భారత్‌ను గెలిచామంటే వరల్డ్ కప్ చాలా చిన్నదే

Submitted on 26 May 2019
Win over India means little for World Cup

వరల్డ్ కప్ టోర్నీకి ముందు న్యూజిలాండ్ శుభారంభాన్ని నమోదు చేసింది. వార్మప్ మ్యాచ్‌లో భాగంగా శనివారం టీమిండియాతో ఆడిన మ్యాచ్‌లో 6వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. టోర్నీ ఫేవరేట్ జట్లలో ఒకటైన భారత్‌ను ఓడించడంతో వరల్డ్ కప్‌పై ఆశలు మరింత పెరిగాయని కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

భారత ఇన్నింగ్స్‌లో జడేజా 54పరుగులు చేసి హైస్కోరర్‌గా నిలిస్తే, రాస్ టేలర్ 71పరుగులతో కివీస్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఫలితంగా టార్గెట్‌ను 38ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకోగలిగారు. 'ఇది వార్మప్ మ్యాచ్. నీకేం కావాలో దానిని రాబట్టుకోవాలి. చాలామంది బ్యాట్స్‌మెన్‌కి సమయాన్ని మేనేజ్ చేయడం చాలా కీలకం. అదే ఇంగ్లాండ్‌ను ఫేవరేట్‌గా ఉంచింది. పిచ్ పరిస్థితులు తెలుసు కాబట్టి వారు అనుకూలంగా ఆడగలరు'

'ఫైనల్స్, సెమీ ఫైనల్స్ కంటే ముందుగానే మేం అనుకున్న క్రికెట్ ఆడి చూపిస్తాం. టోర్నీని చక్కగా ఆరంభిస్తే.. సెమీ ఫైనల్ వరకూ చేరుకోగలమనే నమ్మకంతో ఉన్నాం. అక్కడ వరకూ వెళితే టోర్నీ గెలవడానికి ఇంకా 2మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉంటాయి' అని తమ విజయం గురించి చెప్పుకొచ్చాడు.

india
2019 icc world cup
world cup 2019
2019 Cricket World Cup
newzealand

మరిన్ని వార్తలు