వైడ్ యాంగిల్

Thursday, December 8, 2016 - 21:54

క్యూ కష్టాలు తీరలేదు.... ఏటీఎం బాధలు తగ్గలేదు.. చిల్లర సమస్య పోలేదు.. 30 రోజుల అచ్ఛేదిన్..!! ఈ అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథన.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, December 7, 2016 - 20:42

అమ్మ వారసత్వం ఎవరిది? అన్నాడీఎంకే సారధి ఎవరు? తాత్కాలికంగా ఈ అంశం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా...పరిస్థితి నివురుగప్పినట్టుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార కేంద్రాలు వేటికవే యాక్టివ్ గానే ఉన్నాయి. మరి రాబోయే కాలంలో ఎవరిది పైచేయి కాబోతోంది? ఎవరి చేతికి అన్నా డీఎంకె పగ్గాలు వెళ్లబోతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక కథనం.. శశికళ, పన్నీర్ సెల్వం, అజిత్ ఇప్పటికి అన్నాడీఎంకెలో...

Tuesday, December 6, 2016 - 20:51

ఒక శకం ముగిసింది.. దేశ రాజకీయాల్లో ఓ ఉక్కు మహిళ నిష్క్రమించింది. పురుషాధిక్య సమాజం.. ఓ మహిళ సమాజంలో నిలదొక్కుకోవటానికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసిన సమయం.. కానీ, ఆమె అడ్డుగోడలను బద్ధలు కొట్టారు.. ప్రత్యర్ధులను చిత్తు చేశారు. గమ్యాన్ని చేరారు. తిరుగులేని నేతగా ఎదిగారు. ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో మలుపులు.. ఆ ప్రస్థానంపై వైడాంగిల్ ప్రత్యేక కథనం.. మామూలు నటి కదా...

Friday, December 2, 2016 - 20:52

ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టుకున్నారు..ఎలుకను పట్టడం కోసం కొండను తవ్వారు..పిడికెడు అక్రమార్కుల భరతం పడతామంటూ దేశం మొత్తాన్ని పిల్లిమొగ్గలేయిస్తున్నారు.. నల్లధనం, నకిలీ నోట్లంటూ నిలువునా ప్రాణం తీస్తున్నారు.. ఇదే కామెంట్స్ అడుగడుగునా వినిపిస్తున్నాయి.. ఇదేనా నోట్ల రద్దు సాధించింది. సర్కారు చెప్పిన ప్రయోజనాలు ఎటుపోయాయి? నోట్ల రద్దు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోంది?...

Thursday, December 1, 2016 - 20:40

మరో సర్జికల్ స్ట్రైక్ జరగనుందా? నోట్ల రద్దు తర్వాత.. బంగారంపై పడనున్నారా? ఇంట్లో బంగారం సేఫ్ కాదా? సర్కారు బూతద్దం పెట్టి వెతకనుందా? గోల్డ్ హంట్ తో కేంద్రం ఏం తేల్చనుంది? జైట్లీ ప్రకటన మరింత గందరగోళాన్ని క్రియేట్ చేసిందా? ఈ రోజు వైడాంగిల్ స్టోరీలో చూద్దాం.. బ్యాంకు లాకర్లు తెరుస్తారా? బీరువాలు బద్దలు కొట్టి వెతుకుతారా? ఆపరేషన్ గోల్డ్ మొదలు కానుందా? ఈ మధ్య కొన్న బంగారానికేనా...

Wednesday, November 30, 2016 - 20:44

ఈ వాక్యం ఎక్కడైనా చదివినట్టు గుర్తొస్తోందా.. మీ జేబులో ఉన్న ప్రతి నోటుపైనా ఉంటుంది. కొత్త నోటుపైనే కాదు.. సర్కారు చెల్లవని చెప్పిన అయిదొందలు, వెయ్యి నోట్లపై కూడా.. మరి ఆ ప్రామిస్ ఏమయింది. ఒట్టు తీసి గట్టున పెట్టారా? ప్రజలకు భరోసానిచ్చే ఆర్బీఐ ప్రామిస్ ఎలా గాల్లో కలిసింది? బ్యాంకులంటే ప్రజలకు మధ్య ఉండాల్సిన నమ్మకం ఎందుకు పోతోంది? దీనికి కారణం బ్యాంకులా? ఆర్బీఐనా? లేక...

Tuesday, November 29, 2016 - 20:37

ఇంక అంతా తెలుపేనా? నల్లధనం అనేది దేశంలో ఉండదా? నోట్ల రద్దుతో అంతా మారిపోతుందా? అస్సలు నల్లధనం అంతా రూ.1000, రూ.500లుగానే ఉందా? ఇదే నిజమయితే సంతోషమే. కానీ వాస్తవం వేరుగా కనిపిస్తోంది. నల్లదనం నోట్లుగా లేదని, నల్లధనం ఎప్పుడూ చేతులు మార్చుకుని, స్థానం మార్చుకుని పరిపరి విధాలుగా స్థిరపడుతోందని అంచనాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ మనీ వెలికి తీయడానికి నోట్ల రద్దే...

Monday, November 28, 2016 - 20:42

జేబులో కరెన్సీ అవసరం లేదు.. బీరువాలో కట్టలు దాచుకోవలసిన పనిలేదు.. చిన్న ప్లాస్టిక్ కార్డుంటే చాలు పనైపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ట్రాన్సాక్షన్ క్లియరౌతుంది. జేబులో బరువైన వాలెట్ కాస్తా... మోబైల్ వాలెట్ గా మారుతోంది. ఇంతకీ చెప్పేదేంటంటే.. కరెన్సీ నోట్లు మాయమై... డిజిటల్ ఎకానమీ దిశగా దేశాన్ని నడిపించాలని కేంద్రం భావిస్తోంది. మరిదీనికి సాధ్యాసాధ్యాలెన్ని.. అవరోధాలేంటి?...

Friday, November 25, 2016 - 21:06

ఇండస్త్రీకి సినిమా చూపిస్తున్న నోట్ల రద్దు, బ్యాంకుల ముందు పడి గాపులు.. బోసిపోతున్న థియేటర్లు, షూటింగులు లేక విలవిల్లాడుతున్న జూ.ఆర్టిస్టులు, టాలీవుడ్ కి కరెన్సీ షాక్, సినిమా కష్టాలు.. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Thursday, November 24, 2016 - 21:01

నోట్ల సమస్యను పశ్నిస్తే తప్పా...? కరెన్సీ కష్టాలు లేవనెత్తితే దేశ ద్రోహమా..? సరిహద్దులో సైనికుడితో పోలికలెందుకు..?  ప్రశ్నిస్తే నేరమా..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, November 23, 2016 - 20:55

జీడీపీ భారీగా తగ్గనుందా..? ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం ఉండబోతోందా..? చిన్నబతుకులపై పెద్ద దెబ్బ పడనుందా..? రద్దుతో చిత్తయిందెవరు..? రద్దు రిజల్ట్స్..!! ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Tuesday, November 22, 2016 - 21:36

రోజు కూలీ వదులుకుని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నదెవరు..? అనారోగ్యాన్ని లెక్క చేయకుండా క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నదెవరు..? డబ్బులు రాల్చని ఏటీఏంల ముందు ఆశగా మూగిందెవరు..? నల్లధనం దాచుకున్న వాళ్లలో ఒక్కడైనా ఈ గుంపులో ఉన్నాడా..? అచ్ఛేదిన్ ఎవరికి ? ఈ అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, November 21, 2016 - 20:59

పట్టాలు విరుగుతాయి..!! రైళ్లు ఢీకొంటాయి..!! సిగ్నల్స్ తప్పుగా వస్తాయి.. నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని బలితీసుకుంటుంది...!! రైలు ప్రయాణంలో భద్రత లేదా..?! పట్టాలెందుకు తప్పంది..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, November 18, 2016 - 20:45

నిన్నటిదాకా మూడు పువ్వులు ఆరు కాయలు..మధ్య వర్తులు, బిల్డర్లు, పెట్టుబడిదారులు..సర్కారీ ఖజానా కళకళ.. ఇప్పుడు ఒక్కసారిగా బూం ఢాం అంది. పెద్ద నోట్ల రద్దుతో సీన్ రివర్సయింది. ఎప్పుడు నార్మల్ అవుతుందో ఊహించని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జరిగిన ఒప్పందాలు సైతం రద్దవుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఎంత కాలం? పెద్ద నోట్ల రద్దు రియల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపింది.. ఇదే అంశంపై ఈ...

Thursday, November 17, 2016 - 20:48

ఎవర్నీ వదలటం లేదు..అందరిపైనా ఉరుము లేని పిడుగుపాటులా పడింది. ఒక్కసారిగా నేలకూల్చింది. బతుకుల్ని అయోమయంగామార్చింది. ముఖ్యంగా దేశానికి వెన్నెముక లాంటి రైతన్న కష్టాలు మాటలకు అందని తీరులో మారాయి. చేతిలో సొమ్ములేదు.. అప్పులు పుట్టవు. బ్యాంకుల రుణం అందదు.. రబీ సీజన్ మొదలయింది. ప్రకృతి విపత్తులకు అలవాటయిన రైతన్న సర్కారు కొట్టిన నోటు దెబ్బకు విలవిల్లాడుతున్నాడు. ఇదే అంశంపై ఈ రోజు...

Wednesday, November 16, 2016 - 20:39

అంచనాలు తప్పాయి.. అల్లకల్లోలం జరుగుతోంది. నల్లధనం కోసం అంటూ తీసుకున్న స్టెప్ ఇప్పుడు సామాన్యుడి మెడకు చుట్టుకుంటోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని వైఫల్యం ఇప్పుడు ప్రతికూలతను పెంచుతోందా? భారత ఆర్ధిక వ్యవస్థపై సరైన అంచనాలు లేకపోటమే ఈ సమస్యకు దారి తీసిందా? మరికొంత కాలం పెద్ద నోట్లు చెల్లుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందా? ఎంత కాలం ఈ నోట్ల గోల? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ...

Tuesday, November 15, 2016 - 20:42

ఏటీఎంల దగ్గర నిలబడి నిలబడి కాళ్లు పీకుతున్నాయి.. బ్యాంకు ఎదురుగా క్యూలో ఉండీ ఉండీ నీరసం వస్తోంది. ఉన్న నాలుగు పెద్ద నోట్లు చెల్లవు. మారవు. వంద నోట్లు అందవు. పాలు, కూరగాయలనుంచి ఏది కొందామన్నా వీల్లేని పరిస్థితి. ఏమిటీ సంక్షోభం? ఏ లక్ష్యం కోసం సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది? ఎవర్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. కరెన్సీ కష్టాలతో దేశమంతా విలవిల్లాడుతుంటే.. ఇంకో యాభై రోజులే అంటున్న...

Monday, November 14, 2016 - 20:58

పిల్లలకు కూడా హక్కులుంటాయా? వాళ్లకేం తెలుసు..? పెద్దవాళ్లు ఏది చెప్తే అది చేయాల్సిందే.. ఇంకా వినకపోతే వీపు పగలగొట్టాల్సిందే.. ఈ మాటలు మన సమాజంలో కొత్తవేం కాదు. కానీ, వాళ్లకూ హక్కులుంటాయి. సీతాకోక చిలుక రెక్కలపై ఎగిరే రంగురంగుల బాల్యాన్ని చిదిమేసే హక్కు... ఆఖరికి తల్లిదండ్రులకు కూడా లేదని.. గుర్తించాల్సిన సమయం వస్తోంది. ఈ క్రమంలో విద్య, వైద్యం. అక్రమ రవాణా, పేదరికం.. ఇలా...

Thursday, November 10, 2016 - 21:13

సమరానికి సై అన్నాడు..!! అధికారమే లక్ష్యంగా సాగనున్నాడా..? పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు..? అనంత సభ సంకేతాలేంటీ..? అసెంబ్లీకి 'గబ్బర్ సింగ్'... ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Wednesday, November 9, 2016 - 20:57

నోట్ల రద్దే అన్ని సమస్యలకు పరిష్కారమా ? విదేశాల్లో పోగుబడిన నల్లధనం మాటేమిటీ ? అక్రమ స్థిరాస్తుల సంగతేంటి ? సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతోంది ? నోట్లు... పాట్లు.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాను వీడియోలో చూద్దాం...

 

Monday, November 7, 2016 - 22:44

మరో ప్రపంచం కోసం తొలి అడుగులు, కోటి కాంతులతో సరికొత్త ఉషోదయపు వెలుగులు, అరుణారుణ పతాక రెపరెపలు, అక్టోబర్ విప్లవానికి జేజేలు..!! ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలోచూద్దాం..

Tuesday, November 1, 2016 - 20:06

తెలిసి చేశారో.. తెలియక చేశారో.. అసలు చేయలేదో ..మొత్తానికి ఊచలు లెక్కపెడుతున్నారు. కానీ, ఏ విషయం తేల్చాలి కదా.. అయితే బయటికి లేదంటే లోపలికి పంపాలి కదా.. కానీ, అండర్ ట్రయల్ గానే ఉంచేస్తున్నారు. అసలు కంటే కొసరుతోనే శిక్షిస్తున్నారు. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు. వీరిలో నిరుపేద దళితులు, ఎస్టీలు, ముస్లింలు ఉన్నారని సర్కారీ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. దేశంలో...

Monday, October 31, 2016 - 20:48

ఉక్కు మా హక్కని ఉద్యమించారు.. ప్రాణ త్యాగాలు చేసి మరీ సాధించుకున్నారు. జాతిమెడలో మణిహారంలా వర్ధిల్లుతూ వేలాదిమందికి బతుకునిచ్చింది. కానీ, ఇప్పుడా హక్కుకు ప్రమాదం ఏర్పడిందా? సర్కారీ విధానాలు నష్టాలకు కారణం అవుతున్నాయా? అలనాటి ఉద్యమానికి ఇప్పుడు కొనసాగింపు అవసరం అవుతోందా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని చేసిన ఉద్యమానికి 50ఏళ్లయిన సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం..

...

Friday, October 28, 2016 - 21:29

దీపావళి అంటే మతాబుల వెలుగలు.... వెన్నెల ముద్దల వెలుగు రేఖలు, కాకరపువ్వొత్తుల కలకలం, చిచ్చుబుడ్డిలా ఉవ్వెత్తున్న ఎగసే సంతోషం... వెలుగు నింపాల్సిన చోట అంతులేని కాలుష్యం... వెలుగురేఖల వేడుకలో ఎన్నో అపశృతులు, పర్యావరణాన్ని కాలుస్తున్నారా..??.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Thursday, October 27, 2016 - 21:26

నినాదాలు ఘనం... ఆచరణ శూన్యం, మాటలకే పరిమితం... వాస్తవంలో వివక్షే నిజం.. ఒకే పనికి తక్కువ వేతనం...మహిలపై అంతులేని భారం, అర్థిక సమానత్వం... అంతులేని దూరం.. సమానత్వం ఎన్నాళ్లకు...? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.....

 

Wednesday, October 26, 2016 - 21:26

పచ్చటి అడవిలో రక్తం చిందింది. సర్కారు తుపాకీ గర్జించింది. ఉషోదయంపై ఎర్రటి చారిక మిగిల్చింది. ఎన్ కౌంటర్లే పరిష్కారమా..?? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

Monday, October 24, 2016 - 21:44

బజారుకెక్కిన ములాయం ఇంటిపోరు... పూటకో మలుపు తిరుగుతున్న యూపీ రాజకీయాలు.. అఖిలేష్ సొంత పార్టీ పెట్టబోతున్నాడా..  ఎస్పీలో లుకలుకలు విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయా...? తమ్ముడా...? తనయుడా..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేకంగా కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss