వైడ్ యాంగిల్

Thursday, February 4, 2016 - 20:35

పది నెలలు కాలేదు. అప్పుడే సీన్ మారిపోయింది. ముఫ్తీ మహ్మద్ ఉన్నప్పుడు ఎలాగూ గట్టెక్కించాడు. ఆయన గతించాక మ్యాటర్ క్లియర్ అవుతోంది. రెండు పార్టీల మధ్య ఎంతటి అగాధం ఏర్పడిందో బయటపడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తప్ప హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేయని కమలనాథుల తీరే ఈ పరిణామాలకు కారణమా ? పీడీపీ, బీజేపీల మధ్య అందనంత దూరం ఏర్పడిందా ?జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు ఏ దిశగా సాగుతున్నాయి....

Wednesday, February 3, 2016 - 21:49

ఓ మహిళ ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతోంది.. ఓ మహిళ ఆ రాష్ట్ర నేతలకు ముచ్చెమటలు పోయిస్తోంది. సాక్షాత్తు సీఎంనే ఇరకాటంలో పెడుతోంది. కేరళ అధికార పక్ష పొలిటీషయన్లకు ముచ్చెమటలు పోయిస్తుంది. లంచం, అక్రమమం, అధికార దుర్వినియోగం, సెక్స్ స్కాండిల్ వెరిసి.. ఓ స్కాం ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎవరామే..? ఏమా స్కాండిల్.. ఎమిటా వివరాలు.. కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న...

Monday, February 1, 2016 - 20:48

ప్రజల సొమ్ముకు నమ్మకమైన జవాబుదారిగా నిలిచే ఆర్థిక సంస్థలుగా పేరొందాయి. నవ భారత నిర్మాణంలో పాలుపంచుకున్న సంస్థలు.. దేశానికి పరుగులు నేర్పిన వ్యవస్థలు..భారతావనికి సాంకేతిక ప్రగతిని అందించిన సంస్థలు..చిమ్మ చీకటి నుండి వెలుగుబాటలోకి నడిపించాయి. గ్రామీణ భారతావనిని కనెక్టు చేసిన సంస్థలు..లక్షల కోట్ల సంస్థలు..భారతీయులంతా ఒక కుటుంబం అనుకుంటే ఇవన్నీ మన ఉమ్మడి ఆస్తులు. కానీ...

Friday, January 29, 2016 - 20:47

డేటింగ్ యాప్స్ తో డేంజర్ ఉందా ? ఆన్ లైన్ మోసాలకు డేటింగ్ సైట్స్ వేదిక అవుతున్నాయా ? డిజిటల్ లవ్ తో లైఫ్ రిస్క్ లో పడుతుందా ? స్నేహం పేరిట మోసాలకు దిగే కుట్రలు జరుగుతున్నాయా ? భారత్ లో సునామీ సృష్టిస్తున్న డేటింగ్ యాప్స్ దేశంలో పెరుగుతున్న డేటింగ్ కల్చర్ పర్యవసానం విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Thursday, January 28, 2016 - 20:37

మొన్న సార్స్ హెచ్ వన్ ఎన్ వన్...నిన్న ఎబోలా ఇవాళ జికా...ఇప్పటికే 25 దేశాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పుడు అమెరికాతో సహా పశ్చిమ దేశాలు దోమలను చూస్తే గడగడలాడిపోతున్నాయి. పలు దేశాల్లో ఆరోగ్యకర పరిస్థితిని విధించాయి. ముఖ్యంగా ఈ వైరస్ సోకిన మహిళల పిల్లలకు మెదడు సంబంధిత వ్యాధితో పుట్టడం ఎంతో ఆందోళన కలిగిస్తున్న అంశం. మరి భారతదేశానికి ముప్పు పొంచి ఉందా ? ఈ అంశంపై మరిన్ని...

Wednesday, January 27, 2016 - 20:41

రెండు దశాబ్ధాలుగా చిక్కడు దొరకడు అన్నట్లు... వేలది మంది పోలీసులకు ముచ్చెమటలు పోయించాడు. జైలు ఊచలు వణికిపోతుంటాయి. పొరపాటునా దొరికినా అతడిని కాపలా కాయడం అంత తేలిక కాదు..అతడు స్కెచ్ వేస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..డ్రగ్స్ మాఫియాతో మెక్సికోకు ముచ్చెమటలు పోయించాడు. అంతేగాక అమెరికాను సైతం హఢలెత్తించాడు. ఇప్పటికీ రెండు సార్లు చిక్కినట్టే చిక్కి ఎస్కేప్ అయ్యాడు. ముచ్చటగా మూడోసారి...

Tuesday, January 26, 2016 - 20:52

ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం. ఉచితం పేరిట ఓట్లను కొళ్లగొట్టడమే టార్గెట్. వాగ్ధానాలు హోరెత్తుతున్నాయి. అడ్డూ అదుపు లేని హామీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీల నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..అంటూ రాజకీయ నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. మరి ఈ...

Monday, January 25, 2016 - 20:39

ఆకలి భారతం కథ. శిథిలం భారతం గాథ. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్ధాలు అవుతున్నా తీరని వ్యథ..దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిందని..పెరుగుతోందని..అంబానీలు..ఆదానీల ఆస్తులు డబుల్..ట్రిపుల్ అవుతున్నాయని చూస్తున్నాం. అదే సమయంలో తినడానికి తిండి లేక నిత్యం కొట్లాది భారతీయులు నానా ఆగచాట్లు పడుతున్నారని వింటున్నాం. ఆరోగ్య సదుపాయాలు లేక ఎందరో అనేక రోగాలకు బలౌతున్నారని గమనిస్తున్నాం. మరి అసమానతలకు...

Friday, January 22, 2016 - 21:43

చందమామపై మానవ మనుగడ సాధ్యమా..?! అక్కడి వాతావరణాన్ని మనిషి తట్టుకోగలడా?.. చంద్రుడిపైకి పోదాం చలో చలో అంటున్న సైంటిస్టులు.., 2030 నాటికి బాబిలిపై నివాసం..!!, చందమామ కాలనీ.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం…. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Thursday, January 21, 2016 - 21:22

కొంత కాలంగా ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. స్టార్టప్ ఇండియా... స్టాండప్ ఇండియా.. అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని పిలుపునిచ్చిన సందర్భం. మెజారిటీ పాపులేషన్ యువత అయినపుడు, ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గుతున్న సంక్షోభ కాలంలో స్టార్టప్ లకు ప్రాధాన్యత పెరిగింది. మరి, స్టార్టప్ లపై సర్కారు విధానం ఎలా ఉంది. స్టార్టప్ బూమ్ ఏ దిశగా సాగుతోంది? ఈ వివరాలతో ఈ రోజు వైడాంగిల్ కథనం...

Wednesday, January 20, 2016 - 21:48

తమకు సంబంధం లేదని బుకాయిస్తున్నారు. తాము ఏ రకంగా బాధ్యులం కాదంటున్నారు.. ఇంకా చెప్తే, అలసిది దళితుల సమస్యే కాదంటున్నారు. తమ తప్పేం లేదని వాదిస్తున్నారు. ఎవరో చనిపోతే మేమెలా కారణమంటున్నారు. కానీ, దీనివెనుక జరిగిన తతంగాన్ని విస్మరిస్తున్నారు. లేఖలు రాసిన సంగతిని దాటేస్తున్నారు. అవి మూల కారణమని వస్తున్న వాదనలు కొట్టిపారేస్తున్నారు. ఏమిటా ఏడు లేఖల సంగతి..? ఆ లేఖల్లో...

Tuesday, January 19, 2016 - 21:34

ప్రపంచం తీవ్ర అసమానతలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచంలోని సంపదను అతి కొద్ది మందే అనుభవిస్తున్నారు. డబ్బును డబ్బే సంపాదిస్తుంది. సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. పేదరికం మరింత పేదరికాన్ని ఆకర్షిస్తోంది. శ్రీమంతులు వెలిగిపోగుతున్నారు. సామాన్యులు చితికి పోతున్నారు. అతి కొద్ది మంది దగ్గర పంపద పోగుపడుతుంది. అర్థిక అసమానతలు తీవ్రంగా...

Monday, January 18, 2016 - 20:41

యూనివర్సిటీలా ? లేక కుల పిచ్చిగాళ్లకు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వాళ్లకు అడ్డాలా ? విద్యా సుగంధాలు పంచి విద్యార్థుల బంగారు భవితను అందించాల్సిన యూనివర్సిటీలు ఎలా తయారవుతున్నాయి. కులం పేరుతో మతం పేరుతో విభజించి వివక్షతో ఎందరో విద్యార్థల భవితతో ఆడుకుంటుంటే చివరకు ఆ కలలన్నీ ఉరికొయ్యకు వేలుడుతున్నాయి. నా చావుకు నేనే కారణం..నా మిత్రులను శత్రువులను ఇబ్బంది పెట్టవద్దంటూ...

Monday, January 11, 2016 - 20:39

ఊరందరి పండుగలో కోళ్ల పందేలా ఎలా చేరాయి ? రంగవల్లుల..పిండివంటల వేడుకల్లో కాయ్ రాజా కాయ్ అరుపులు ఎలా వచ్చాయి ? పండుగంటే విచ్చలవిడి జూదమేనా ? పండగంతా పందెం రాయుళ్లదేనా ? సంతోషంగా గడపాల్సిన రోజుల్లో జూదం..మద్యం ప్రవాహం ఎలా కలిశాయి ? ఒళ్లు..ఇళ్లు గుల్ల చేసుకొంటే తప్ప పండుగ చేసుకొన్నట్టు కాదా ? సంక్రాంతి పండుగలో కోళ్ల పందేలా వివాదం గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. ...

Friday, January 8, 2016 - 22:22

పేరులో ఫ్రీ ఉంది కానీ.. జరిగేదీ నిలువునా మోసమే… ! ఫ్రీ బేసిక్స్ తో ఇంటర్నెట్ కు సంకెళ్లు వేసే ప్రయత్నాలు… !
నెట్ న్యూట్రాలిటీకి గండి కొట్టాలనే ఆరాటం..! ఇంటర్ నెట్ ను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు…! బేసిక్స్ ని నమ్మితే ఫేస్ బుక్కే…!!, ఇంటర్నెట్ కు అడ్డంకులు కల్పించే ఫ్రీబేసిక్స్ పై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వీడియోలో చూద్దాం…

Thursday, January 7, 2016 - 21:45

అది అగ్రరాజ్యానికి హెచ్చరికా..? లేదా మానవాలి మనుగడకు ప్రమాద ఘంటికా..? ఉత్తరకొరియా చెబుతున్న పాఠమేంటీ...? 
ప్రపంచదేశాల్లో ఆందోళన కలిగిస్తోన్న హైడ్రోజన్ బాంబు ప్రయోగం ఉద్ధేశమేంటీ..? ఇతర దేశాలను ఆయుధాలు తయారు చేయొద్దంటారు.. కానీ తమ దగ్గర మాత్రం కుప్పతెప్పలుగా మారణాయుధాలను పోగుపెట్టుకుంటాయి అగ్రరాజ్యాలు. ఈధోరణే జరుగుతున్న పరిణామాలకు కారణమా..?! ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు...

Monday, January 4, 2016 - 22:01

మూడు రోజులు గడిచినా పరిస్థితి ఎందుకు అదుపులోకి రాలేదు..? ఎక్కడుంది లోపం..? భద్రతావ్యవస్థలు నిద్రమత్తులో ఉన్నాయా..?! 
అత్యంతకీలకమైన వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు అంత అవలీలగా ఎలా దాడి చేయగలిగారు..? మన రక్షణ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ ఈ రేంజ్ లో బలహీనంగా ఉన్నాయా...? రాచమార్గంలో ఉగ్రవాదులు ఎంటరవుతుంటే.... రెడ్ కార్పెట్ పరిచేంత పరిస్థితి ఎందుకొచ్చింది..?! 
పఠాన్ కోట్ పై...

Wednesday, December 30, 2015 - 20:41

ఆకాశాన్ని అంటుతున్న ధరలు...భారమై పోయిన సామాన్యుడి బతుకులు..హక్కుల కోసం ఉద్యమాలు..అస్తిత్వం కాపాడుకొనే ఆరాటం..ఎప్పటిలాగే ప్రజల బాగోగులు చివరి ప్రాధాన్యతగా పెట్టుకున్న ప్రభుత్వాలు..పై పై మెరుగులు తప్ప సామాన్యుడి బతుకులు నిర్లక్ష్యం చేసే విధానాలు..ఇది తెలుగు రాష్ట్రాలు 2015లో చూసిన అనుభవాలు..అలనాటి రాజధాని అమరావతికి కొత్త వెలుగులు రాబోతున్నాయా?అమరావతి ఘన చరిత్ర సుందర...

Tuesday, December 29, 2015 - 20:39

మరో వసంతం గడిచిపోతోంది. చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం చేస్తూ కాలం మరో మైలురాయిని దాటుతోంది. జ్ఞాపకాల వంతెనపై అనేక ఆనవాళ్లను మిగిల్చిన కాలం కొత్త ఉషోదయం వైపు పరుగెడుతోంది. ఎన్నో ఘటనలు దేశానికి కుదిపేశాయి. ఆనంద సందడి ముంచెత్తాయి. నిరాశ, నిర్వేదంలోకి నింపేశాయి. సంఘర్షణలతో అల్లకల్లోలం చేశాయి. అనంత కాల పయనంలో 365 రోజులు అంటే ఓ చిన్న శకలం మాత్రమే కావచ్చు. కానీ క్షణక్షణం.....

Monday, December 28, 2015 - 20:36

కాల చక్రం గిర్రున తిరిగింది. క్యాలెండర్ చివరి పేజీలో ఉన్నాం. గత సంవత్సర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు..ప్రమాదాలు..ప్రమోదాలు చూశాం. కుట్రలతో ప్రపంచాన్ని మభ్య పెట్టి తన ప్రయోజనాలను కాపాడే దౌర్భాగ్యం ఒకరిది. కాళ్ల కింద నేలను నిలబెట్టుకోవాలనే బతుకు పోరాటం మరొకరిది. ఎగిసిన నినాదాలు..బిగిసిన పిడికిళ్లు..రాజాకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు..ప్రకృతి శాపానికి విలయతాండవానికి...

Thursday, December 24, 2015 - 21:01

ఖండాలుగా చీలిపోయిన మనుషులను కలిపేది ఇప్పటికీ మతమేనని ఎందరో విశ్వసిస్తుంటారు. ప్రపంచంలోని అన్ని మతాల అభిమతం మాత్రం మానవళి సౌభాగ్యమే అన్నది అందరూ గట్టిగా నమ్ముతుంటారు. ఆ నమ్మకమే ఈ నాటికి అనేక దేశాల్లో అనేక మతాల విశ్వాసాల వెలుగులో పర్వదినాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. డిసెంబర్ నెల ప్రవేశించిందంటే ఇక ప్రపంచంలో క్రిస్మస్ వేడుకల ఆనందాల కోలాహాలం వర్ణించడానికి పదాలు చాలవు. అదే...

Wednesday, December 23, 2015 - 20:33

రైతులకు కష్టకాలం దాపురించబోతోందా? ఆహార భద్రతకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందా?  ఇప్పటికే రైతాంగాన్ని విస్మరిస్తున్న సర్కారు ఇకముందు పూర్తిగా విస్మరించబోతోందా?  నైరోబీ సమావేశం ఏ సంకేతాలిస్తోంది?  ఏ కుట్రలకు వర్ధమాన దేశాలు బలికాబోతున్నాయి? నైరోబీ డబ్ల్యూటీఓ సదస్సులో సాగిన అగ్రపెత్తనంపై కథనం..భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు..!!అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గారు...

Tuesday, December 22, 2015 - 20:49

అతణ్ని చట్టాలు వదిలేయాలంటున్నాయి. శిక్షించాల్సిందేనని కొందరు పట్టుబడుతున్నారు. చేసింది క్రూర నేరం.. అందులో సందేహం లేదు. కానీ, శిక్షించటానికి కొన్ని అడ్డంకులు.. ఈ నేపథ్యంలో చట్టాలు మార్చాలంటూ డిమాండ్లు.. వచ్చాయి. కానీ, వయస్సును కాదు.. నేరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వాదనలు. .ఆఖరికి చట్టాన్ని సవరించారు. మరి ఈ సవరణతో సర్వం మారిపోతుందా..? నిర్భయ కేసులో జువెనైల్ విడుదలపై...

Monday, December 21, 2015 - 21:06

తిట్ల పురాణం..అడుగడుగునా అసహనం..అసభ్యపదజాలం..నోరు జారుతున్నారు..విలువలకు నీళ్లు వదులుతున్నారు..చర్చను పక్కదారి పట్టిస్తూ మొత్తంగా సభ మర్యాదలను మంటగలుపుతున్నారు. ప్రజా సమస్యలను వదిలేసి పనికి మాలిన చెత్తంతా మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నారు. ఇది ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరు. అసెంబ్లీలో అగ్లీ సీన్స్ గురించి..అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం గురించి కథనం. 

ఒకనాటి...

Thursday, December 17, 2015 - 20:38

అక్కడ తగ్గింది కొండత. ఇక్కడ తగ్గిస్తున్నది గోరంత. అంతర్జాతీయంగా ధరలు కొంచెం పెరిగితే.… ఇక్కడ ఆమాంతం పెంచేస్తారు. కానీ అవే ధరలు తగ్గినపుడు మాత్రం ఉలుకూ పలుకూ ఉండదు. ఆలాభమంతా సైలెంట్ గా సర్కారే మింగేస్తోందా? సామాజ్య ప్రజలు ఉన్నది కేవలం ప్రభుత్వ పన్నుల బాదుడు భరించడానికేనా? ఓ పక్క కార్పొరేట్ రంగాలకు లక్షల కోట్లు ఉదారంగా దోచి పెట్టే ప్రభుత్వం ప్రజల నుండి ముక్కు పిండి వసూలు...

Wednesday, December 16, 2015 - 20:38

హైదరాబాద్ : రాష్ట్రాల హక్కులు ప్రమాదంలో పడ్డట్టేనా? కేంద్రం బలవంతంగా తన పంతం నెగ్గించ్చుకునే ప్రయత్నం చేస్తోందా? ఫెడరల్ స్ఫూర్తి మంట గలిసినట్టేనా? ఒక రాష్ట్ర సెక్రటేరియట్ సమాచారం లేకుండా సోదాలు చేయడాన్ని ఎలా తీసుకోవాలి? ఇది ఏపరిణామాలకు సంకేతంగా నిలుస్తోంది? ఢిల్లీ సెక్రటేరియట్ లో సీబీఐ సోదాల పై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ...

Tuesday, December 15, 2015 - 20:40

హైదరాబాద్ : అడ్డంగా ఆక్రమించేశారు. అందిన కాడికి ఆగం చేసేశారు. నీటి తావులను మాయం చేసి… కాంక్రీట్ కట్టడాలను నిలబెట్టారు. స్వచ్ఛమైన నీటితో అలలారే చెరువులను కాలుష్య కాసారాలుగా మార్చారు. ప్రమాదకర విష రసాయనాలతో నింపేశారు. చెత్త డంపింగ్ తో సర్వ నాశనం చేసేశారు. ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోతోంది. నగరంలో చెరువులు లేని ఫలితం తీవ్ర పరిణామాలకు కారణం కాబోతోంది. చెరువులూ...

Pages

Don't Miss