ఫేస్‌బుక్‌‌లో పరిచయమై పెళ్లి చేసుకున్నారు: టిక్ టాక్ కారణంగా విడిపోయారు

Submitted on 12 July 2019
Wife Divorce Notice To Husband While Refuse Tik Tok In Tamil Nadu

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరికి టిక్ టాక్ పిచ్చే. దీనితోనే రోజంతా గడిపేస్తున్నారు. ఈ పిచ్చిలో పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోపోవడం లేదు కొంతమంది. చిన్న పెద్దా అని లేకుండా అందరూ ఇదేపని చేస్తున్నారు. ఈ టిక్ టాక్ చేయద్దని ఎవరైనా చెప్పారంటే...ఆరోజు పెద్ద గొడవ జరగాల్సిందే. గొడవలే కాదు.. కొన్నిసార్లు భార్య, భర్తలను కూడా విడదీస్తుంది. 

వివరాల్లోకి  వెళ్తే.. ఈ టిక్‌టాక్ ఓ నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త కంటే టిక్‌ టాక్‌ ముఖ్యమని భావించిన ఓ ఇళ్లాలు ఏకంగా విడాకుల నోటీసులు పంపిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుచ్చిరాపల్లికి చెందిన మహేష్‌ (37) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, తిరునెల్వేలికి చెందిన దివ్య (32)ల ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారడంతో 2008లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో మగబిడ్డ పుట్టాడు. 

అయితే దివ్యకి టిక్‌ టాక్ అంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చి తన భర్తకు నచ్చకపోవడంతో దంపతుల మధ్య గొడవలు కావడంతో. దివ్యా 2017లో ఆమె కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారుడిని పాఠశాలలో చేర్చి తానూ ఉద్యోగంలో చేరింది. భర్తకు విడాకుల నోటీసు పంపింది. దివ్యతో కలిసి జీవించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తిరుచ్చిరాపల్లి న్యాయస్థానంలో భర్త మహేష్‌ పిటిషన్‌ వేశాడు. 

ఇదిలా ఉండగా...కుమారుడి ఒంటి నిండా గాయాలున్నాయని స్కూల్ హెడ్ మాస్టర్ మహేష్‌తో చెప్పాడు.ఈ వ్యవహారంపై స్కూల్ హెడ్‌మాస్టర్ బాలల సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేయగా దానిపై విచారణ చేపట్టారు. బాలుడి తల్లి దివ్యకు అన్సారీ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. అంతేకాదు, దివ్యతో విడిపోయిన తర్వాత మహేష్ మరో పెళ్లి చేసుకున్నాడని గుర్తించారు. మహేష్ ఎవరో కూడా ఆ బాబుకు తెలియదన్నారు. అయితే ప్రస్తుతం కుమారుడు అనారోగ్యంతో ఉండటంతో తల్లికే అప్పగిస్తున్నట్టు చెప్పారు.

Wife Divorce Notice
husband
Refuse Tik Tok
Tamil Nadu

మరిన్ని వార్తలు