వైడ్ యాంగిల్

Friday, August 4, 2017 - 22:09

నాకు ఓటేయకపోతే నా రోడ్డుమీద నడవొద్దు... నడిరోడ్డు మీద కాల్చిపడేయాలి.. సన్నాసీ.. చవట దద్దమ్మా.. ఇవి సినిమా డైలాగులు కాదు.. నాటకంలో మాటలూ కాదు.. మన ప్రియతమ నేతలు.. చంద్రబాబు, జగన్, కెసీఆర్ లాంటి ప్రముఖులు ఉపయోగిస్తున్న భాష ఇది. సింపుల్ గా చెప్పాలంటే  టంగ్ ఓ రేంజ్ లో స్లిప్పవుతోంది. మాటలు కంట్రోల్ తప్పుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కనిపిస్తున్న సీన్ ఇది. అసలది నాలుకా, లేక...

Thursday, August 3, 2017 - 21:33

దేశం చీకటిలో మగ్గుతున్నప్పుడు వెలుగునిచ్చే వెలుగుదివ్వె కావాలి. మూఢనమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు రాజ్యమేలే కాలంలో ప్రశ్నించే గొంతుకలు ఎలుగెత్తాలి.. పాలక శక్తులు అణచివేతకు పాల్పడుతున్న కాలంలో ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఎదురు నిలిచే ధైర్యం కావాలి. ఏది నిజం, ఏది కల్పన తేల్చుకోని అజ్ఞానంలో తనదేశ ప్రజలను మగ్గుతున్నపుడు.. తన ప్రయోగశాలను సమాజం నడిబొడ్డున పెట్టుకుని ప్రజలతో...

Monday, July 31, 2017 - 20:31

ప్రకృతి సహకారం లేదు.. సరే..ప్రభుత్వం ఏం చేస్తోంది..?ఈ దేశ పౌరులుగా కనీస రక్షణలను పొందాల్సిన పౌరులను గాలికొదిలేసిన ఏలికలు దశాబ్దాలుగా సాధించిందేమిటి? ఇన్ని వేల మంది చనిపోతే చీమకుట్టినట్టుగా కూడా అనిపించని సర్కారీ పెద్దలకు మెలకువ ఎప్పుడొస్తుంది? ఇంకెన్ని మరణాలు రావాలి? ఇంకెన్ని గ్రామాలు నాశనం కావాలి? ఉద్ధానం ప్రశ్నిస్తోంది..! సమాధానం కోసం డిమాండ్ చేస్తోంది..!! ఇదే ఈ రోజు...

Thursday, July 27, 2017 - 20:36

అఖండ భారతం..మాదే ప్రజల తీర్పు ఎలా ఉన్నా మాకున్న ఎత్తుగడలు మాకున్నాయి..బీహార్ రాష్ట్ర రాజకీయాల మార్పుతో నరేంద్ర మోడీ పంపిన సందేశమిది..మరి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి...బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామాచేశారు..మళ్లీ కొద్దిగంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు...24గంటల వ్యవధి లేకుండా జరిగిన పరిణామిలివి...నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలేంటీ ?.....

Wednesday, July 26, 2017 - 20:39

వట్టి సిట్టింగులేనా ? తేల్చేదుందా ? ప్రస్తుతం డ్రగ్ కేసులో ఎక్జైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సాగిస్తున్న విచారణపై ప్రశ్నలు అనేకం వస్తున్నాయి. గతంలోనే అనేక కేసుల్లో జరిగిన సిట్ విచారణ ఫలితాల వల్ల కలుగుతున్న అనుమానాలు. మరి ఈ కేసు కూడా ప్రచారానికి ఉపయోగపడి పత్తా లేకుండా పోతుందా ? నిజాలు నిగ్గు తేల్చి దోషులను పట్టిస్తుందా ? ఈ అంశంపై ప్రత్యేక కథనం..పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్...

Tuesday, July 25, 2017 - 21:03

దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది.. ఇది సినిమా డైలాగ్ కాదు.. నిజం. ఒకవైపు అసహనం....మరోవైపు హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజకీయాలు. ఇదో కీలక సమయం. ఈ సమయంలో బాధ్యతలు చేపట్టిన కోవింద్ ముందున్న సవాళ్లేంటీ..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Monday, July 24, 2017 - 21:17

పైకి స్వదేశీ కబుర్లు చెబుతారు.. కానీ చేతల్లో పక్కా విదేశీ న్యాయం పాటిస్తారు. మనరైతులంటే చులకన.. మన పౌరులంటే చిన్న చూపు.. మన పరిశ్రమలంటే నిర్లక్ష్యం.. మన పాడి అంటే పట్టరానితరం.. వెరసి  ఒప్పందాల ముసుగులో దేశాన్ని నాశనం చేసి... పరాయి దేశాలకు, మల్టీనేషనల్ కంపెనీలకు సంపదనకు, ప్రజల హక్కులను, అంతిమంగా దేశ సార్వభౌమత్వాన్ని ధారాదత్తం చేసే చర్యలకు ప్రభుత్వాలు దిగుతున్నాయా?...

Friday, July 21, 2017 - 21:43

అంతిమంగా కిక్కు కావాలి. డ్రగ్స్ తో వచ్చే కిక్ కొందరికి.. దాన్ని అమ్మితే వచ్చే సొమ్ము ఇచ్చే కిక్ ఇంకొందరికి .. మందు, సిగరెట్ లాంటి మత్తు పదార్ధాలపై పన్నులు వసూలు చేసి, లైసెన్సులు అమ్మే కిక్ ఇంకొకరిది. ఓ వరాల్గా వ్యక్తుల బలహీనత, పాలనా వ్యవస్థల బలహీనత.. రెండూ కనిపిస్తున్నాయి. మరి ఏది ప్రమాదకరం? ఏది మారాలి? ఎంత మారాలి? ఇదే  ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. చట్టప్రకారం మాట్లాడాల్సినవి...

Thursday, July 20, 2017 - 21:15

వ్యవసాయ ప్రధాన దేశం మనది...రైతు కళ్లల్లో ఆనందం నిండినప్పుడే...మన వ్యవస్థకు సుస్థిరత... రైతన్నను వదిలేస్తే దేశానికి భవిష్యత్ శూన్యం...కానీ ఈ నిజాన్ని పట్టని ప్రభుత్వాలు రైతన్నను ఒంటరి చేస్తున్నాయి.. నిర్మాణాత్మక వ్యవసాయ విధానాలు రూపొందించలేని ప్రభుత్వాల వైఫల్యం... కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టే విధానాలే.. దీనికి కారణంగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ....

Tuesday, July 18, 2017 - 20:55

ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు... చదువు సంధ్యల్లో ముందుంటారు.. కానీ, ఆహ్లాదంగా, ఆనందంగా కనిపించే ఆ కళ్ల వెనుక ఏవో అసంతృప్తులు.. ఆ చిన్న మెదళ్లపై ఏవో వత్తిళ్లు.. అనవసరమైన అనేక ప్రలోభాలు.. ఫలితం అనేక అనూహ్య పరిణామాలు.. మరి ఆ చిట్టిబుర్రలను తొలిచేసేదేమిటి? ఆకర్షించేదేమిటి? పూర్ణిమ ఒక్క అమ్మాయి కాదు.. అలాంటి అనేకమంది పూర్ణిమలు ఇప్పుడు మన సమాజంలో కనిపిస్తున్నారు.. వారి సమస్యలేమిటి...

Monday, July 17, 2017 - 20:24

మాటలదేముంది బాస్ ఎన్నైనా చెప్పొచ్చు.. కానీ, వాటిలో నిజం ఎంత? నిజాయితీ ఎంత అనేదే ముఖ్యం. ఓ స్టేట్ మెంట్ ఇచ్చేస్తే అదే పడుంటుంది.. అనుకుంటే ప్రయోజనం ఏముంటుంది.. ఓ పక్క జరగాల్సిందంతా జరుగుతోంది. దేశంలో దళిత బహుజనులు మైనార్టీలపై అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. గోరక్షణ పేరుతో పూటకోచోట విరుచుకుపడుతూనే ఉన్నారు.. ఇవన్నీ ఓ పక్కన రక్తపాతాన్ని సృష్టిస్తుంటే మాన్య ప్రధాని మోడీ గారు...

Friday, July 14, 2017 - 20:34

ఉన్నంత కాలం బాగానే ఉంది.. పొమ్మనేటప్పుడే అడ్డా మీద కూలీలకంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఐటి రంగం భవితేమిటి? మెడపై లే ఆఫ్ కత్తి వేలాడుతుంటే అంతులేని ఒత్తిడితో టెకీలు ఏం కాబోతున్నారు? తెల్లారితో ఉద్యోగం ఉంటుందో లేదో, ఏ నిమిషం హెచ్చార్ నుండి మెయిల్ వస్తుందో అర్ధం కాని అయోమయం ఒక్కసారిగా లక్షలాది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తీవ్రమైన అభద్రతలో పడేస్తోంది. ఈ పరిస్తితికి కారణం ఎవరు? దీనికి...

Thursday, July 13, 2017 - 19:53

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్‌ మాఫియా కేసు కుదిపేస్తోంది.. పలువురు సినీ ప్రముఖులను సిట్‌ నోటీసులు వణికిస్తున్నాయి.. నోటీసులు అందుకునేవారిసంఖ్య 20కి చేరే అవకాశం కనిపిస్తోంది.. డ్రగ్స్‌ కేసులో ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలకుకూడా సిట్‌ నోటీసులు పంపింది.. నోటీసులు అందుకున్నవారిలో ఓ టాప్‌ డైరెక్టర్‌, టాప్‌ హీరో, టాప్‌ కెమెరామెన్‌ తమ్ముడు...

Tuesday, July 11, 2017 - 20:44

అర్జుడి విగ్రహాని నెత్తిమీద పెట్టుకొని ఎంతో సంతోషంగా మోసుకొస్తారు..ఎంతో ఉత్సహాంతో తము మోసుకొచ్చిన కళ్ల మీద తమ కళ్లేదుటే పసుపు నీళ్లు చల్లుతుంటే వారి హృదయం అవమానా భారంతో ముగులుతుంటుంది. అందరిలాగే తము అగ్నిగుండంలో పరుగెత్తాలని ముచ్చటపడతారు. కానీ అక్కడ కనకన మండే అంక్షాల కోలిమి వారి కాళ్లకు బంధనాలు వెస్తోంది. బకసూరిడికి ఆహరం తీసుకెళ్లే ఘట్టంలో తాము బండి కట్టి బీముని తరుపున...

Monday, July 10, 2017 - 20:57

మనం శాస్త్రసంకేతిక రంగంలో పరుగులు తీస్తున్నాము..మనం డిజిటల్ అభివృద్ధిలో విమానం కంటే వేగంగా వెళ్తున్నాము..ఇవి ప్రొద్దున్న లేస్తే మనం వినే మాటలే..కానీ ఈ సమాజంలో కూడా మూఢనమ్మకాలను మోస్తున్నాము..మూఢత్వం కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మనం సాధించామని చెబుతున్న అభివృద్ధిని వెక్కిరిస్తున్న మూఢనమ్మకాల పై ఈరోజు వైడ్ యాంగిల్.

Friday, July 7, 2017 - 21:47

నీ స్నేహితులెవరు చెప్పు... నీ వెంటో చెప్తానంటారు. ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకుని.. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని భావించే దేశానికి దగ్గరయ్యే ఆరాటం. ఆ అగ్రరాజ్యానికి పావులా మారిన కిరాయి గుండా లాంటి మరో దేశంతో ఇప్పుడు కొత్త స్నేహం. దశాబ్ధాలుగా మన దేశం అనుసరిస్తున్న దౌత్య విధానాలను తుంగలో తొక్కుతున్న ఈ కొత్త స్నేహాలు ఏ లక్ష్యం కోసం...? ఈ అడుగులు ఏ గమ్యం వైపు..? ఇదే...

Thursday, July 6, 2017 - 22:34

స్కూళ్లు పిల్లలంటే చాక్లెట్లు, కేకులు, పీజాలకు అలవాటైతారు... ఇదీ సాధారణం..కానీ స్కూల్ కాంపౌడ్ లోకి డ్రగ్స్ వచ్చి చేరుతున్నాయి. బాల్యాన్ని ఛిదిమేస్తున్నాయి. జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. మేలుకోకపోతే కుటుంబాలు చితికి పోవడం ఖాయం. మహానగరం మత్తులో మునిగి డ్రగ్స్ బాధితుల అడ్డాగా పూర్తిస్థాయిలో మారకముందే మేల్కోవడం అవసరం ఉంది. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ స్టోరీ.....

Wednesday, July 5, 2017 - 21:24

మద్యం ఏరులైపారితేచాలు... ప్రజలభాగోగుల సంగతి ఎవరికి కావాలి... ఖజానా నిండితేచాలు రోడ్లపై రక్తపు చారికలు కడుతున్నా... కుటుంబాలు కూలిపోతున్నా.. ఎవరికి కావాలి... అందుకే హైవేలు కాస్త పేరు మార్చుకున్నాయి.. డినోటిఫై పేరుతో మద్యం దందాకు ప్రోత్సాహాలు కల్పిస్తోంది ఏపీ సర్కార్. హైవేలపై బార్లు, వైన్ షాపులు ఉండొద్దని.. సుప్రీంకోర్టు చెబితే అసలు హైవేలనే మాటే లేకుండా చేసింది ఏపీ సర్కార్....

Tuesday, July 4, 2017 - 21:05

మాటలు తప్ప చేతలు కనిపించన చోట... నిలబెట్టి కడిగేసే తెగువ కావాలి.. హామీలు వమ్మే అయ్యేచోట.. ప్రశ్నల వర్షం కురిపించే గొంతుకవ్వాలి...
ఏలికల నిర్లక్ష్యం... ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తుంటే.. ఏకమైన ప్రజా గొంతుకలు పోరాటమే మార్గంగా.. ముందుకు సాగాలి... ఇదే లక్ష్యాలతో ఇప్పుడు తెలంగాణలో ఒక వేదిక ఆవిర్భవించింది. ప్రజా గొంతుకగా మేము నిలబడతాం... అన్యాయాల నిగ్గుతేలుస్తాం.. ప్రజల...

Monday, July 3, 2017 - 22:12

మత్తులో పడుతున్నారు... సరదాగా చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో డ్రగ్స్ బారిన పడుతున్నారు.. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం...నిత్యం రేవు పార్టీల సందడి.. ఓవరాల్ గా మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతున్న యువత... వెరసీ హైదరాబాద్ నగరం డ్రగ్స్ ముఠాలకు అడ్డాగా మారుతుందా...? డ్రగ్స్ బానిసలకు నిలయమవుతుందా..? ప్రమాదకర డ్రగ్స్ కు బానిసలయ్యేవారు పెరుగుతున్నారా.?? ఇదే అంశంపై వైడ్ యాంగిల్ సోర్టీ...

Thursday, June 29, 2017 - 20:33

 

ఓ యువకుడు రైళ్లో వెళ్తున్నాడు.. సీటు దగ్గర గొడవొచ్చింది.  సాధారణంగా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇక్కడ హత్య జరిగింది. కారణం తెలుసా.. బీఫ్ తింటాడని.. గొడ్డు మాంసం తింటాడని చంపేశారు. ఎందుకీ ఉన్మాదం.. ఎందుకీ అరాచకం..ఏ మత విలువలు ఈ హింసను ప్రోత్సహిస్తున్నాయి. గోవుని కాపాడి మనిషిని చంపి ఏం సాధిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశంలో కాస్త ఆలోచన ఉన్నవారైనా నాట్ ఇన్ మై...

Tuesday, June 27, 2017 - 20:41

ఇద్దరూ నినాదాలిస్తారు.. తమ తమ దేశాలను గొప్పగా మార్చాలని చెప్తుంటారు..ఒకరు అమెరికా అధ్యక్షుడు.. మరొకరు భారత ప్రధాని..అమెరికా భారత్ తో స్నేహానికి ముందుకు దూకుతోందా? వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ ఎందుకు మారింది? దీనికి కారణాలేంటి? ట్రంప్ మోడీ భేటీ ఏం తేల్చింది? ఎన్ని మాటలు చెప్పినా... ఎన్ని ప్రకటనలు చేసినా, ద్వైపాక్షిక సమావేశాల్లో ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం.. ఇప్పుడు...

Tuesday, June 27, 2017 - 14:09

జీఎస్టీ బిల్లు ఏంచెబుతుంది...? వస్త్ర వ్యాపారుల ఆందోళనకు కారణమేంటీ...? కేంద్రం ఇస్తున్న వివరణ ఏంటీ.. రాష్ట్రాలకున్న అభ్యంతరాలేంటీ..? అనేక సందేహాలు కలవరపెడుతున్నాయి. జీఎస్టీ బిల్లుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోనుందా..?  అద్భుతాలు జరుగుతాయా..? ఆర్థికాభివృద్ధి వేగం పుంజకుంటుందా.? లేక సామాన్యుడు కష్టాల్లో పడతాడా...? ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ ఎపిసోడ్. పూర్తి వివరాలను వీడియోలో...

Thursday, June 22, 2017 - 20:34

హైదరాబాద్: కులమా..? ఇంకెక్కుడుంది బాసూ..? ఒకప్పుడుడెప్పుడో వుండేది. ఇంకా ఆ పాత మాటెందుకూ అంటారా? అస్సలు కుల వివక్ష అంటే ఏమిటి గురూ? దాని రూపం ఎలా వుంటుంది? రంగూ, రుచి, వాసన ఎలా వుంటాయని ప్రశ్నిస్తారా? ఇంకొంచెం డీప్ గా వెళ్లి 2017లో నూ ఇదేంటి బాస్ అంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలా? అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ వూరికి వెళదాం....

Wednesday, June 21, 2017 - 20:36

హైదరాబాద్: పోస్టు పెడితే బుక్కు...లైక్ కొడితే ముప్పు, అవును జరుగుతున్న తీరు అదే విధంగా ఉంది. సోషల్ మీడియాలో పోస్టులును డేగకళ్లలా ప్రభుత్వాలు గమనిస్తున్నాయా? తమకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వస్తే భరించలేని అసహనంతో ఊగిపోతున్నారా? రాష్ట్రం ఏదైనా కావొచ్చు.... పార్టీ ఏదైనా కావొచ్చు. సోషల్ మీడియా రాతలు అరెస్టులు.. వేధింపులకు దారితీస్తున్నాయా? అస్సలు...

Monday, June 19, 2017 - 20:39

నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.. సైలెంట్ గా దందా సాగిస్తున్నారు. పిల్లలు లేని వారి ఆ కొరతను తీర్చే అపురూపమైన అవకాశాన్ని వ్యాపారంగా మార్చి.. పేద మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ల మాటున జరుగుతున్న ఈ వ్యాపారానికి చెక్ పడేదెప్పుడు? సంతాన సాఫల్య కేంద్రాలు, బ్రోకర్ల ఆటకట్టించేదెప్పుడు? ఈ అంశంపై ప్రత్యేక కథనం..సరోగసీతో పిల్లల్ని కనండి తప్పులేదు. కానీ,...

Friday, June 16, 2017 - 20:36

హైదరాబాద్: నోటికి అడ్డూ అదుపూ ఉండదు...బండబూతులు తిడతారు.,కోపం వస్తే కాళ్లూ చేతులు కూడా ఆడిస్తారు. కంట్రోలు ఉండదు. తాము ప్రజా ప్రతినిధులమని కాదు.. అంతకన్నా ముందు మనుషులమనే సంగతి కూడా మర్చిపోతారు. ఆకాశం నుండి ఊడిపడ్డామని భ్రమపడతారు. అంతిమంగా ప్రజా ప్రతినిధులు ఎలా ఉండకూడదో అలానే తయారు అవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు... ప్రతి రాష్ట్రంలో ఇలాంటి...

Pages

Don't Miss