అత్తే అమ్మ అయ్యింది : వితంతు కోడలికి మరో పెళ్లి చేసింది

Submitted on 26 May 2019
widow daughter in law Aunt Gyaneswari who is married to another

అనాది నుండి అత్తా కోడళ్లంటే శతృవులనే భావన సమాజంలో నాటుకుపోయింది.  అత్త లేని కోడలు ఉత్తమురాలనీ..కోడలు లేని అత్త గుణవంతురాలనీ ఇలా ఎన్నో సామెతలు. అత్తా కోడళ్లు స్నేహితులుగా కలిసి మెలిసి ఉండే సందర్భాలు పెద్దగా బైటికి రావు.  ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆమె’ సినిమాలో వింతువురాలైన కోడలికి మరో పెళ్లి చేయాలని అత్తగారు పడిన తపన చూశాం. ఇటువంటి ఓ మంచి సంఘటన జరిగింది ఛత్తీస్ గఢ్ లోని బాలోద్కు చెందిన హీరాపూర్ లో. వితంతురాలైన తన కోడలికి మరో వివాహం చేయటానికి తానే అమ్మగా అయ్యింది. 
 

హీరా పూర్ లో నివసించే జ్ఞానేశ్వరి కుమారుడు డోమేంద్రకు సాహుకు  రెండేళ్ల క్రితం పెళ్లి చేసింది. కొంతకాలానికే డోమేంద్ర సాహి అసస్వాత్తుగా చనిపోయాడు. అప్పటికే కోడలు గర్భవతి అయ్యింది. ఈ క్రమంలో డోమేంద్ర అకస్మాత్తుగా చనిపోయాడు. తరువాత ఆమెకు అబార్షన్ అయ్యింది. అలా రెండేళ్లుగా కోడలు తన కళ్లముందే నిరాశగా కనిపిస్తుంటే జ్ఞానేశ్వరి తట్టుకోలేపోయింది. ఆమెకు మరో వివాహం చేయాలని నిశ్చయించుకుంది. కోడలికి కొత్త జీవితాన్ని అందించాలని ఆశపడింది జ్ఞానేశ్వరి.

ఎన్నో సంబంధాలు చూసింది. చివరికి ఎట్టకేలకు కోడలికి వివాహం చేసింది. ఈ సందర్భంగా అత్త జ్ఞానేశ్వరి మాట్లాడుతూ తాను తన కోడలిని కూతురుగానే భావించానని..కుమారుడు చనిపోయినప్పటికీ ఎటువంటి లోటు లేకుండా ఆమెను చూసుకున్నానని తెలిపింది. అంతేకాదు తన భర్త 15 ఏళ్ల క్రితం చనిపోయాడనీ..అప్పటి నుంచి తాను ఎన్నో కష్టాలు పడ్డాననీ  కానీ తనలా తన కోడలు కష్టాలు పడకూడదని మరో పెళ్లి చేసానని తెలిపింది. జ్ఞానేశ్వరి పెద్ద మనస్సుతో చేసిన ఈ అరుదైన వివాహానికి బంధువులంతా హాజరయ్యారు. జ్ఞానేశ్వరిని అభినందించారు. 
 

Widow
daughter in law
Aunt
Gyaneswari
Married
Hirapur
Chhattisgarh

మరిన్ని వార్తలు