వైడ్ యాంగిల్

Tuesday, March 1, 2016 - 21:38

దేశ ద్రోహులెవరు..? దేశభక్తులెవరు..? ప్రశ్నించాల్సిన మీడియా తీర్పునిస్తోందా..?  ఆలోచింపచేయాల్సిన మీడియా ఉద్రేకపరుస్తోందా..? జెఎన్ యూ సందర్భంలో జాతీయ మీడియా.. అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, February 29, 2016 - 20:41

హైదరాబాద్ : ఎవరి పక్షం.. ఎవరికి అనుకూలం, జైట్లీ బడ్జెట్ ఏ సంకేతాలు ఇచ్చింది. అంకెల గారడీ మాత్రమే ఉంటుందా? లేక ప్రజానుకూల ప్రకటనలు ఉన్నాయా? సామాన్యుడి పక్షమా... లేక కార్పొరేట్ల పక్షపాతమా?, వరాలా.. వడ్డనలా? సబ్సిడీలు ఎత్తేసే ప్రయత్నమా? మోడీ సర్కార్ ఎవరి పక్షాన నిలుస్తుందో ఈ బడ్జెట్ చెప్తోందా? ఇలా ఎన్నో ప్రశ్నలు... ఇదే అంశంపై నేటి వైడాంగిల్...

Thursday, February 25, 2016 - 20:39

హైదరాబాద్ : ఏదేశ ప్రజలైనా ప్రశాంత జీవనాన్నే కోరుకుంటారు, కానీ మిన్ను విరిగి మీదపడుతుంటే, కాళ్ల కింద భూమి చీలుతుంటే, కట్టు బట్టలతో దిక్కుతోచకుండా పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిరియన్లు కొన్నేళ్లుగా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఇపుడు ఆ విధ్వంసానికి విరామం వచ్చినట్లేనా? అమెరికా, రష్యాల చొరవతో సిరియాలో పరిస్థితి మెరుగుపడుతుందా? నేటి వైడాంగిల్ లో ప్రత్యేక...

Wednesday, February 24, 2016 - 20:47

హైదరాబాద్ : చా ర్ షౌ పురానా షహల్.. ఎన్నో ప్రత్యేకతలు, ఎంతో ఘన చరిత్రలు కలిగిన నగరం, అలాంటి భాగ్యనగర్ సిగలో మరో కీర్తి కిరీటం చేరింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ సత్తా ఏంటో చాటి చెప్పింది. సువిశాల నగరం, సుందర నగరం, పూదోటల నగరం, దక్కన్ పీఠభూమిలో వెలుగుతున్న చారిత్రక మణిహారం, అపూర్వ కట్టడాలు, ఆ మాటకు వస్తే దేశంలోని మిగతా నగరాల కంటే చాలా...

Tuesday, February 23, 2016 - 20:32

హైదరాబాద్ : గత సమావేశాల్లో సాధించిందేం లేదు. ఇప్పటి సమావేశాల్లో ఏం సాధిస్తారు.. పార్లమెంట్ ముందు అనేక సవాళ్లు. రాజకీయ రణరంగంలో వివిధ పార్టీల ఎత్తులు పై ఎత్తుల మధ్య మొదలు కాబోతున్న బడ్జెట్ సమావేశాలు ఏ తీరులో జరగబోతున్నాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. దేశవ్యాప్తంగా విద్యార్ధులు, రైతులు, మేధావులు, ఉద్యోగులు ఇలా అనేక రంగాల వారినుండి వ్యతిరేకత...

Monday, February 22, 2016 - 20:37

హైదరాబాద్ : వందలు, వేల కోట్లు ఉత్సాహంగా అప్పులిచ్చారు.ఇపుడు తెల్ల మొహం వేసి నీళ్లు నములుతున్నారు. రాజకీయ పరపతి వాడారు.. బ్యాంకులను కొల్లగొట్టారు. చివరికిచేతులెత్తేస్తున్నారు. ప్రజాధానం ఈ సమాజానికి ఉపయోగపడాల్సిన సొమ్ముని అక్రమంగా వెనుకేసుకుని తప్పుడు లెక్కలతో మాజాలం చేస్తూ బ్యాంకుల అప్పులు ఎగవేస్తున్నారు. ఇదీ జరుగుతున్న సంగతి. లక్షల కోట్ల...

Friday, February 19, 2016 - 20:45

హైదరాబాద్ : ఎక్సర్ సైజుతో రాటు తేలిన ఒళ్లు...నల్ల కోటు, కళ్లకు గగూల్స్... చురుగ్గా మూమెంట్స్, చక చకా జనాల్ని పక్కకు నెట్టేసుకుంటూ అలవోకగా దూసుకెళతారు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా తమ బాస్ ని కాపాడుకుంటారు. చీమ కూడా దగ్గరకు రాకుండా కాపలా కాస్తారు.. వారే బాడీగార్డ్స్. ఇపుడు ఓ సెలబ్రెటీ అడుగుదీసి అడుగు వేయాలంటే బాడీ గార్డ్స్ ఉండాల్సిందే....

Wednesday, February 17, 2016 - 21:43

నిన్నటికి నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన రేగింది. ఇప్పుడు జెఎన్ యూ వంతొచ్చింది. కోల్ కతా జాదవ్ పూర్ యూనివర్సిటీకి కూడా విస్తరించింది.  యూనివర్సిటీలు దేశ  రాజకీయ చిత్రంలో వస్తున్న మార్పును, జరుగుతున్న సంఘర్షణను ప్రతిఫలిస్తున్నాయా? 
కన్నయ్య కుమార్.. జెఎన్ యూ విద్యార్ధి నేత.
కన్నయ్య కుమార్, జెఎన్ యూ విద్యార్ధి నేత. పాతికేళ్లు సాధారణం...

Tuesday, February 16, 2016 - 21:58

చేపల చెరువులు పచ్చదనాన్ని మింగేస్తున్నాయి. పచ్చటి పంట పొలాల్లో అంతులేని విధ్వంసానికి తెరలేస్తోంది..ఏడాదికి రెండు పంటలతో, సహజ వనరులతో కళకళలాడే పశ్చమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రైతులు, కూలీలు రోడ్డున పడుతున్నారు. పొలాలు అమ్ముకునే పరిస్థితిలో పడుతున్నారు. కార్పొరేట్ల కొమ్ము కాసే ప్రభుత్వం ఆక్వా జోన్ పేరుతో దారుణానికి తెగబడే ప్రయత్నాలు చేస్తోంది....

Monday, February 15, 2016 - 20:47

నిగ నిగలాడే యాపిల్..పసని ఛాయలో మెరిసిపోయే మామిడి పండు..ఎర్రగా నోరూరించే పుచ్చపండు..వెంటనే తినాలని అనిపిస్తాయి. కానీ జరభద్రం..వాటి పక్కన రోగాలు పొంచి ఉన్నాయేమో చెక్ చేయండి. వాటి రంగు..రుచి కృత్రిమమో పరిశీలించండి..వాటిలో పోషకాలు మాట తరువాత తింటే భయంకరమైన రోగాలు వస్తాయేమో ఆలోచించండి. సహజసిద్ధంగా పండాల్సిన వివిధ రకాల కాయలను విషపూరిత..నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా అందిస్తుండడంతో...

Thursday, February 11, 2016 - 20:45

హైదరాబాద్ : అక్కడ మంచే ముంచుతుంది. శత్రువుల తూటాలకంటే బలంగా దిగబడుతోంది. శత్రువు కదలికనైనా వూహించవచ్చేమో గానీ ఈ మంచు కొండల ఉగ్రరూపాన్ని మాత్రం గ్రహించలేం. ఫలితంగా విలువైన సైనికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అసలు ఈ ప్రదేశానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, పాక్ ల నుండి కోట్లు ఖర్చు పెట్టిస్తున్న సియాచిన్ ఎందుకు కీలకంగా మారింది. నేటి వైడాంగిల్...

Wednesday, February 10, 2016 - 20:40

హైదరాబాద్ : పేరులో ఫ్రీ వుంది.. కానీ జరిగేది మాత్రం నిలువునా మోసమే. బేసిక్ ఇస్తారని నమ్మితే జరిగేది అడ్డంగా ఫేస్ బుక్కే. జీరో ప్లాన్ నమ్మితే మిగిలేది జీరోనే. ఇంటర్నేట్ ను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు బలంగా చేశారు. నెట్ న్యూట్రాలిటికీ గండి కొట్టాలని చాలా ప్రయత్నమే చేశారు. కానీ ట్రాయ్ ఈ కుట్రలను తిప్పి కొట్టింది. నెట్ న్యూట్రాలిటీకే మా...

Tuesday, February 9, 2016 - 21:08

హైదరాబాద్ : వాళ్లు బాబాలు... సర్వసంగ పరిత్యాగులు... కానీ వ్యవహారం చూస్తే అలా అనిపించదు. అశేష భక్త కోటికి బోధనలు చేయడమే కాదు.. కోట్లు సంపాదించడంలోనూ అంతే ప్రతిభ చూపిస్తున్నారు. ఆధ్యాత్మికతను ప్రజల్లో పెంచడమే కాదు, వ్యాపారాన్ని పగడ్బంధీగా చేస్తూ...వ్యాయామమే కాదు.. బిజినెస్ కూడా పగడ్బందీగా చేయగలమని నిరూపిస్తూ వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు...

Monday, February 8, 2016 - 20:39

హైదరాబాద్ : ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వరుసగా చుట్టుముడుతున్నాయి. విభజన తరువాత సమస్యల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది పోయి మరిన్ని గందరగోళానికి ఆజ్యం పోస్తున్నారు. పారదర్శకంగా ప్రజలను, విపక్షాలను కలుపుకుపోకుండా అందరినీ పక్కకు తోసేసి తన మాటే ఫైనల్ అనే దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణంలో అడుగడుగునా సమస్యలు కనిపిస్తోంటే కాపు సమస్యల్లాంటివి...

Thursday, February 4, 2016 - 20:35

పది నెలలు కాలేదు. అప్పుడే సీన్ మారిపోయింది. ముఫ్తీ మహ్మద్ ఉన్నప్పుడు ఎలాగూ గట్టెక్కించాడు. ఆయన గతించాక మ్యాటర్ క్లియర్ అవుతోంది. రెండు పార్టీల మధ్య ఎంతటి అగాధం ఏర్పడిందో బయటపడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తప్ప హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేయని కమలనాథుల తీరే ఈ పరిణామాలకు కారణమా ? పీడీపీ, బీజేపీల మధ్య అందనంత దూరం ఏర్పడిందా ?జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు ఏ దిశగా సాగుతున్నాయి....

Wednesday, February 3, 2016 - 21:49

ఓ మహిళ ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతోంది.. ఓ మహిళ ఆ రాష్ట్ర నేతలకు ముచ్చెమటలు పోయిస్తోంది. సాక్షాత్తు సీఎంనే ఇరకాటంలో పెడుతోంది. కేరళ అధికార పక్ష పొలిటీషయన్లకు ముచ్చెమటలు పోయిస్తుంది. లంచం, అక్రమమం, అధికార దుర్వినియోగం, సెక్స్ స్కాండిల్ వెరిసి.. ఓ స్కాం ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎవరామే..? ఏమా స్కాండిల్.. ఎమిటా వివరాలు.. కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న...

Monday, February 1, 2016 - 20:48

ప్రజల సొమ్ముకు నమ్మకమైన జవాబుదారిగా నిలిచే ఆర్థిక సంస్థలుగా పేరొందాయి. నవ భారత నిర్మాణంలో పాలుపంచుకున్న సంస్థలు.. దేశానికి పరుగులు నేర్పిన వ్యవస్థలు..భారతావనికి సాంకేతిక ప్రగతిని అందించిన సంస్థలు..చిమ్మ చీకటి నుండి వెలుగుబాటలోకి నడిపించాయి. గ్రామీణ భారతావనిని కనెక్టు చేసిన సంస్థలు..లక్షల కోట్ల సంస్థలు..భారతీయులంతా ఒక కుటుంబం అనుకుంటే ఇవన్నీ మన ఉమ్మడి ఆస్తులు. కానీ...

Friday, January 29, 2016 - 20:47

డేటింగ్ యాప్స్ తో డేంజర్ ఉందా ? ఆన్ లైన్ మోసాలకు డేటింగ్ సైట్స్ వేదిక అవుతున్నాయా ? డిజిటల్ లవ్ తో లైఫ్ రిస్క్ లో పడుతుందా ? స్నేహం పేరిట మోసాలకు దిగే కుట్రలు జరుగుతున్నాయా ? భారత్ లో సునామీ సృష్టిస్తున్న డేటింగ్ యాప్స్ దేశంలో పెరుగుతున్న డేటింగ్ కల్చర్ పర్యవసానం విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Thursday, January 28, 2016 - 20:37

మొన్న సార్స్ హెచ్ వన్ ఎన్ వన్...నిన్న ఎబోలా ఇవాళ జికా...ఇప్పటికే 25 దేశాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పుడు అమెరికాతో సహా పశ్చిమ దేశాలు దోమలను చూస్తే గడగడలాడిపోతున్నాయి. పలు దేశాల్లో ఆరోగ్యకర పరిస్థితిని విధించాయి. ముఖ్యంగా ఈ వైరస్ సోకిన మహిళల పిల్లలకు మెదడు సంబంధిత వ్యాధితో పుట్టడం ఎంతో ఆందోళన కలిగిస్తున్న అంశం. మరి భారతదేశానికి ముప్పు పొంచి ఉందా ? ఈ అంశంపై మరిన్ని...

Wednesday, January 27, 2016 - 20:41

రెండు దశాబ్ధాలుగా చిక్కడు దొరకడు అన్నట్లు... వేలది మంది పోలీసులకు ముచ్చెమటలు పోయించాడు. జైలు ఊచలు వణికిపోతుంటాయి. పొరపాటునా దొరికినా అతడిని కాపలా కాయడం అంత తేలిక కాదు..అతడు స్కెచ్ వేస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..డ్రగ్స్ మాఫియాతో మెక్సికోకు ముచ్చెమటలు పోయించాడు. అంతేగాక అమెరికాను సైతం హఢలెత్తించాడు. ఇప్పటికీ రెండు సార్లు చిక్కినట్టే చిక్కి ఎస్కేప్ అయ్యాడు. ముచ్చటగా మూడోసారి...

Tuesday, January 26, 2016 - 20:52

ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం. ఉచితం పేరిట ఓట్లను కొళ్లగొట్టడమే టార్గెట్. వాగ్ధానాలు హోరెత్తుతున్నాయి. అడ్డూ అదుపు లేని హామీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీల నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..అంటూ రాజకీయ నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. మరి ఈ...

Monday, January 25, 2016 - 20:39

ఆకలి భారతం కథ. శిథిలం భారతం గాథ. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్ధాలు అవుతున్నా తీరని వ్యథ..దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిందని..పెరుగుతోందని..అంబానీలు..ఆదానీల ఆస్తులు డబుల్..ట్రిపుల్ అవుతున్నాయని చూస్తున్నాం. అదే సమయంలో తినడానికి తిండి లేక నిత్యం కొట్లాది భారతీయులు నానా ఆగచాట్లు పడుతున్నారని వింటున్నాం. ఆరోగ్య సదుపాయాలు లేక ఎందరో అనేక రోగాలకు బలౌతున్నారని గమనిస్తున్నాం. మరి అసమానతలకు...

Friday, January 22, 2016 - 21:43

చందమామపై మానవ మనుగడ సాధ్యమా..?! అక్కడి వాతావరణాన్ని మనిషి తట్టుకోగలడా?.. చంద్రుడిపైకి పోదాం చలో చలో అంటున్న సైంటిస్టులు.., 2030 నాటికి బాబిలిపై నివాసం..!!, చందమామ కాలనీ.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం…. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Thursday, January 21, 2016 - 21:22

కొంత కాలంగా ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. స్టార్టప్ ఇండియా... స్టాండప్ ఇండియా.. అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని పిలుపునిచ్చిన సందర్భం. మెజారిటీ పాపులేషన్ యువత అయినపుడు, ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గుతున్న సంక్షోభ కాలంలో స్టార్టప్ లకు ప్రాధాన్యత పెరిగింది. మరి, స్టార్టప్ లపై సర్కారు విధానం ఎలా ఉంది. స్టార్టప్ బూమ్ ఏ దిశగా సాగుతోంది? ఈ వివరాలతో ఈ రోజు వైడాంగిల్ కథనం...

Wednesday, January 20, 2016 - 21:48

తమకు సంబంధం లేదని బుకాయిస్తున్నారు. తాము ఏ రకంగా బాధ్యులం కాదంటున్నారు.. ఇంకా చెప్తే, అలసిది దళితుల సమస్యే కాదంటున్నారు. తమ తప్పేం లేదని వాదిస్తున్నారు. ఎవరో చనిపోతే మేమెలా కారణమంటున్నారు. కానీ, దీనివెనుక జరిగిన తతంగాన్ని విస్మరిస్తున్నారు. లేఖలు రాసిన సంగతిని దాటేస్తున్నారు. అవి మూల కారణమని వస్తున్న వాదనలు కొట్టిపారేస్తున్నారు. ఏమిటా ఏడు లేఖల సంగతి..? ఆ లేఖల్లో...

Tuesday, January 19, 2016 - 21:34

ప్రపంచం తీవ్ర అసమానతలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచంలోని సంపదను అతి కొద్ది మందే అనుభవిస్తున్నారు. డబ్బును డబ్బే సంపాదిస్తుంది. సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. పేదరికం మరింత పేదరికాన్ని ఆకర్షిస్తోంది. శ్రీమంతులు వెలిగిపోగుతున్నారు. సామాన్యులు చితికి పోతున్నారు. అతి కొద్ది మంది దగ్గర పంపద పోగుపడుతుంది. అర్థిక అసమానతలు తీవ్రంగా...

Monday, January 18, 2016 - 20:41

యూనివర్సిటీలా ? లేక కుల పిచ్చిగాళ్లకు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వాళ్లకు అడ్డాలా ? విద్యా సుగంధాలు పంచి విద్యార్థుల బంగారు భవితను అందించాల్సిన యూనివర్సిటీలు ఎలా తయారవుతున్నాయి. కులం పేరుతో మతం పేరుతో విభజించి వివక్షతో ఎందరో విద్యార్థల భవితతో ఆడుకుంటుంటే చివరకు ఆ కలలన్నీ ఉరికొయ్యకు వేలుడుతున్నాయి. నా చావుకు నేనే కారణం..నా మిత్రులను శత్రువులను ఇబ్బంది పెట్టవద్దంటూ...

Pages

Don't Miss