.. ముందున్న వాహనం కనిపించని దుస్థితి.. వాయు కాలుష్యం అన్ని వైపులనుంచి కప్పేస్తుంటే హస్తిన ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. దీంతో దేశ రాజధాని కాస్తా కాలుష్యానికి క్యాపిటల్ గా మారింది. ఏటా ఢిల్లీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను చూస్తోంది....

Wednesday, November 8, 2017 - 21:25

సరిగ్గా ఏడాది క్రితం... రాత్రి ఎనిమిది గంటలకు అంటే, 2016 నవంబర్ 8న, దాదాపు ఇదే సమయానికి టీవీలో ప్రధాని మోడీ ప్రత్యక్షమయ్యారు.. దేశ ప్రజానీకం తెల్లబోయే ప్రకటనలు చేశారు.. 500, వెయ్యి నోట్లకు అంత్యక్రియలు చేసి, దేశమంతటినీ క్యూలో నిలబెట్టిన సందర్భానికి ఏడాది గడుస్తోంది.. మరి డీమానిటైజేషన్ తో సాధించినదేమిటి? చెప్పిందొకటి, జరిగింది మరొకటా..? ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టినట్టు...

Tuesday, November 7, 2017 - 21:25

సరిగ్గా వందేళ్ల క్రితం.. ఓ కొత్త ఉదయం వెల్లివిరిసింది. మరో ప్రపంచం దిశగా ప్రపంచాన్ని తీసుకెళ్లే బాటకు పునాదులు వేసింది. చరిత్రకు కొత్త పాఠాలు నేర్పింది. నిరంకుశ పాలకుల పీఠాలను కూకటి వేళ్లతో కబళించింది. ప్రజలంతా అత్యున్నత నాగరిక విలువలతో, సమున్నత వికాసంతో జీవించాలంటే సరైన మార్గాన్ని చూపింది. చిన్న ఒడిదుడుకులతో తాత్కాలిక వైఫల్యం ఎదురైనా  ఎర్రజెండా రెపరెపలే మానవాళికి అంతిమ...

Friday, November 3, 2017 - 20:23

పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. కానీ, ఓ పక్క సర్కారులో అసహనం.. మరో పక్క పాదయాత్రకు సై అంటున్న వైసీపీ శ్రేణులు.. వెరసి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ తరుణంలో జగన్ పాదయాత్రకు అడ్డంకులున్నాయా? ప్రభుత్వం అడ్డుపడుతుందా? లేక సవ్యంగా సాగి......

Monday, October 30, 2017 - 21:01

పునాదులు కదిలిపోతున్నాయా? అసలు ఉనికిలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోందా? ఒకనాటి వెలుగులు అంతమయినట్టేనా? సైకిల్ ఫ్యూచర్ లో ఒక రాష్ట్రానికే పరిమితం కాబోతోందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ  ఫ్యూచరేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. అనూహ్య పరిణామాలు.. రేవంత్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో టీడీపీ ఇక నామ మాత్రమే అనే వాదనలు. మిగతా నేతలు, కేడర్ కూడా పార్టీ మారుతున్నారనే వాదనలతో...

Friday, October 27, 2017 - 21:40

వస్తుందా? నిజమేనా? మనకు అంత అవసరమా? ఎప్పటికవ్వాలి? వచ్చాక చూద్దాం లే..!! ఇలా అనేక కామెంట్స్ ...కొన్నేళ్లుగా నగరవాసి వింటూ ఉన్నాడు. ఫైనల్ గా అన్ని విమర్శలకు, అవాంతరాలకు, ఆలస్యాలకు సమాధానంగా మెట్రో పట్టాలెక్కబోతోంది. తొలివిడత ఓ 30 కిలోమీటర్లు పరుగులు తీయబోతోంది. మరి మెట్రో నగర ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందా? నగర ప్రజారవాణా వ్యవస్థను సమూలంగా మారుస్తుందా? ఇదే ఈ రోజు వైడాంగిల్...

Thursday, October 26, 2017 - 21:20

పోలవరానికి పీటముడి ఎందుకు పడింది? కాంట్రాక్టర్ ను మార్చాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఎందుకు ఆగిపోయాయి. పనులు ఆగిపోతే ప్రభుత్వం సైలెంట్ గా ఎందుకు చూస్తోంది. కొత్త టెండర్ల అవసరమేంటి? అంచనా వ్యవయం పెంచాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇవన్నీ పోలవరం చుట్టూ ఉన్న అనేక ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలేమిటి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.....

Monday, October 23, 2017 - 20:21

ఈ భూమిపై మానవ జాతి అడుగులకి ఎన్నేళ్ల వయసుంటుంది? దీనికి రకరకాల ఆధారాలు వెతికి అందాజుగా ఓ అంకె చెప్పగలరు సైంటిస్టులు.. మరి మానవజాతి ఈ భూమ్మీద ఇంకా ఎంత కాలం బతుకుతుంది? చెప్పగలరా? మహా అయితే ఓ వెయ్యేళ్లు మాత్రమే అంటున్నారు సైంటిస్టులు. అవును మరి... పక్కలో బాంబును పెట్టుకుని, పీలిస్తే చచ్చేంత ప్రమాదకర వాయువుల్ని నింపుకుని, తాకితే నాశనమయ్యే రసాయనాల్ని పోగేసుకుని, భూమిని...

Friday, October 20, 2017 - 20:33

ఇది ఆకలి భారతం కథ. స్వతంత్రం వచ్చిఆరు దశాబ్దాలవుతున్నా తీరని వ్యథ.. తినడానికి తిండిలేక నిత్యం నానా అగచాట్లు పడుతున్న కోట్లాది భారతీయుల గాథ.. దేశంలో కుబేరుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కానీ, ఇదే భారత దేశంలో కోట్లాది మంది ఆకలిదప్పులతో అల్లాడుతున్నారంటే నమ్మగలరా? మరి ప్రభుత్వ పథకాలేమవుతున్నాయి? జిడిపి లెక్కలు, సెన్సెక్స్ సూచీల భ్రమల మధ్య కాలాన్ని వెళ్లదీసే ప్రభుత్వాలు హంగర్...

Thursday, October 19, 2017 - 20:12

కోటికోట్ల దీప కాంతుల సందడి.. చీకటిని వెళ్లగొట్టి వెలుతురును పూయించే సందర్భం. కొత్త బట్టలు, పిండివంటలు, ఇంకా దీపాల వరుస.. ఇదేనా దీపావళి.. ?ఎన్నో ఏళ్లుగా చూస్తున్న పండుగ.. దీని గురించి కొత్తగా చెప్పుకునేది... మాట్లాడుకునేది ఏం ఉంటుంది అనుకుంటున్నారా? కాలంగడిచే కొద్దీ కొత్త నిర్వచనాలు పుడతాయి. వేడుకలకు కొత్త అర్థాలు మొదలవుతాయి. అనర్థాలూ జతకూడుతాయి.. వెలుగునిచ్చే బదులు మరింత...

Monday, October 16, 2017 - 21:11

వరుసగా ఒకరి తర్వాత మరొకరు.. కన్నవారికి కన్నీళ్లు మిగులుస్తున్నారు.. బంగారు భవిష్యత్తును కాదనుకుని వెళ్లిపోతున్నారు.. ఏ ఒత్తిడి ఆ చిన్నారులను చిదిమేస్తోంది? ఏ భారం వారిని ఆత్మహత్య దిశగా నెడుతోంది? మార్కుల వేటలో,  ర్యాంకుల గోలలో కార్పొరేట్ విద్యా సంస్కృతి చిన్నారుల చావులకు కారణమౌతోందా? ప్రభుత్వాన్నా, తల్లిదండ్రుల్నా, కార్పొరేట్ విద్యావ్యవస్థనా ఎవర్ని బాధ్యుల్ని చేయాలి? ఇదే ఈ...

Thursday, October 12, 2017 - 21:18

అవినీతి రహిత పాలన అంటారు.. విపక్షాలను ఇరుకున పెట్టడానికి అన్ని అధికారాలను ఉపయోగిస్తారు. కానీ, కమల దళం చేస్తున్న ఘనకార్యాలను మాత్రం పట్టించుకోరు. దేనిపైనా సరైన దర్యాప్తు జరగదు. ఓ పక్క బీజెపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడి పుత్ర రత్నంపైనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ సంగతేమో కానీ, రివర్స్...

Wednesday, October 11, 2017 - 20:56

పురుగులను చంపుతాయనుకున్నారు..  కానీ, వాళ్ల ప్రాణాలనే బలితీసుకున్నాయి..పొలాన్ని బాగు చేద్దామనుకున్నారు... వారి కుటుంబాల్లోనే చీకటి నిండింది.. పంటకు ఆరోగ్యాన్నిస్తుందని నమ్మారు.. కానీ, వారి జీవితాలను ఊహించని పెను ప్రమాదంలోకి నడిపించాయి. రైతన్నలకు అవగాహన లేదు. ప్రభుత్వాలను చిత్తశుద్ధిలేదు. పురుగుమందుల కంపెనీలకు లాభాలు తప్పమరేం అక్కర్లేదు. ఫలితం పత్తిచేనులో రైతన్న...

Tuesday, October 10, 2017 - 21:27

కోటికి పైగా జనాభా..హైటెక్ రంగులు..ఎత్తైన భవంతులు..గొప్ప గొప్ప రోడ్లు.. ఇది నగరానికి ఒక కోణం. గట్టిగా వర్షం పడితే మన నగరంలో రెండో కోణం కనబడుతుంది. ప్రస్తుతం నగరవాసులు మహానరకంలా ఫీలవుతున్న మన మహానగరం పరిస్థితిపై ఈరోజు వైడ్ యాంగిల్ కథనం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, October 4, 2017 - 21:34

స్కూల్లో కాల్పులు..థియేటర్ లో కాల్పులు..యూనివర్సిటీ క్యాంపస్ లో కాల్పులు.. మ్యూజిక్ కాన్సర్ట్ లో కాల్పులు ..నడిరోడ్డుపై కాల్పులు..ఎవడు ఎప్పుడు ఎందుకు ఎలా చెలరేగిపోతాడో, ఏ తుపాకీ ఎప్పుడు పేలుతుందో, ఏ వేలు ట్రిగ్గర్ నొక్కుతుందో ఊహించలేరు.. ఫలితం.. తుపాకీ గుళ్లు అమాయకుల దేహాలనుంచి దూసుకెళ్తున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. అమెరికాలో నానాటికి...

Friday, September 22, 2017 - 20:30

అరవై కెమేరాలు..అనుక్షణం పరిశీలించే కళ్లు.. కోట్లాది ప్రేక్షకులు.. చివరకు మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు.. వెరసి ఇప్పుడు సీజన్ వన్ టైటిల్ ఎవరిదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. బిగ్ బాస్ షో మొదలయ్యేపుడు..ఈ గందరగోళం తెలుగులోకి కూడా వచ్చిందా అనే వాదనలు వినిపించాయి. ప్రేక్షకుల్లోని వాయరిస్టిక్ ఇంట్రస్ట్ ని రేటింగ్ మార్చుకునే ఈ ప్రోగ్రామ్ ఇతర భాషల కంటే తెలుగులో కాస్త క్లీన్ గానే...

Pages

Don't Miss