వైడ్ యాంగిల్

Thursday, October 20, 2016 - 21:10

భూములు కొల్లగొట్టడమే లక్ష్యం.. ఎకరాల్లెక్కన కబళించటమే టార్గెట్. సామాన్యుల బతుకులను చిదిమి బడాబాబుల బొక్కసాలు నింపటమే తమ ధ్యేయమంటోంది. ఓ పద్ధతి లేదు.. ఓ పరిహారం లేదు. అధికారం ఉంది కదా అని.. పోలీసులు చేతిలో ఉన్నారు కదా అని.. బల ప్రయోగంతో.. ప్రజలను చెదరగొట్టి, బెదరగొట్టి భూములనుండి వెళ్లగొట్టి.. గ్రామాలను ఖాళీచేసే కుట్రలు అడుగడుగునా సాగుతున్నాయి. ఏపీలో అనేక జిల్లాల్లో ఇదే తంతు...

Wednesday, October 19, 2016 - 20:47

ఆరు దశాబ్దాలు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో ఆరు దశాబ్దాలైనా వస్తుందనే నమ్మకం కనిపించటం లేదు.. అన్ని రకాలుగా అణచివేత, అంతులేని దోపిడీ, అంతం లేని వివక్ష... వెరసి దారుణమైన వెనుకబాటు. ఇలాంటపుడు దేశంలో దళితుల స్థితిగతులు ఎప్పుడు మారతాయి? సర్వేలు నిర్ఘాంతపరుస్తున్నాయి. సమస్యను చర్చించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. ఆ...

Monday, October 3, 2016 - 20:40

జయలలితకు ఏమయింది? ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు?పార్టీ వర్గాల్లో, సగటు కార్యకర్తల్లో ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు..?జయ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? శశికళ అత్యవసర సమావేశం దేన్ని సూచిస్తోంది? తమిళనాట రాజకీయాలు ఏ మలుపుతిరగనున్నాయి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..ఒంటిచేత్తో రాష్ట్ర రాజకీయాలను చక్రంతిప్పే మహిళ ఆస్పత్రి పాలవటంతో తమిళనాడు అంతటా అయోమయం..గందరగోళం.....

Friday, September 30, 2016 - 20:59

ఎవరి బలం ఎంత ? అణ్వాయుధాలు ప్రయోగిస్తారా ? ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏమౌతాయి? ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? యుద్ధం వస్తే..?? ఈ అంశంపై ఇవాళ్టి వైడాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

Wednesday, September 28, 2016 - 21:21

ఎందుకు మూసేస్తున్నారు ? పెట్టుబడులెందుకు ఉపసంహరించుకుంటున్నారు..? ప్రైవేటుపరం ఎందుకు చేస్తున్నారు..? సర్కారు చెబుతున్నవాదనలేంటీ ? గ్లోబలి పీఠంపై ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎస్ యూల మెడకు ఉరి..!! ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....
 

 

Friday, September 23, 2016 - 20:39

మీకు రెగ్యులర్ గా సినిమాలు చూసే అలవాటుందా? తెలుగు, హిందీ లేదా ప్రపంచ భాషల సినిమాలు..ఏవైనా సరే. ఇవి మీపై ప్రభావాన్ని చూపుతాయనేది కొత్త విషయం కాదు. ఏ కళా రూపమైనా సమాజంపై ప్రభావం చూపుతున్నప్పుడు, అక్కడ బాధ్యత అనే ఎలిమెంట్ కూడా ఉండాలా వద్దా..? ఇదే ఇక్కడ ప్రశ్న. భారతీయ సినిమా కేవలం సొమ్ము చేసుకోవటంతోనే ఆగుతోందా? లేక రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తోందా? అభిమానంతో నెత్తిన...

Thursday, September 22, 2016 - 20:48

చివరికి హైకోర్ట్ సూచనలు కూడా వచ్చాయి. ఇప్పుడైనా ఈ అంశంలో కదలిక వస్తుందా? నిజానికి గోడదూకే నేతల్ని ప్రోత్సహించటంలో అన్ని ప్రధాన పార్టీలది ఒకే నీతి.. కానీ, దీనిపై నిర్ణయం తీసుకోవలసిన స్పీకర్ నిర్ణయంలో జాప్యం, టీటీడీ ఎమ్మెల్యేల విలీనం మొదలైన అంశాలపై హైకోర్ట్ సూచనలు కొత్త పరిణామాలకు దారితీస్తున్నాయి. స్పీకర్ అధికారాలను కోర్టులు ప్రశ్నించవచ్చా అనే వాదనను లేవనెత్తుతున్నాయి....

Wednesday, September 21, 2016 - 21:59

వర్షం వణికించింది. ఒక్క రాత్రి వచ్చిన వాన విశ్వనగరం డొల్లతనాన్ని స్పష్టంగా చూపింది. రోడ్లన్నీ సంద్రమై, లోతట్టు ప్రాంతాలు జలమయమై.. జనజీవనం అస్తవ్యవస్తమై.. చివరికి అనేక ప్రశ్నలు రేకెత్తించింది. 2000 సంవత్సరంలో 15 సెంటీమీటర్ల వర్షానికి నగరం విలవిల్లాడింది. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో వస్తే.. నగరానికి భరించే సత్తా ఉందా? ఊహించటానికే భయపడాల్సిన పరిస్థితి. భాగ్యనగరం భాగ్య సాగరం...

Tuesday, September 20, 2016 - 21:21

నదీ వివాదాలు మనదగ్గర కొత్త విషయమేం కాదు. నది పుట్టిన చోటి నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక రాష్ట్రాలకు ఆధారం, అనుబంధం. ఇక ఆనకట్టలు కట్టి బతుకుల్ని పునర్వచించుకునే చోట సమస్య మరింత జటిలంగా మారుతోంది... ఇదే అనేక వివాదాలకు కారణమవుతోంది.. అందర్నీ తృప్తిపరిచే పరిష్కారం సాధ్యం కాకపోవచ్చు. కానీ, నదీజలాలపై చట్టాలేం చెప్తున్నాయో వాటిని పకడ్బందీగా అమలు చేయటమే ఇక్కడ పరిష్కారం.. మరి ఈ...

Friday, September 16, 2016 - 20:09

అది మట్టి మనుషుల పోరాటం..దొరతనాన్ని సమాధిచేసిన సాయుధ సమరం..భూమి కోసం భుక్తికోసం, దాస్య శృంఖలాలను తుత్తునియలు చేయటానికి సామాన్యుడు గర్జించిన అపూర్వ సన్నివేశం. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి జనం నడిపించిన విప్లవం అది. బాంచన్ దొరా కాల్మొక్తా అన్న గొంతుకలే గొడ్డలిపట్టి భూస్వామ్య దొరతననపు పునాదులను కదిలించిన వైనం అది. ప్రపంచ చరిత్రలో అది చెరగని అధ్యాయం. అదే...

Monday, September 12, 2016 - 20:39

పెల్లెట్లు దూసుకొస్తున్నాయి. గాయాలవుతున్నాయి. రక్తమోడుతోంది. ప్రాణాలు పోతున్నాయి.. ప్రమాదంలో ఉంది శాంతి భద్రతలు మాత్రమే కాదు.. మేం ఈ గడ్డకు చెందిన వారమే.. మాదీ ఈ దేశమే అనే నమ్మకం. ఫలితం.. ప్రజల్లో ఓ అభద్రత.. అసంతృప్తి.. వెరసి కశ్మీరం అట్టుడుకుతోంది. తుపాకీతో, సాయుధ బలగాలతో పరిస్థితిని అదుపు చేయగలమని నమ్మినంతకాలం కశ్మీరంలో మార్పు సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఈ...

Friday, September 9, 2016 - 20:48

గొంతు చించుకున్నాడు..చరిత్ర పాఠాలు తవ్వాడు..న్యాయం కావలసిందే అన్నాడు..ఇవన్నీ గతంలో కూడా చెప్పాడు..మరి కొత్తగా ఏం తేల్చాడు..?? కొంత ఆవేశం, ఇంకొంత బిజెపీ పట్ల వ్యతిరేకత పవన్ కల్యాణ్ లో కనిపిస్తున్నాయా? పవన్ తన పయనంలో యూ టర్న్ తీసుకోబోతున్నాడా? కాకినాడ సభ సంకేతాలేంటి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. తాను ఇంత కాలం మద్దతిచ్చిన బీజెపీపై చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం...

Thursday, September 8, 2016 - 20:47

ప్రెస్ మీట్ అంటూ హడావుడి చేశారు.. స్టేట్ మెంట్ అంటూ ఒకటే రచ్చరచ్చ చేశారు..చివరికి తుస్సుమనిపించారు. ఏ పీ ప్రజలకు సింపుల్ గా హ్యాండిచ్చారు. హామీలు, వాగ్దానాలు మాటలకు మాత్రమే పరిమితం అని, చేతల్లో కనిపించేది శూన్యం అని తేల్చేశారు. మరో పక్క ఈ అంశంపై నిలదీసే ధోరణి వదలి సామరస్యంగా ఉందామంటున్న చంద్రబాబు తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఏపీ ఈ అరకొర సాయంతో...

Wednesday, September 7, 2016 - 20:55

వర్షాలు ముఖం చాటేశాయి. భూగర్భ జలాలు పాతాళన్నంటాయి. బోర్లు బావురుమంటున్నాయి. రిజర్వాయర్లు రిక్త హస్తం చూపుతున్నాయి. కరువు కబళిస్తోంది. రైతన్న మెడపై కరువు కత్తి.. ఇదే అంశంపై ఈరోజు ప్రత్యేక వైడాంగిల్ కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Tuesday, September 6, 2016 - 20:48

ఇది చాలా పాత మాట.ఇప్పటికీ ఇదే నిజమని రుజువవుతున్నమాట. భారత్ చాలా సంపన్నదేశం. అవును.. ప్రపంచంలోనే టాప్ టెన్ దేశాల్లో ఉంది. ఇక్కడి ప్రజలు కూడా ధనవంతులే. ఇక్కడ మెలిక ఉంది. అందరూ కాదు. చాలా కొద్దిమంది చాలా ధనవంతులు. సింపుల్ గా చెప్పాలంటే 54శాతం సంపదను అతి కొద్దిమంది పంచుకుంటున్నారు. కోట్లాదిమంది ఆకల కేకల మధ్య, బతుకుబరువుగా ఈడుస్తున్నారు. అంతరాలు ఆకాశాన్నంటుతున్న దేశంలో...

Thursday, September 1, 2016 - 21:38

సమ్మె సైరన్ మోగింది... జంగ్ పిలుపు రమ్మంటోంది... కార్మిక లోకమంతా ఏకమై పిడికిళ్ల పూలు పూయిస్తోంది. సార్వత్రిక సమ్మెకు సై..!! ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలనువీడియోలో చూద్దాం....

Wednesday, August 31, 2016 - 20:58

చినుకుపడితే భాగ్యసాగరమే..!! సంద్రాన్ని తలపించే రోడ్డు, నోళ్లు తెరుచుకున్న మ్యాన్ హోళ్లు, చిగురుటాకులా వణుకుతున్న నగరం, భూలోకంలో నరకం, ఈ దుస్థితికి కారణమెవరు ? ఈ కష్టాలకు బాధ్యులెవరు ? ఇదే అంశంపై ఇవాళ వైడాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, August 29, 2016 - 20:53

డైలాగులు అదిరాయి.. పంచ్ లు పేలాయి.. అభిమానుల చప్పట్లు మిన్నంటాయి.. కానీ, అదే సమయంలో ప్రశ్నలు వర్షిస్తున్నాయి..సడన్ ఎంట్రీ.. సడన్ మీటింగ్ పై అనేక రకాలుగా చర్చలు మొదలయ్యాయి. పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా తిరుపతి మీటింగ్ పై విశ్లేషణాత్మక కథనమే.. ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..ప్రశ్నిస్తానన్నాడు.. ప్రజల తరుపున ఉంటానన్నాడు. కానీ ప్రశ్నలకే పరిమితమయ్యాడు.. ప్రజల్లోకి మాత్రం...

Friday, August 26, 2016 - 20:46

మర్డర్లు, కబ్జాలు, అక్రమ వసూళ్లు, సెటిల్ మెంట్లు మాత్రమేనా? ఎప్పుడూ అవే అయితే బోర్ కొట్టదూ. జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్టు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులేస్తున్నారు. సినిమాలకు పెట్టుబడులు పెడుతున్నారు. నిర్మాతల వెనుక నిలబడుతున్నారు.తారల తలరాతలు రాస్తున్నారు. మొత్తంగా ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనీ.. మాఫియా.. మూవీస్ వీటి మధ్య సంబంధంపై ఈ రోజు వైడాంగిల్...

Thursday, August 25, 2016 - 20:37

స్టార్లు చల్లగా ఉంటారు.. వీళ్లు మాత్రం రచ్చకెక్కుతారు..స్టార్లు సఖ్యంగానే ఉంటారు.. వీళ్లు మాత్రం కుమ్ములాటలకు దిగుతారు. పిచ్చి ఇంకా ముదిరితే పొడుచుకు చంపుకుంటారు. ఇది అభిమానమా లేక దురభిమానమా? ఒకర్నొకరు హేళన చేసుకుంటూ, హీనపరుచుకుంటూ తమ హీరోలపై వెర్రితనాన్ని పెంచుకుంటున్న ఈ సంస్కృతికి ఎలా అడ్డుకట్ట వేయాలి? దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? హీరోలా? అభిమాన సంఘాల నేతలా? ఇండస్ట్రీ...

Wednesday, August 24, 2016 - 20:39

సింధుకి కోట్ల నజరానాలు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు.. అనేకం ప్రకటించేశాయి.. రెండు రాష్ట్రాలు.. ఓ విజేతను గౌరవించుకున్నాం.. సంతోషం. నో కంప్లెయింట్స్. కానీ, ఇదే ఉత్సాహం అలాంటి విజేతలను తయారు చేయటంలో ఎందుకు పెట్టడం లేదు.. కనీస ప్రోత్సాహం కోసం ఆశగా చూస్తున్న ఎందరో క్రీడాకారులను, ఇతర ఆటలను ఎందుకు పట్టించుకోవటం లేదు. ఒకరు పతకం తేగానే సన్మానించి, చెక్కులిచ్చేస్తే క్రీడారంగాన్ని...

Wednesday, August 17, 2016 - 20:59

నయీం అంతమైతే సమస్య పరిష్కారమయినట్టేనా...? నయీంతో సంబంధాలున్న పెద్దలెవరు..? నయీంని ఉపయోగించుకున్న ఖాకీలెవరు..? సిట్ విచాణలో గుట్టు వీడుతుందా..?? సిట్ సత్తా ఎంత.. ఈ అంశాలపై వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలను వీడియలో చూద్దాం...

Tuesday, August 16, 2016 - 21:41

ప్రమాణాలు పాటించిన యాజమాన్యాలు, ఫీజుల దందా సాగిస్తున్న టాప్ కాలేజీలు, విచ్చల విడిగా సీట్లు అమ్మకాలు, ఇంజనీరింగ్ పూర్తి చేసినా దొరకని ఉద్యోగాలు, మిథ్యగా మారిని ఇంజనీరింగ్ విద్య... ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

Monday, August 15, 2016 - 20:50

దేశమంతా మువ్వెన్నెల జెండా రెపరెలాడింది. 70 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ 70 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ఏమిటి? చేరుకోవాల్సిన లక్ష్యాలేమిటి? అధిగమించాల్సిన సవాళ్లేమిటి? ఈ అంశంపై ప్రత్యేక కథనం..స్వాతంత్ర్య దేశ పతాకం సమోన్నతంగా రెపరెపలాడుతోంది. బ్రిటీషోళ్ల పాలన నుంచి స్వేచ్ఛ గాలులు పీల్చుకున్న స్వాతంత్ర్య భారతావనికి 70 వసంతాలొచ్చాయి. ఇది మనమంతా...

Friday, August 12, 2016 - 20:42

మనదేశానికి ఒక్క ఒలింపిక్ పతకం వచ్చిందంటే ఏళ్ల తరబడి కథలుకథలుగా చెప్పుకుంటాం. నూట ముప్పై కోట్ల జనాభాకు, వచ్చే పతకాలకు పొంతనే ఉండని పరిస్థితి. కానీ, ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో మెడల్స్ అలవోకగా ఎగరేసుకుపోతూ ఈతకొలనులో సెయిల్ ఫిష్ గా నిలబడ్డాడు మైఖేల్ ఫెల్ప్స్. ఒలింపిక్స్ లో తనకు ఎదురు లేదని, స్విమ్మింగ్ లో తనను టచ్ చేసేవాళ్లే లేరని రుజువు చేస్తూ ఆకాశమంత ఎత్తున...

Thursday, August 11, 2016 - 20:56

పాతికేళ్లుగా విస్తరించిన నేరసామ్రాజ్యం అది. ఏ అండదండలతో ఎదిగాడు? ఎవరి దన్నుతో చెలరేగాడు? ఇన్ని సంవత్సరాలు నేరాలు నిరాఘాటంగా చేస్తూ గ్యాంగ్ స్టర్ గా ఎలా నిలిచాడు.. అసలీ తూటా ఏ తుపాకీది? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. అతడి పేరు చెబితే ప్రత్యర్ధులకు వణుకు.. కోవర్టు నుంచి కోటీశ్వరుడయ్యాడు.. పోలీసులకు ఆయుధంగా మారి.. చివరికి వాళ్ల చేతుల్లోనే హతమయ్యాడు.. వర్మ సినిమాకు ఏ మాత్రం...

Tuesday, August 9, 2016 - 21:01

అడవిబిడ్డలు.. ఈ దేశ మూలవాసులు.. వేల ఏళ్లుగా తమ సంస్కృతి కాపాడుకుంటూ వస్తున్న వాళ్లు.. కానీ అభివృద్ధి మంత్రాల నడుమ, గ్లోబల్ రాకాసి కబంధ హస్తాల మధ్య నలిగిపోతున్నారు..పైన ఆకాశం విరుచుకు పడుతోంది.. కింద నేల కదిలిపోతోంది.. బతుకులు చెదిరిపోతున్నాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే వారి అస్థిత్వమే ప్రమాదంలో పడుతోంది. ఆదివాసీల బతుకు చిత్రాన్ని కాలరాస్తున్న శక్తులేంటి? దానికి పరిష్కారమేంటి.....

Pages

Don't Miss