వైడ్ యాంగిల్

Friday, November 18, 2016 - 20:45

నిన్నటిదాకా మూడు పువ్వులు ఆరు కాయలు..మధ్య వర్తులు, బిల్డర్లు, పెట్టుబడిదారులు..సర్కారీ ఖజానా కళకళ.. ఇప్పుడు ఒక్కసారిగా బూం ఢాం అంది. పెద్ద నోట్ల రద్దుతో సీన్ రివర్సయింది. ఎప్పుడు నార్మల్ అవుతుందో ఊహించని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జరిగిన ఒప్పందాలు సైతం రద్దవుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఎంత కాలం? పెద్ద నోట్ల రద్దు రియల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపింది.. ఇదే అంశంపై ఈ...

Thursday, November 17, 2016 - 20:48

ఎవర్నీ వదలటం లేదు..అందరిపైనా ఉరుము లేని పిడుగుపాటులా పడింది. ఒక్కసారిగా నేలకూల్చింది. బతుకుల్ని అయోమయంగామార్చింది. ముఖ్యంగా దేశానికి వెన్నెముక లాంటి రైతన్న కష్టాలు మాటలకు అందని తీరులో మారాయి. చేతిలో సొమ్ములేదు.. అప్పులు పుట్టవు. బ్యాంకుల రుణం అందదు.. రబీ సీజన్ మొదలయింది. ప్రకృతి విపత్తులకు అలవాటయిన రైతన్న సర్కారు కొట్టిన నోటు దెబ్బకు విలవిల్లాడుతున్నాడు. ఇదే అంశంపై ఈ రోజు...

Wednesday, November 16, 2016 - 20:39

అంచనాలు తప్పాయి.. అల్లకల్లోలం జరుగుతోంది. నల్లధనం కోసం అంటూ తీసుకున్న స్టెప్ ఇప్పుడు సామాన్యుడి మెడకు చుట్టుకుంటోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని వైఫల్యం ఇప్పుడు ప్రతికూలతను పెంచుతోందా? భారత ఆర్ధిక వ్యవస్థపై సరైన అంచనాలు లేకపోటమే ఈ సమస్యకు దారి తీసిందా? మరికొంత కాలం పెద్ద నోట్లు చెల్లుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందా? ఎంత కాలం ఈ నోట్ల గోల? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ...

Tuesday, November 15, 2016 - 20:42

ఏటీఎంల దగ్గర నిలబడి నిలబడి కాళ్లు పీకుతున్నాయి.. బ్యాంకు ఎదురుగా క్యూలో ఉండీ ఉండీ నీరసం వస్తోంది. ఉన్న నాలుగు పెద్ద నోట్లు చెల్లవు. మారవు. వంద నోట్లు అందవు. పాలు, కూరగాయలనుంచి ఏది కొందామన్నా వీల్లేని పరిస్థితి. ఏమిటీ సంక్షోభం? ఏ లక్ష్యం కోసం సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది? ఎవర్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. కరెన్సీ కష్టాలతో దేశమంతా విలవిల్లాడుతుంటే.. ఇంకో యాభై రోజులే అంటున్న...

Monday, November 14, 2016 - 20:58

పిల్లలకు కూడా హక్కులుంటాయా? వాళ్లకేం తెలుసు..? పెద్దవాళ్లు ఏది చెప్తే అది చేయాల్సిందే.. ఇంకా వినకపోతే వీపు పగలగొట్టాల్సిందే.. ఈ మాటలు మన సమాజంలో కొత్తవేం కాదు. కానీ, వాళ్లకూ హక్కులుంటాయి. సీతాకోక చిలుక రెక్కలపై ఎగిరే రంగురంగుల బాల్యాన్ని చిదిమేసే హక్కు... ఆఖరికి తల్లిదండ్రులకు కూడా లేదని.. గుర్తించాల్సిన సమయం వస్తోంది. ఈ క్రమంలో విద్య, వైద్యం. అక్రమ రవాణా, పేదరికం.. ఇలా...

Thursday, November 10, 2016 - 21:13

సమరానికి సై అన్నాడు..!! అధికారమే లక్ష్యంగా సాగనున్నాడా..? పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు..? అనంత సభ సంకేతాలేంటీ..? అసెంబ్లీకి 'గబ్బర్ సింగ్'... ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Wednesday, November 9, 2016 - 20:57

నోట్ల రద్దే అన్ని సమస్యలకు పరిష్కారమా ? విదేశాల్లో పోగుబడిన నల్లధనం మాటేమిటీ ? అక్రమ స్థిరాస్తుల సంగతేంటి ? సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతోంది ? నోట్లు... పాట్లు.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాను వీడియోలో చూద్దాం...

 

Monday, November 7, 2016 - 22:44

మరో ప్రపంచం కోసం తొలి అడుగులు, కోటి కాంతులతో సరికొత్త ఉషోదయపు వెలుగులు, అరుణారుణ పతాక రెపరెపలు, అక్టోబర్ విప్లవానికి జేజేలు..!! ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలోచూద్దాం..

Tuesday, November 1, 2016 - 20:06

తెలిసి చేశారో.. తెలియక చేశారో.. అసలు చేయలేదో ..మొత్తానికి ఊచలు లెక్కపెడుతున్నారు. కానీ, ఏ విషయం తేల్చాలి కదా.. అయితే బయటికి లేదంటే లోపలికి పంపాలి కదా.. కానీ, అండర్ ట్రయల్ గానే ఉంచేస్తున్నారు. అసలు కంటే కొసరుతోనే శిక్షిస్తున్నారు. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు. వీరిలో నిరుపేద దళితులు, ఎస్టీలు, ముస్లింలు ఉన్నారని సర్కారీ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. దేశంలో...

Monday, October 31, 2016 - 20:48

ఉక్కు మా హక్కని ఉద్యమించారు.. ప్రాణ త్యాగాలు చేసి మరీ సాధించుకున్నారు. జాతిమెడలో మణిహారంలా వర్ధిల్లుతూ వేలాదిమందికి బతుకునిచ్చింది. కానీ, ఇప్పుడా హక్కుకు ప్రమాదం ఏర్పడిందా? సర్కారీ విధానాలు నష్టాలకు కారణం అవుతున్నాయా? అలనాటి ఉద్యమానికి ఇప్పుడు కొనసాగింపు అవసరం అవుతోందా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని చేసిన ఉద్యమానికి 50ఏళ్లయిన సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం..

...

Friday, October 28, 2016 - 21:29

దీపావళి అంటే మతాబుల వెలుగలు.... వెన్నెల ముద్దల వెలుగు రేఖలు, కాకరపువ్వొత్తుల కలకలం, చిచ్చుబుడ్డిలా ఉవ్వెత్తున్న ఎగసే సంతోషం... వెలుగు నింపాల్సిన చోట అంతులేని కాలుష్యం... వెలుగురేఖల వేడుకలో ఎన్నో అపశృతులు, పర్యావరణాన్ని కాలుస్తున్నారా..??.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Thursday, October 27, 2016 - 21:26

నినాదాలు ఘనం... ఆచరణ శూన్యం, మాటలకే పరిమితం... వాస్తవంలో వివక్షే నిజం.. ఒకే పనికి తక్కువ వేతనం...మహిలపై అంతులేని భారం, అర్థిక సమానత్వం... అంతులేని దూరం.. సమానత్వం ఎన్నాళ్లకు...? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.....

 

Wednesday, October 26, 2016 - 21:26

పచ్చటి అడవిలో రక్తం చిందింది. సర్కారు తుపాకీ గర్జించింది. ఉషోదయంపై ఎర్రటి చారిక మిగిల్చింది. ఎన్ కౌంటర్లే పరిష్కారమా..?? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

Monday, October 24, 2016 - 21:44

బజారుకెక్కిన ములాయం ఇంటిపోరు... పూటకో మలుపు తిరుగుతున్న యూపీ రాజకీయాలు.. అఖిలేష్ సొంత పార్టీ పెట్టబోతున్నాడా..  ఎస్పీలో లుకలుకలు విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయా...? తమ్ముడా...? తనయుడా..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేకంగా కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Thursday, October 20, 2016 - 21:10

భూములు కొల్లగొట్టడమే లక్ష్యం.. ఎకరాల్లెక్కన కబళించటమే టార్గెట్. సామాన్యుల బతుకులను చిదిమి బడాబాబుల బొక్కసాలు నింపటమే తమ ధ్యేయమంటోంది. ఓ పద్ధతి లేదు.. ఓ పరిహారం లేదు. అధికారం ఉంది కదా అని.. పోలీసులు చేతిలో ఉన్నారు కదా అని.. బల ప్రయోగంతో.. ప్రజలను చెదరగొట్టి, బెదరగొట్టి భూములనుండి వెళ్లగొట్టి.. గ్రామాలను ఖాళీచేసే కుట్రలు అడుగడుగునా సాగుతున్నాయి. ఏపీలో అనేక జిల్లాల్లో ఇదే తంతు...

Wednesday, October 19, 2016 - 20:47

ఆరు దశాబ్దాలు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో ఆరు దశాబ్దాలైనా వస్తుందనే నమ్మకం కనిపించటం లేదు.. అన్ని రకాలుగా అణచివేత, అంతులేని దోపిడీ, అంతం లేని వివక్ష... వెరసి దారుణమైన వెనుకబాటు. ఇలాంటపుడు దేశంలో దళితుల స్థితిగతులు ఎప్పుడు మారతాయి? సర్వేలు నిర్ఘాంతపరుస్తున్నాయి. సమస్యను చర్చించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. ఆ...

Monday, October 3, 2016 - 20:40

జయలలితకు ఏమయింది? ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు?పార్టీ వర్గాల్లో, సగటు కార్యకర్తల్లో ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు..?జయ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? శశికళ అత్యవసర సమావేశం దేన్ని సూచిస్తోంది? తమిళనాట రాజకీయాలు ఏ మలుపుతిరగనున్నాయి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..ఒంటిచేత్తో రాష్ట్ర రాజకీయాలను చక్రంతిప్పే మహిళ ఆస్పత్రి పాలవటంతో తమిళనాడు అంతటా అయోమయం..గందరగోళం.....

Friday, September 30, 2016 - 20:59

ఎవరి బలం ఎంత ? అణ్వాయుధాలు ప్రయోగిస్తారా ? ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏమౌతాయి? ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? యుద్ధం వస్తే..?? ఈ అంశంపై ఇవాళ్టి వైడాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

Wednesday, September 28, 2016 - 21:21

ఎందుకు మూసేస్తున్నారు ? పెట్టుబడులెందుకు ఉపసంహరించుకుంటున్నారు..? ప్రైవేటుపరం ఎందుకు చేస్తున్నారు..? సర్కారు చెబుతున్నవాదనలేంటీ ? గ్లోబలి పీఠంపై ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎస్ యూల మెడకు ఉరి..!! ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....
 

 

Friday, September 23, 2016 - 20:39

మీకు రెగ్యులర్ గా సినిమాలు చూసే అలవాటుందా? తెలుగు, హిందీ లేదా ప్రపంచ భాషల సినిమాలు..ఏవైనా సరే. ఇవి మీపై ప్రభావాన్ని చూపుతాయనేది కొత్త విషయం కాదు. ఏ కళా రూపమైనా సమాజంపై ప్రభావం చూపుతున్నప్పుడు, అక్కడ బాధ్యత అనే ఎలిమెంట్ కూడా ఉండాలా వద్దా..? ఇదే ఇక్కడ ప్రశ్న. భారతీయ సినిమా కేవలం సొమ్ము చేసుకోవటంతోనే ఆగుతోందా? లేక రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తోందా? అభిమానంతో నెత్తిన...

Thursday, September 22, 2016 - 20:48

చివరికి హైకోర్ట్ సూచనలు కూడా వచ్చాయి. ఇప్పుడైనా ఈ అంశంలో కదలిక వస్తుందా? నిజానికి గోడదూకే నేతల్ని ప్రోత్సహించటంలో అన్ని ప్రధాన పార్టీలది ఒకే నీతి.. కానీ, దీనిపై నిర్ణయం తీసుకోవలసిన స్పీకర్ నిర్ణయంలో జాప్యం, టీటీడీ ఎమ్మెల్యేల విలీనం మొదలైన అంశాలపై హైకోర్ట్ సూచనలు కొత్త పరిణామాలకు దారితీస్తున్నాయి. స్పీకర్ అధికారాలను కోర్టులు ప్రశ్నించవచ్చా అనే వాదనను లేవనెత్తుతున్నాయి....

Wednesday, September 21, 2016 - 21:59

వర్షం వణికించింది. ఒక్క రాత్రి వచ్చిన వాన విశ్వనగరం డొల్లతనాన్ని స్పష్టంగా చూపింది. రోడ్లన్నీ సంద్రమై, లోతట్టు ప్రాంతాలు జలమయమై.. జనజీవనం అస్తవ్యవస్తమై.. చివరికి అనేక ప్రశ్నలు రేకెత్తించింది. 2000 సంవత్సరంలో 15 సెంటీమీటర్ల వర్షానికి నగరం విలవిల్లాడింది. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో వస్తే.. నగరానికి భరించే సత్తా ఉందా? ఊహించటానికే భయపడాల్సిన పరిస్థితి. భాగ్యనగరం భాగ్య సాగరం...

Tuesday, September 20, 2016 - 21:21

నదీ వివాదాలు మనదగ్గర కొత్త విషయమేం కాదు. నది పుట్టిన చోటి నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక రాష్ట్రాలకు ఆధారం, అనుబంధం. ఇక ఆనకట్టలు కట్టి బతుకుల్ని పునర్వచించుకునే చోట సమస్య మరింత జటిలంగా మారుతోంది... ఇదే అనేక వివాదాలకు కారణమవుతోంది.. అందర్నీ తృప్తిపరిచే పరిష్కారం సాధ్యం కాకపోవచ్చు. కానీ, నదీజలాలపై చట్టాలేం చెప్తున్నాయో వాటిని పకడ్బందీగా అమలు చేయటమే ఇక్కడ పరిష్కారం.. మరి ఈ...

Friday, September 16, 2016 - 20:09

అది మట్టి మనుషుల పోరాటం..దొరతనాన్ని సమాధిచేసిన సాయుధ సమరం..భూమి కోసం భుక్తికోసం, దాస్య శృంఖలాలను తుత్తునియలు చేయటానికి సామాన్యుడు గర్జించిన అపూర్వ సన్నివేశం. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి జనం నడిపించిన విప్లవం అది. బాంచన్ దొరా కాల్మొక్తా అన్న గొంతుకలే గొడ్డలిపట్టి భూస్వామ్య దొరతననపు పునాదులను కదిలించిన వైనం అది. ప్రపంచ చరిత్రలో అది చెరగని అధ్యాయం. అదే...

Monday, September 12, 2016 - 20:39

పెల్లెట్లు దూసుకొస్తున్నాయి. గాయాలవుతున్నాయి. రక్తమోడుతోంది. ప్రాణాలు పోతున్నాయి.. ప్రమాదంలో ఉంది శాంతి భద్రతలు మాత్రమే కాదు.. మేం ఈ గడ్డకు చెందిన వారమే.. మాదీ ఈ దేశమే అనే నమ్మకం. ఫలితం.. ప్రజల్లో ఓ అభద్రత.. అసంతృప్తి.. వెరసి కశ్మీరం అట్టుడుకుతోంది. తుపాకీతో, సాయుధ బలగాలతో పరిస్థితిని అదుపు చేయగలమని నమ్మినంతకాలం కశ్మీరంలో మార్పు సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఈ...

Friday, September 9, 2016 - 20:48

గొంతు చించుకున్నాడు..చరిత్ర పాఠాలు తవ్వాడు..న్యాయం కావలసిందే అన్నాడు..ఇవన్నీ గతంలో కూడా చెప్పాడు..మరి కొత్తగా ఏం తేల్చాడు..?? కొంత ఆవేశం, ఇంకొంత బిజెపీ పట్ల వ్యతిరేకత పవన్ కల్యాణ్ లో కనిపిస్తున్నాయా? పవన్ తన పయనంలో యూ టర్న్ తీసుకోబోతున్నాడా? కాకినాడ సభ సంకేతాలేంటి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. తాను ఇంత కాలం మద్దతిచ్చిన బీజెపీపై చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం...

Thursday, September 8, 2016 - 20:47

ప్రెస్ మీట్ అంటూ హడావుడి చేశారు.. స్టేట్ మెంట్ అంటూ ఒకటే రచ్చరచ్చ చేశారు..చివరికి తుస్సుమనిపించారు. ఏ పీ ప్రజలకు సింపుల్ గా హ్యాండిచ్చారు. హామీలు, వాగ్దానాలు మాటలకు మాత్రమే పరిమితం అని, చేతల్లో కనిపించేది శూన్యం అని తేల్చేశారు. మరో పక్క ఈ అంశంపై నిలదీసే ధోరణి వదలి సామరస్యంగా ఉందామంటున్న చంద్రబాబు తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఏపీ ఈ అరకొర సాయంతో...

Pages

Don't Miss