పుట్టిన శిశువు ఇండియన్? : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ మహిళ ప్రసవం

Submitted on 14 May 2019
Philippine Woman,  Hyderabad Airport, RGIA, Indian, Filipino, Apollo doctors

ఫిలిప్ఫైన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో విదేశీ మహిళ ప్రయాణిస్తోంది. ఆమె నిండు గర్భిణీ. అంతలో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే.. ఎయిర్ సిబ్బంది పైలట్ కు సమాచారం అందించారు. ఫిలిప్ఫైన్స్ ఎయిర్ లైన్స్ విమానం షెడ్యూల్ ప్రకారం.. రియాద్ నుంచి ఇండియా మీదుగా ఫిలిప్ఫైన్స్ రాజధాని మనీలాకు వెళ్లాల్సి ఉంది. ఫిలిప్ఫైన్స్ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతుండటంతో విమానాన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్ (RGIA)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

విమానంలోనే డెలివరీ.. ఆడశిశువు జననం :
సమాచారం అందుకున్న గైనకాలిజిస్ట్ లు, శిశువైద్యులు అపోలో కార్డిల్ నుంచి హుటాహుటినా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానంలోని మహిళకు డెలివరీ చేశారు. ఇండియా భూభాగంలో ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ, తల్లీబిడ్డను బొడ్డుతాడునే మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. ‘ఫిలిప్ఫైన్స్ విమానం రియాద్ నుంచి మే 8, 2019 రోజున భారత్ మీదుగా మనీలా వెళ్తోంది. పైలట్.. మహిళకు సాయం కోసం ఆర్జీఐ ఎయిర్ పోర్టును కోరాడు. 

మహిళకు వైద్యసాయం కోసం వెంటనే విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. అనుభవం కలిగిన వైద్య నిపుణులు, నర్సులను అపోలో కార్డిల్ నుంచి ఎయిర్ పోర్టుల్లోని సెక్యూరిటీ చెక్స్ వద్దకు రప్పించాం. విమానం ల్యాండ్ కాగానే.. వైద్య బృందం నేరుగా విమానంలోకి వెళ్లారు. సీట్లో కూర్చొని ప్రసవ వేదన పడుతున్న మహిళకు డెలివరీ చేశారు. ఆడశిశువు జన్మించింది. కానీ, శిశువు బొడ్డుతాడును అలాగే ఉంచేశారు.

అందుకే బొడ్డుతాడును కట్ చేయలేదు :
సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ కారణంగా సర్జకల్ బ్లేడ్లను విమానంలోకి అనుమతించరు. అందుకే బొడ్డుతాడును కట్ చేయకుండా అలానే ఉంచారు’ అని అపోలో ఆస్పత్రి అధికారిక ప్రకటనలో తెలిపింది. డెలివరీ అనంతరం తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదటపడాక బొడ్డుతాడును కట్ చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ కోలుకుంటున్నారని, త్వరలోనే ఫిలిప్ఫైన్స్ కు తిరిగి వెళ్లనున్నారని పెడియాట్రిక్ నియోనటాలజిస్ట్ సురేశ్ కుమార్ తెలిపారు. 

ఇంతకీ పుట్టిన శిశువు.. ఇండియన్? ఫిలిప్ఫైయినా?
ఫిలిప్ఫైన్స్ మహిళ భారత్ లో ప్రసవించడంతో ఆమెకు పుట్టిన ఆడ శిశువుకు ఇండియన్ పాస్ పోర్ట్ దరఖాస్తుకు అవకాశం లేదు. దీంతో శిశువు పేరంట్స్ అక్కడి ఎంబాసీ అధికారులు ఫిలిప్ఫైన్స్ నుంచి పాప.. దేశ పౌరసత్వానికి సంబంధించి పత్రాలను రెడీ చేస్తున్నారు. ఫిలిప్ఫైన్స్ దేశానికి భారత్ నుంచి శిశువు విమానంలో తిరిగి వెళ్లాలంటే.. పాస్ పోర్ట్ తో పాటు ఇతర డ్యాక్యుమెంట్లు అవసరం. దీనిపై హైదరాబాద్ పాస్ పోర్ట్ అధికారులు మాట్లాడుతూ.. శిశువు తల్లిదండ్రులు ఇద్దరు విదేశీయులే కావడంతో.. పసికందుకు ఇండియన్ పాస్ వర్ట్ కు అర్హత లేదని చెప్పారు.

పేరంట్స్ ఇద్దరూ విదేశీయులే : ఇండియన్ పౌరసత్వం వర్తిస్తుందా?
ఇండియన్ సిటిజన్ షిప్ యాక్ట్ 1955 ప్రకారం.. ఇద్దరు పేరంట్స్ ఇండియాకు చెందినవారై ఉండాలి.. లేదా ఇద్దరిలో ఒకరైనా ఇండియన్ పౌరులై ఉండాలి. అప్పుడే వీరికి పుట్టిన బిడ్డకు ఇండియన్ పౌరసత్వం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అప్పుడు జన్మించిన ఆ శిశువు అక్రమ వలసదారుడు కాదన్నారు. ఇక్కడ పేరంట్స్ ఇద్దరు విదేశీయులే కావడం.. భారత భూభాగంలో పుట్టడంతో.. అసలు శిశువుకు భారత పౌరసత్వం వర్తిస్తుందా? లేదా ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పేరంట్స్ నుంచి అభ్యర్థన రావాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం అలాంటి ప్రశ్నే లేదని అధికారులు చెబుతున్నారు. 

రెండు రోజుల్లో ఫిలిప్ఫైన్స్ కు శిశువు ప్రయాణం :
మరోవైపు.. ఫిలిప్ఫైన్స్ ఎంబాసీ అధికారులను శిశువు తల్లి సంప్రదించింది. అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జీహెచ్ఎంసీ నుంచి శిశువు బర్త్ సర్టిఫికేట్ రిలీజ్ అయిన తర్వాతే ఫిలిప్ఫైన్స్ పౌరసత్వానికి సంబంధించిన ఫార్మాలిటీలను పూర్తిచేయనున్నారు. రెండు రోజుల్లో శిశువు పౌరసత్వ పత్రాలు సిద్ధం కానున్నాయి. ట్రావెల్ పేపర్లు, ఫిలిప్ఫైన్స్ పాస్ పోర్టు రెడీ కాగానే.. ఆడశిశువు ఫిలిప్ఫైన్స్ లోని పేరంట్స్  దగ్గరకు తిరిగి వెళ్లనుంది.  

Philippine Woman
 Hyderabad Airport
RGIA
indian
Filipino
Apollo doctors

మరిన్ని వార్తలు