మేం కోరిన సీట్లు మీకే కేటాయించుకుంటారా ?: సీపీఐ

13:23 - November 8, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల పంచాయితీ ఎంతకూ తెమలటంలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జాబితాతో ఢిల్లీ వెళ్లిన నేతలు పలు దఫాలుగా కాంగ్రెస్ అధిష్టానంతో భేటీలు కొనసాగుతన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా లీక్ అవ్వటం..మహాకూటమిలో భాగంగా వున్న సీపీఐ ఆశించిన స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులకు ఖరారు చేయటంతో సీపీఐ మండి పడుతోంది. సీపీఐ ఆశించిన వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్త గూడెం స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులకు దాదాపు ఖరారు చేసినట్లుగా లీకులు బైటకురావటం అది కామ్రెడ్లకు తెలియటంతో వారు మండిపడుతున్నారు. ఈ లీక్స్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా పూర్తిస్థాయిలో అభ్యర్థులకు ఖరారు చేయలేదనీ..దీనిపై వస్తున్న వార్తలను నమ్మవద్దంటు సీపీఐ కు కాంగ్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లుగా సమాచారం. మరి సీపీఐ ఏం నిర్ణయించుకోనుంది. మహాకూటమిలో కొనసాగుతుందా? లేదా స్వంతగా పోటీ చేస్తుందా? కాంగ్రెస్ నచ్చచెప్పటం..సీపీఐ ఆశించిన సీట్లను కాంగ్రెస్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
 

Don't Miss