వైడ్ యాంగిల్

Tuesday, October 27, 2015 - 20:40

హైదరాబాద్ : డాన్ లమధ్య యుద్ధమే 'రాజన్ చుట్టూ ' ఉచ్చు బిగించిందా? రాజన్ నోరు విప్పితే ఎవరి చీకటి రాజ్యాలు బద్ధలవుతాయి? చోటా రాజన్ పోలీసులకు ఎలా దొరికాడు? అసలు ఎవరీ చోటా రాజన్? చోటా రాజన్ నేర చరిత్ర ఎలా సాగింది? దావుద్ కి, చోటీకి మధ్య విభేదాలు ఎలా వచ్చాయి? అనారోగ్యంతో బాధపడుతున్న చోటా కు దావూద్ గ్యాంగ్ నుంచి ప్రాణ హాని ఉందా? అందుకే పోలీసులకు దొరికిపోయాడా? ఈ...

Friday, October 23, 2015 - 21:53

ఒకప్పుడు 40 ఏళ్లు.. తర్వాత 60 ఏళ్లు.,. ప్రస్తుతం 70 ఏళ్లు... అంతకంటే ఎక్కువ. సెంచరీకొట్టిన వృద్ధ యువకులే చాలా మందే ఉన్నారు ప్రపంచంలో. అంతకుమించి అంటుంది ఆధునిక వైద్య ప్రపంచం. అవును 150 ఏళ్ల ఆయుష్షు పెంచుకోవడానికి శాస్త్రవేత్తలు... పరిశోధనలు చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Thursday, October 22, 2015 - 20:59

విజయదశమి..చెడుపై మంచి సాధించిన విజయం. ప్రకృతిపై మానవుడు సాధించిన విజయానికి ప్రతిక. ఎందులోనైనా పురోగతి సాధించాలన్న ఆకాంక్షకు ఆలంబన. ఇలా అనేక రకాల విజయాలను అన్వయించే పండుగ దసరా. భారతీయుల అతి పెద్ద పండుగ. దేవీ నవరాత్రుల పేరుతో 9 రోజుల పాటు చేసుకునే వేడుక. దసరా అంటే విజయ పతాకాన్నే కాదు సరదాలు..సంప్రదాయాలు..ఆటపాటలు..వినోదాల మేళవింపు. వివిధ రాష్ట్రాల్లో విజయ దశమి వేడుకలపై...

Wednesday, October 21, 2015 - 21:04

ఆంధ్రుల రాజధాని అమరావతి..ధాన్యం కటకంగా వర్ధిల్లిన నగరి. బౌద్ధం..జైనం..శైవం వంటి భిన్నమైన మతాల సంస్కృతి సమ్మేళన అధ్మాతిక జరి. కృష్ణా నది తీరాన వెలిసిన అద్భుత నగరి. ఆంధ్రుల రాజధానిగా మళ్లీ విలసిల్లబోతున్న ఆధునిక నగరం. అమరావతి శంకుస్థాపన మహోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన మహా వేడుకపై ప్రత్యేక కథనం....

Monday, October 19, 2015 - 21:20

ఒకవైపు న్యాయ వ్యవస్థ... మరో వైపు శాసన వ్యవస్థ...రాజ్యాంగ సవరణలపై రెండు అత్యున్నత వ్యవస్థల మధ్య... ఎడతెగతని వివాదం... తాజాగా కొలీజియం, ఎన్ జిఎసీలపై సరికొత్త వైరుధ్యం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఆమోదించిన ఎన్ జిఎసీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రెండు వ్యసస్థల మధ్య ఆధిపత్య ధోరణి తారా స్థాయికి చేరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దేశానికి రెండు...

Friday, October 16, 2015 - 20:51

హైదరాబాద్ :యుద్ధరంగంలో తొడకొట్టే సైనికుడు కనిపించడు. తుపాకీ తూటాలు పేల్చాల్సిన అవసరం లేదు. శతఘ్నుల వర్షం అక్కరలేదు. వ్యూహాలకు బుర్రలు బద్దలు చేసుకోవాల్సిన అగత్యం లేదు. అస్సలు మనిషన్నవాడు రణ క్ష్రేతంలో విడాల్సిన గతి లేదు. యోథాను యోధుల వీర విన్యాసాలు నో మోర్. ఫ్యూచర్లో జరిగేదంతా సాంకేతిక యుద్ధమే. యంత్రాలే యుద్ధ తంత్రాలు చేస్తాయి. రోబోలే తొడగొట్టి తలబడతాయి....

Thursday, October 15, 2015 - 21:04

ఒక్క చట్టం..ఒకే ఒక చట్టం..స్వతంత్ర భారతావనిలో చీకటి కోణాలను బయటకు లాగిన చట్టం..అవినీతి పాలకులు..అధికారుల నుండి..ధన దాహంతో ఉన్న స్వార్థపరులేకాక అందరి భరతం పట్టే చట్టం. సమాచార హక్కు చట్టం. అదే ఆర్టీఐ. అమల్లోకి వచ్చి పదేళ్లు అయ్యింది. ఈ చట్టం ఏం చేసింది ? ఏం సాధించింది ? ఎవరికి బలాన్ని ఇచ్చింది. ? ఎవరి బలాన్ని దెబ్బతీసింది ? దీనిపై ప్రత్యేక కతనం. ఎంతో రక్తం ప్రవహించింది. ఈ...

Thursday, October 15, 2015 - 18:49

ఆఫర్లే ఆఫర్లు. డిస్కౌంట్లే డిస్కౌంట్లు. ఒక వెబ్ సైట్ 50 శాతం రాయితీ అంటే, మరో వెబ్ సైట్ 80 శాతమంటూ ఊరిస్తుంది. మరోటి వన్ ప్లప్ వన్ ఆఫరంటే, ఇంకోటి ఏకంగా బంగారం ఉచితమంటుంది. పొద్దున పేపర్ తిప్పినా ఫ్రంట్ పేజీలో అవే యాడ్స్. టీవీ ఆన్ చేసినా అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సీజన్ రాయితీల ప్రకటనలే. మంచి తరుణం మించిన దొరకదు. ఆలస్యమైతే ఆఫర్లంతే అంటూ ఊరించే యాడ్స్ చూసి...

Tuesday, October 13, 2015 - 21:08

బతుకుకు స్పూర్తినిచ్చిన సంబురం.. తీరొక్క పూలు..కోటొక్క పాటల కోలాహాలం..తెలంగాణ అస్థిత్వ వైభవం..ఆడపడుచుల ఆరాధ్య వైభోగం...ప్రకృతి రమణనీయత..శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక..తెలంగాణలో బతుకమ్మ సంబరం..మొదలైంది. ఎంగిలిపూల వేడుకలతో ఆరంభమైంది. అసలు బతుకమ్మ తెలంగాణకు ఎలా అస్థిత్వమైంది. ఆడపడుచలతో ఎలా మమేకమైంది. బతుకమ్మ ఇచ్చే బతుకు సందేశం ఏంటీ ? ఈ అంశంపై ప్రత్యేక కథనం.

...

Monday, October 12, 2015 - 21:48

దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బతీసే ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. దానికి రాజకీయ రంగు పూపి తమ తమ ఎజెండాను పూర్తి చేసుకోవానుకుంటున్న నాయకులు అంగరంగ వైభవంగా రంగప్రవేశం చేయడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న దేశ ప్రజాస్వామిక విలువలకు నిజంగా విఘాతం కలుగుతుందన్న అభిప్రాయం మాత్రం ఎవరూ కాదనలేనిది.. అందుకే దేశంలో రచయితలంతా.. ఇప్పుడు ముక్తకంఠంతో...

Friday, October 9, 2015 - 22:09

నిరసన తెలిపితే... నిర్బంధిస్తారా..? ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా.. గళమెత్తితే నోరు నొక్కేస్తారా..? హక్కుల కోసం పోరాడితే లాఠీలు ఝుళిపిస్తారా.. న్యాయమేదని ప్రశ్నిస్తే.. అన్యాయంగా మాట్లాడతారా... ప్రజాక్షేమానికి పట్టుబడితే చట్ట సభల నుంచి నెట్టేస్తారా... చలో హైదరాబాద్ కు పిలుపిస్తే.. ఎక్కడికక్కడ చుట్టుముడతారా.. ఉద్యమాలతో ఉద్భవించిన తెలంగాణలో హక్కులకు దిక్కే లేదా..? ఇదేనా...

Thursday, October 8, 2015 - 22:17

అతడు ప్రపంచానికి ఓ రెవల్యూషనరీ ఐకాన్. అతని పేరు వింటూనే సామ్రాజ్యవాదులకు వెన్నులో ఒనుకు పుడుతుంది. అతని బొమ్మ మదిలో కదలాడితే.. నరాల్లో నెత్తురు విద్యుత్ ప్రవాహం అవుతుంది. విప్లవానికి ఎల్లలు లేవని, విప్లవాగ్నికి కులం, భాష, ప్రాంతం, మతం తెలియవని.. విప్లవం సమస్త మానవాళి సమాహిక స్వప్నమని నిరూపించిన మహోన్నత మానవుడు.. నిత్య యువకుడు. ఇప్పుడు ఆ విప్లవస్ఫూర్తి వ్యాపారకేంద్రంగా...

Wednesday, October 7, 2015 - 20:38

హైదరాబాద్ : అక్టోబర్ 2 మహాత్ముని జయంతి. జాతి పిత గాంధీజీని నోట్ల కట్ల మీద ముద్రించుకున్నాం. కార్యాలయాల్లో... ఇళ్లల్లో పటాలుగా వేళాడదీసుకున్నాం. వీధుల్లో విగ్రహాలను ప్రతిష్టించాం. కానీ మన గుండెల్లో మాత్రం నిలుపుకోలేకపోయాం. అందుకే ఈ సారి గాంధీ జయంతిని దేశం కొత్త తరహాలో జరుపుకుంటోంది. అదే 'జాయ్ ఆఫ్ గిలింగ్ లివింగ్' అదేంటో నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి...

Tuesday, October 6, 2015 - 22:09

మహానుభావులు ఎన్నో చెప్పారు. ఎంతో ఉపదేశించారు. కానీ రాజకీయమే పరమావధిగా భావించే వారికి ఈ మాటలు చెవికెక్కుతాయా..? అందలాలు అందుకోవడానికి రాజకీయమే నిచ్చెనగా తలచే వారికి ఆ ఉపదేశాలు రుచిస్తాయా..? దేశంలో తాజాగా చెలరేగుతున్న బీఫ్ రాజకీయాలు చూస్తే ఆలోచనాపరులకు ఆందోళన కలుగకమానదు. ఆఖరికి ఒక గోవు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే వారికి ఆయుధంగా దొరికిందా...? దేశానికి తాజా ముప్పుగా...

Monday, October 5, 2015 - 21:03

ఏ మలుపులో ఏ దొంగ ఉంటాడో తెలియదు. ఏ బస్టాపులో ఏ చోరీ కాపు కాస్తాడో బోధ పడదు. ఏ బైక్ మీద నుండి రయ్యిలా దూసుకొస్తాడో అంతుపట్టదు. ఏన్నాళ్ల నుండి మెడలో ఉన్న బంగారు గొలుసులపై కేటుగాళ్లు కన్ను పెట్టాడో ఊహకు కూడా రాదు. ఏ వీధి గుండా వెళ్లాలో..ఏ రోడ్డు పక్కన తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో మహిళలు అర్థం కావడం లేదు. మహిళలకు భద్రత ఇదేనా ? సెక్యూర్టీ అంటే వీవీఐపీల...

Friday, October 2, 2015 - 20:39

కళ్ల జోడు, చేతికర్ర, వెండి కుండలా పండిన తల, బక్క పల్చని రూపం. చెరగని బోసి నవ్వు.. చురుకైన చూపులు... చకచకా కదిలే అడుగులు... అతి సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడు. రక్తపు బొట్టు చిందకుండా దేశాన్ని దాస్య శృఖలాల నుండి విముక్తి చేసిన అహింసా మూర్తి. భారత జాతికి నిత్య స్ఫూర్తి. ప్రపపంచానికి శాంతి పవనాలు ప్రసరింపచేసిన దీప్తి. మరి ఆ మహాత్యుడు కలలు కన్న దేశం ఇదేనా? జయంతి, వర్థంతుల్లో...

Thursday, October 1, 2015 - 20:38

హైదరాబాద్ : మోదీ విదేశాలకు వెళ్లి సాధించుకొచ్చింది ఏమిటి? డిజిటల్ ఇండియా ఎవరి కోసం? ఇదే అంశం పై నేటి వైడాగింల్ లో విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను చూడాలంటే ఈ వీడీయోను క్లిక్ చేయండి.

Wednesday, September 30, 2015 - 20:39

హైదరాబాద్ : బంగారు తెలంగాణ అన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ అన్నారు. సర్వతంత్ర, స్వతంత్ర తెలంగాణ అన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ తెలంగాణ అన్నారు. ఎందరో వీరులు ప్రాణాలకు తెగించి తెలంగాణ ఆవిర్భావం కోసం పోరాడారు. ఏడాదిన్నర గడవకముందే చెప్పిన ఆశయాలన్నీ కుప్పకూలాయి. అప్పుడు వల్లించిన లక్ష్యాల కోసం ఇప్పుడు ఎవరు గొంతెత్తినా కత్తిరించే పనిలో పడ్డారు తెలంగాణ...

Tuesday, September 29, 2015 - 20:42

హైదరాబాద్ : గుప్పెడంత గుండె.. కానీ అదిచేసే ఉప్పెనంత శబ్ధం మాత్రం ఒక్కటే అదే తస్మాత్ జాగ్రత్త. ఏంటి ఇంతకీ మన గుండె మనకి ఏం చెబుతోంది? తనని నిర్లక్ష్యం చేయొద్దని చెబుతోంది. తెలిసి చేసిన నిర్లక్ష్యం తెలియకుండానే నిన్ను కబళిస్తుందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినం. నేటికీ మన సమాజంలో గుండె జబ్బులే అతి పెద్ద మరణ కారణంగా నిలుస్తోంది...

Thursday, September 24, 2015 - 22:17

నినాదాలు నింగినంటుతున్నాయి. నిరసనలు విరామం లేకుండా సాగుతున్నాయి. వ్యతిరేకిస్తూ.. విద్యార్తులు సాగిస్తున్న నిరవధిక యజ్ఞం. నేటికి ఆ పోరాటానికి 105 రోజులు నిండాయి. ఒక్క పూనే ఫిల్మ్ ఇనిస్టిట్యూటే మాత్రమే కాదు.. దేశంలోని పలు విద్యా పరిశోధనా సంస్థల్లో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రజాస్వామిక , లౌకికవాదులకు హెచ్చరికగా మారుతున్నాయి. ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.... మరిన్ని...

Tuesday, September 22, 2015 - 22:11

కులం పునాదుల మీద మీరు దేనినీ నిర్మించలేరు.. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు... అన్నాడు అంబేద్కర్ మహాశయుడు. కానీ, అదే కులం పునాదులు ఏ మాత్రం కదల్లేదు సరికదా.. మరింత బలపడుతూ, నిరంతరం వివక్ష రూపం మార్చుకుంటూ భారత వ్యవస్థను అంతకంతకూ దిగజారుస్తోంది. అభివృద్ధి నిరోధకంగా మారుతోంది. దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కుల వివక్షను రూపు మాపాల్సిందే.. దళితుల సమస్యలను...

Monday, September 21, 2015 - 21:44

అవి ఎదురు కాల్పులా...? లేక హత్యలా..? శృతి, సాగర్ల ఒంటిపై గాయాలెందుకున్నాయి..? ప్రజా ఉద్యమాల నుంచి మావోయిస్టుల వరకు వ్యతిరేకించే గొంతులను నులమడమే తెలంగాణ సర్కార్ మార్గమా...? విపక్షాన్ని, వ్యతిరేకస్వరాలను భరించే పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం లేదా..? జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి.. ప్రజా సంఘాలు... ఏమంటున్నాయి. గాయపడ్డ తెలంగాణపై ఈరోజ్ వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం చూద్దాం...

Thursday, September 17, 2015 - 20:44

హైదరాబాద్ : అది మట్టి మనుషుల పోరాటం.. దొరతనాన్ని సమాధి చేసిన సాయుధ సమరం. భూమి కోసం... భుక్తి కోసం... దాస్యశృంఖలాలను తుత్తినీయం చేయడానికి సామాన్యుడు గర్జించిన పూర్వ సన్నివేశం. మనిషిని మనిషిగా గౌరవించని సంస్కృతిని జనం నడిపించిన విప్లవం అది. బాంచన్ దొర కాళ్లు మొక్కుతా అన్న గొంతుకలే గొడ్డలి పట్టి భూస్వామ్య దొరతనపు పునాదులను కదిలించిన వైనం అది. ప్రపంచ చరిత్రలో...

Wednesday, September 16, 2015 - 20:38

హైదరాబాద్ : మన దేశంలో ఆకలితో అలమటిస్తోందా? కోట్లాది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారా? పౌష్టికాహార నివేదికలు చెప్పిన సత్యం ఏంటి? ఆఖలి రాజ్యం రాబోతోందా? ఇలాంటి అంశాలపై నేటి 'వైడాగింల్' లో విశ్లేషించారు. ఈ విశ్లేషణను మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

Tuesday, September 15, 2015 - 20:37

హైదరాబాద్ : ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అస్థిత్వం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనపడుతోంది. అనేక దేశాల్లో వామపక్ష శక్తులు దూకుడు కనపడుతోందా? లెప్టే రైట్ అని పశ్చిమదేశాలకు అర్థమయిందా? నవసమాజం వైపు యూరప్ ప్రజలు చూస్తున్నారా? ఇత్యాది అంశాలపై నేటి 'వైడ్ యాంగ్' లో చర్చించారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Friday, September 11, 2015 - 22:24

చెప్పుకోవాటానికి చాలా జీవోలున్నాయి. కానీ అమలు కావు. కాగితాలపై చాలా నిబంధనలున్నాయి. అసలే అనుసరించరు. చాలా తేలిగ్గా చదవును వ్యాపారంగా మార్చేశారు. వందల కోట్లు దండుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నారు. ఓవరాల్ గా విద్యారంగాన్నే శాసిస్తున్నారు. చదువు పేరు చెప్పి వేల కోట్లల్లో కొన్ని విద్యా సంస్థలు సాగిస్తున్న దందాపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం.. ఆ వివరాలను వీడియోలో...

Wednesday, September 9, 2015 - 22:30

రెండు రోజుల వర్షాలతో కరువు తీరినట్టేనా..? ఎండిన నేలకు సాంత్వన చేకూరినట్టేనా..? ఇప్పటికే సీమ నుంచి లక్షల మంది వలసబాట పట్టారు. దేశ వ్యాప్తంగా ఇవే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కరువు కోరలు చాస్తోంది. ఈ పరిస్థితికి పరిష్కారాలేంటీ..? అన్న అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేకకథనం.... ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss