వైడ్ యాంగిల్

Monday, December 14, 2015 - 21:51

ఆర్థిక కష్టాల్లో ఉన్న వారిని గుర్తిస్తారు... అడగకపోయినా అప్పులిస్తారు. క్షణాల్లో మనీ అరెంజ్ చేస్తారు. అధిక వడ్డీలతో నడ్డివిరుస్తారు. బెదిరిస్తారు,... వేధిస్తారు... వియవాడలో జరిగిన కాల్ మనీ వ్యవహారం ఎపి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ లో చూద్దాం... మరిన్ని వీడియోలో చూద్దాం...

 

Thursday, December 10, 2015 - 20:35

దాయాది దేశాల మధ్య మరో ప్రస్థానానికి నాంది పడుతోంది. దౌత్య బంధం మరో శిఖరానికి చేరుకొనేందుకు మార్గం సుగమమవుతోంది. సరిహద్దుల గొడవలు సద్దుమణిగేందుకు..తుపాకుల తూటాల ఘర్షణ చల్లపరిచేందుకు..ఉగ్ర భుజంగాల కోరలు పీకేందుకు ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహ మజిలికి అడుగు పడుతోంది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పర్యటనతో ఇరు దేశాల మధ్య నలుగుతున్న సమస్యల పరిష్కారానికి వేదిక సిద్ధమౌతోంది....

Wednesday, December 9, 2015 - 21:00

సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. ఎప్పుడో 1937 లో నెహ్రూ స్థాపించిన కంపెనీ, అది ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక అది మూతబడి చాలా కాలమైనా వాటి అవశేషాలు మాత్రం కాంగ్రెస్ కి గుదిబండలా మారాయి. పేరు మార్చి షేర్ హోల్డర్లను తారుమారు చేసి మొత్తం కంపెనీని తమ గుప్పెట్లో పెట్టుకున్న సోనియా అండ్ రాహుల్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు. బీజేపీ నేత...

Tuesday, December 8, 2015 - 20:40

మొన్న తెలంగాణ, నిన్న ఆంధ్రప్రదేశ్, రేపు మరోచోట. ఇప్పుడు మనుష్యులను చంపేస్తున్నది మద్యం. కాటు వేస్తున్నది కల్తీ. సర్కారు సాక్షిగా ఏరులై పారుతున్న మద్యానికి సామాన్యులు బలైపోతున్నారు. కాస్తంత తాగి శారీరక శ్రమ మర్చిపోదామనుకుంటే ఏకంగా శాశ్వతనిద్రలోకి పోతున్నారు. సామాన్యులను చంపేస్తున్న పాపం ఎవరిది..అనుచరులు,బంధువులను అడ్డుపెట్టుకుని మాఫియాను నడిపిస్తున్న రాజకీయ నాయకులదా...వారితో...

Thursday, December 3, 2015 - 20:49

ఫేస్ బుక్ అధినేత జుకెన్ బర్గ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు కురిపిస్తోంది. జుకెర్ బర్గ్ దంపతులకు కూతురు పుట్టిన నేపథ్యంలో ఫేస్ బుక్ లోని 99 శాతం వాటాను ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత శిక్షణ, వ్యాదులకు చికిత్స, ప్రజల మధ్య అనుసందానం, బలమైన సమాజాల నిర్మాణం వంటి అంశాలపై దృష్టి పెట్టడానికి వినియోగించినట్లు ప్రకటించారు. తన కుమార్తెకు జుకెన్‌ బర్గ్‌...

Wednesday, December 2, 2015 - 20:38

హైదరాబాద్ : స్థంభించిన జనజీవనం, అస్తవ్యస్థమైన రవాణా వ్యవస్థ... కనీస సౌకర్యాలు కూడా కరువైన దృశ్యం. ప్రజలంతా విలవిలలాడుతున్న పరిస్థితి... వేలాది మంది నిరాశ్రుయులయ్యారు. మరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. భారీ వర్షాలకు చెన్నై చిత్తయ్యింది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది. మన నగరాలకు భారీ వర్షాలను తట్టుకునే శక్తి లేదా? ఇదే విపత్తు ఇతర నగరాలకు పొంచి ఉందా? ఇదంతా...

Tuesday, December 1, 2015 - 20:37

హైదరాబాద్ : తెల్లనివన్నీ పాలు కాదు... ఘాటువన్నీ మసాలా దినుసులు కాదు.. నూనెలన్నీ నమ్మకమైనవీ కాదు.. చూడటానికి ఒరిజినల్ గా కనిపిస్తాయి కానీ...నాణ్యతలో మాత్రం అసలకే మోసం. ఒక్క మాటలో చెప్పాలంటే వంటిల్లు విషయంగా మారుతోంది. అస్సలు ఈ కల్తీ దందా ఎలా సాగుతోంది. దీని వెనుక ఉంది ఎవరూ? నగరంలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న కల్తీదందా పై నేటి వైడాంగ్ లో విశ్లేషణ...

Monday, November 30, 2015 - 20:44

హైదరాబాద్ : 2015 సంవత్సరం అత్యంత ఉష్ణ సంవత్సరంగా ఎందుకు చరిత్రకు ఎక్కింది. ఏటికి ఏడాదికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కారణాలు ఏమిటి? ఇదే కొనసాగితే భూగోళానికి ముప్పు తప్పదా? ఈ గ్లోబల్ వార్మింగ్ సమస్యకు పరిష్కారం ఏమిటి? పారిస్ వాతావరణ సదస్సు ఏం తేల్చబోతున్నారు? పారిస్ లో కాప్ 21 సదస్సు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ...

Friday, November 27, 2015 - 21:40

మెట్రో మంటలు చల్లారేదేలా..? మెట్రోరైలు ఏ మలుపులు తీసుకుంటుంది..? నగర ప్రజలంతా ఆతురుతగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు పట్టాలెక్కేదెప్పుడు..? అనేక సమస్యల నడుమ సాగుతున్న ఈ భారీ ప్రాజెక్టు, కాలయాపన, పెరుగుతున్న ఖర్చు ప్రజలపై మరింత భారాన్ని పెంచుతోంది. ఎల్ ఆండ్ టీ నివేదిక ఇచ్చానంటోంది. దీనిపై స్పందించాల్సిన సర్కార్... ఆందోళనలకు సమాధానం ఇవ్వాల్సిన ఏలికలు సైలెంట్ గా ఉండడం విమర్శలకు...

Thursday, November 26, 2015 - 21:19

అమీర్ ఖాన్ ఏమన్నాడు? ఏం తప్పు చేశాడు? ఎందుకిలా విరుచుకుపడుతున్నారు. జరుగుతున్న పరిణామల పట్ల తన భార్య అభిప్రాయాన్ని ఓ వేధికపై వెళ్లడించడం నేరమా? ఓ సెలబ్రిటీ.. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హీరో.. ఈ పని చేయకూడదా? రెండు రోజులుగా జరుగుతున్న రగడ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దేశంలో నెలకొన్న అసహనాన్ని ప్రశ్నించడం మాని అసహనం వెనుకున్న కారణాలను వదిలేసి సమస్యను లేవనెత్తిన...

Wednesday, November 25, 2015 - 20:44

హైదరాబాద్ : ఎజెండా అసంతపూర్తిగానే మిగిలింది. ఆ మహాశయుని కలలు నెరవేరలేదు. కోట్లాది ప్రజల అభ్యున్నతిని కాంక్షించిన ఆ స్వప్నం అసంపూర్తిగానే ఉంది. ఆరు దశాబ్ధాల తరువాత కూడా వైఫల్యాలు వెంటాడుతూనే ఉన్నాయి. అసమానతలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ మహాశయుని 127 జయంతి సందర్బంగా ఇదే అంశం చర్చకు వస్తోంది. ఇదే ధ్యేయంతో పార్లమెంట్ సీతాకాల...

Tuesday, November 24, 2015 - 22:09

భారత్ ప్రమాదం అంచున ఉందా.? ఐఎస్ తీవ్రవాదులతో మన దేశానికి ముప్పు ఉందా..? ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ సిరియా ఇప్పుడు ప్రపంచాన్ని ఒణికించబోతుందా...? జరుగుతున్న పరిణమాలు ఏ సంకేతాలిస్తున్నాయి..? ప్యారిస్ తరహా దాడులు మరిన్ని జరగబోతున్నాయా..? అలాంటి విపత్తే వస్తే మన దేశం తిప్పికొట్టగలిగే పరిస్థితిలో ఉందా...? పడగ విప్పిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం గురించి ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక...

Monday, November 23, 2015 - 22:42

సముద్రం లోపల నివసించాలని ఉందా...? జలచరాల సమీపంలో విలాసవంతంగా విహరించాలని ఉందా..? నీలి సంద్రం అందాలను వీక్షిస్తూ.. రోజులు అలా.. అలా గడిపేయాలనుందా..?? ఆకాశహార్మ్యాలను నిర్మిస్తూ... గగనాన్ని తాకే ఎత్తైనే భవనాలు విదిలి.. సముద్రంలో గర్భంలో నివసించడం సాధ్యమేనా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేసంది...! కడలిని కౌగిలించుకునే బతికే మహత్తరమైన కల.. సాకారమవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఆ...

Friday, November 20, 2015 - 21:58

టిప్పు సుల్తాన్ వ్యక్తిత్వంపై రగడ ఎందుకు మొదలైంది.? టిప్పు సుల్తాన్ ఇతర మతాలను ద్వేషించాడా..? చరిత్ర పేజీలకు రక్తపు మరకలంటించిన పాలకుడా..? అసలు టిప్పు సుల్తాన్ దేశభక్తుడే కాదా..? టిప్పు వ్యక్తిత్తమేంటి...? జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలేంటీ...? ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, November 19, 2015 - 20:38

హైదరాబాద్ : ఎవరిని నిందించాలి?... ఎవరిని శిక్షించాలి?..ఆ గుండె కోతకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ప్రభుత్వాలనా?... అధికారులనా? లేక స్కూల్ యాజమాన్యాన్నా? స్కూల్ బస్ నుండి లిఫ్ట్ వరకు అడుగడుగునా చిన్నారులను రక్షస హస్తాలతో కలబళిస్తోంటే దానికి పరిష్కారం ఏమిటి? చిన్నారుల పట్ల విషవలయాలుగా మారుతున్న విద్యాలయాలపై నేటి వైడాంగిల్ లో ప్రత్యేక కథనం. మరి మీరూ చూడాలనుకుంటే...

Wednesday, November 18, 2015 - 20:37

హైదరాబాద్ : బియ్యం బాంబ్ పేలబోతోంది!నిన్నటి దాకా ఉల్లి పెట్టించిన కన్నీళ్లు మరవక ముందే..బియ్యం ధరలు మండిపోబోతున్నాయి. ఓ పక్క పప్పుల ధరలు ఆకాశం నుండి దిగిరావడం లేదు. మరో పక్క కూరగాయలు గాయాలు చేస్తూనే వున్నాయి. వెరసి నిత్యావసరాలన్నీ సామాన్యుడిని వెక్కిరిస్తున్నాయి. ఏం కొనాలో.. ఎలా బతకాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలపై నేటి...

Tuesday, November 17, 2015 - 20:41

హైదరాబాద్ : మొన్న ఐఎస్ఎ స్ తీవ్రవాదులు ప్యారిస్ నగరం పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు సిరియా ఉగ్రస్థావరాలపై ఫ్రాన్స్ విరుచుకుపడుతుంది. ఎవరి కుట్రల ఫలితం ఈ ఉగ్రవాదం? ఏ అగ్రవాదంలో ఈ విధ్వంస మూలాలున్నాయి? దాడులు, ప్రతిదాడులే శాంతిని ప్రతిష్టిస్తాయా? ఏమిటి యుద్ధం? ఏ పరిష్కారం దిశగా ప్రపంచ దేశాలు కదులుతున్నాయి? ఎన్నాళ్లీ యుద్ధ?? ఉగ్రవాదం.. అగ్రవాదం మధ్య పోరు...

Monday, November 16, 2015 - 20:37

హైదరాబాద్ : అధికారంలో లేనపుడు వ్యతిరేకించారు? అందలం ఎక్కాక అడ్డం తిరిగారు? గిరి పుత్రుల బతుకుల్లో మట్టి కొట్టడానికి రెడీ అయ్యారు. ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర మవుతున్నాయి. గిరిజనులంతా ఏకమై సర్కార్ పై పోరాటానికి సై అంటున్నారు. విశాఖ మన్యంలో రేగుతున్న బాక్సైట్ మంటలపై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి ఏఏ అంశాలు అందులో పొందుపరిచారో చూడాలంటే ఈ...

Friday, November 13, 2015 - 21:51

పిల్లలు మన ఆశల అకాశాలు. పిల్లలు మన ఊహాల . పిల్లలు మన కళల పరిమళాలు. కురిసే వాన, మెరిసే మెరుపు. విరిసే పువ్వు. తమ సొంతమేనని మురిసిపోతారు. వారు మన రేపేటి జ్ఞాపకాలు. మన తియ్యటి జ్ఞాపకాలు. ఆ పసిమొగ్గలను కాపాడుకునే బాధ్యత పెద్దలందరిది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, November 12, 2015 - 21:07

బీహార్ ఫలితం బీహార్ బీజేపీలో కల్లోలం రేపుతోంది. ఇద్దరు నేతల ఏక ఛత్రాధిపత్యంపై పార్టీలో వ్యతిరేకత చెలరేగుతోంది. సమిష్టి తత్వానికి పాతరేసిన నయా నాయకత్వంపై అసంతృప్తి సెగలు కక్కుతోంది. రాయీ రాయీ కూర్చి పేర్చిన పార్టీ సౌధం కళ్లెదుటే బీటలువారుతున్న దృశ్యాలు చూడలేక వృద్ధ సింహాలు జూలు విదిలుస్తున్నాయి. నియంతృత్వ పోకడలపై ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి స్వరాలు వీరికి...

Tuesday, November 10, 2015 - 20:39

హైదరాబాద్ : మయన్మార్ ప్రజాభిష్టమైన పాలన మొగ్గ తొడిగింది. సైన్యం అడుగుజాడల్లో నడుస్తున్న అరాచక పాలనకు తెరపడింది. తన జాతి కొరకు వెలుగెత్తిన విప్లవ యోధురాలికి 3 కోట్ల జనం పట్టం కట్టారు. శాంతి కపోతానికి రెక్కలు తొడిగారు. మయన్మార్ చారిత్రాత్మక ఎన్నికల్లో... సూకీ పార్టీ ఘన విజయం సాధించింది. మయన్మార్ లో సూకీ పార్టీ ముందు ఉన్న సవాళ్లు ఏమిటి? ప్రజల...

Monday, November 9, 2015 - 21:49

సర్వేలు బోల్తా కొట్టాయి. ప్రచార ఆర్భాటాలు పేలయ్యాయి. బీహారీలెవరో... బాహారీలెవరో తేల్చేశారు. అసహనం అవసరం లేదని ఓటు గుద్ది చెప్పేశారు. ఫలితం బీహార్ మహా విజయం. లౌకిక విలువలకు పట్టం కట్టిన బీహార్ ఎన్నికల ఫలితాలు..., దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది. ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, November 6, 2015 - 21:46

కొన్ని మరణాలు ఎందుకు మిస్టరీలుగా మిగిలిపోతుంటాయి. కొన్ని చావుల వెనుక రహస్యాలు ఎన్నటికీ వీడని చిక్కుముడిలాగా ఎందుకు ఉండిపోతాయి. హతులుంటారు... అనుమానితులుంటారు.. కానీ హంతకులెవరో తేల్చడానికి ఏళ్లు పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో అది ఎప్పటికీ తేలదు కూడా. బడాబాబుల లోగిళ్లల్లో జరుగుతున్న అనుమానాస్పద మరణాలు ఈ జాబితాలో ఉంటున్నాయి. ఎందుకిలా జరుగుతోంది.. ఈ ఘటనల్లో దాగిన మర్మమే ఈరోజు...

Thursday, November 5, 2015 - 21:47

అసహనం.. అడుగడుగునా.. అసహనం... పక్కవాడి నీడను కూడా సహించలేని తనం... పొరుగువాడి అలవాట్లను భరించలేని తనం... భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో శాంతి, సామరస్య వాతావరణాలను దెబ్బతీసే ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న అసహనం.. దేశ లౌకిక, ప్రజాస్వామ్య వాతావరాణానికి విఘాతం కలుగుతుందనే అందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే దేశంలో కవులు, కళాకారులు, నటులు ఇప్పుడు...

Wednesday, November 4, 2015 - 20:43

హైదరాబాద్ : సుదూర తీరంలోంచి సమస్తం పరికిస్తోంది!... అంతరిక్ష రహస్యాల అంతుచూస్తోంది!!... శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు గీటురాయిగా నిలుస్తోంది!!! గగనపు వీధుల్లో విహరిస్తూ మనిషి జ్ఞాన తృష్టకు సంకేతంగా నిలుస్తోంది. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం నెలకొల్పి 15 యేళ్లు గడిచిన సందర్భంగా నేటి వైడాంగిల్ ప్రత్యేక కథనాన్ని విశ్లేషణ చేశారు....

Monday, November 2, 2015 - 21:50

బీహార్ పోరు చివరి అంకానికి చేరింది. మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరింది. కానీ ఈ మాటల వెనుక ఏ అర్థాలు దాగున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు.. కమలదళం నిస్పృహలకు అద్దం పడుతున్నాయా..? బీహార్ పోరులో బిజెపి నీరసపడుతుందా...? ఓవరాల్ గా బీహార్ ఈక్వెషన్స్ దేశానికి కొత్త దారి చూపనున్నాయా..? బీహార్ వార్ ఫీల్డ్ పై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.......

Friday, October 30, 2015 - 20:41

హైదరాబాద్ :పోరుగల్లు గా మారిన ఓరుగల్ ఉప పోరులో ఎవరి వ్యూహాలు ఏంటి? కాకతీయ కోటపై జెండా ఎగరేసే రాజులు ఎవరు? కత్తులు నూరుతూనే పార్టీలు కలవరపడుతున్నాయా? ఈ అంశాలపై నేటి వైడాంగిల్ విశ్లేషణ చేశారు. మరి ఈ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Pages

Don't Miss