హైదరాబాద్‌లో మహిళా అభ్యర్థులకు దక్కని సముచిత స్థానం!

14:01 - November 5, 2018

హైదరాబాద్ : అన్ని రంగాల్లో మహిళా శక్తి చాటుతూ.. అతివలు దూసుకుపోతుండగా రాజకీయ రంగంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చేసేస్తున్నామని చెప్పుకునే పార్టీలు,పాలకులు మహిళలకు ఎన్నికల్లో సీట్లు కేటాయించటంలోమాత్రం తామే ముందుంటారు. కానీ నగరంలో అయితే మహిళా ప్రతినిథుల ప్రాతినిథ్యం అతి స్వల్పం..మరి నగరంలో ఏర్పడిన నియోజకవర్గాలు..వాటి నుండి పోటీచేసిన మహిళా అభ్యర్థుల, వారి విజయాలు..ఆనాటి ఆ కాస్త వెలుగు కూడా నేటి ఎన్నికల్లో ెఎలా వుందో చూద్దాం..
5 సార్లు సమిత్రాదేవి 
5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు సుమిత్రాదేవి. నగరంలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మహిళ ఆమె ఒక్కరే. తొలిసారిగా తూర్పు నియోజకవర్గం నుంచి 1962లో..అనంతరం మేడ్చల్‌లో రెండుసార్లు.. జూబ్లీహిల్స్‌, ఇబ్రహీంపట్నం నుంచి ఒక్కొక్కసారి గెలిచారు. 
Image result for manemmaముషీరాబాద్ నుండి ఒకే ఒక్కసారి మణెమ్మ
ముషీరాబాద్‌ నియోజకవర్గం 1952లో ఏర్పడినప్పట్నుంచి 15సార్లు ఎన్నికలు వచ్చాయి. 2004లో ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి రాజీనామా చేయడంతో 2008లో ఉప ఎన్నికలు వచ్చాయి. అందులో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన టి.మణెమ్మ గెలుపొందారు. 2009లోనూ ఆమే గెలిచారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిందీ ఈమె ఒక్కరే విశేషం.
Image result for katragadda prasunaసనత్‌నగర్‌..
ఈ నియోజకవర్గం 1978లో ఏర్పడింది. దీంతో  10సార్లు ఎన్నికలు జరిగాయి.  కాంగ్రెస్‌ 6సార్లు.. టీడీపీ 4 సార్లు గెలిచింది. 1983లో కాట్రగడ్డ ప్రసూన టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో ఈ నియోజవర్గంలో ఇప్పటి వరకూ ఆమె ఒక్కరే కావటం గమనించాలి. 
రద్దు అయిన హిమాయత్ నగర్..
1978లో ఏర్పడిన హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం 2009లో రద్దయ్యింది. అప్పటికి 9 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో..
బీజేపీ      4 సార్లు
టీడీపీ        3 సార్లు.. 
జనతా పార్టీ   1సారి
కాంగ్రెస్‌       1 సారి 

విజయం సాధించాయి. తొలిసారి నిర్వహించిన ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున లక్ష్మీకాంతమ్మ గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ గెలిచే అవకాశం ఎవరికి  రాలేదు. 1967లో ఏర్పడిన గగన్‌మహల్‌ నుంచి 1972లో టి.శాంతాబాయి కాంగ్రెస్‌ నుండి  ఎన్నికయ్యారు. తరువాతి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కనుమరుగైంది.
1952లో  ఏర్పడిన మలక్‌పేట నియోజక వర్గం.. అప్పటి నుండి ఇప్పటి వరకూ  14 సార్లు ఎన్నికలు జరిగాయి. 
కాంగ్రెస్‌ 6 సార్లు.. 
బీజేపీ 3 సార్లు
మజ్లిస్‌ 2 సార్లు
పీడీఎఫ్‌, జనతా, టీడీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. 

1962, 1967 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బి.సరోజినీ పుల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఇక్కడ పోటీ చేసే అవకాశం ఎవరికీ రాలేదు. 
Related image1952లో ఏర్పడిన ఇబ్రహీంపట్నం నియోజక వర్గం..  
ఇప్పటివరకూ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ నుండి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ (ఐ)  నుంచి 1978లో సుమిత్రాదేవి విజయం సాధించారు. తరువాత 1999లో తెదేపా నుంచి కొండ్రు పుష్పలీల విజయం సాధించారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.Image result for sabitha indra reddy
 

తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు 
1999లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సబితారెడ్డి బరిలోకి దిగి గెలుపొందారు. 2004లో చేవెళ్ల నుంచి, 2009లో మహేశ్వరంలో ఎన్నికయ్యారు. వైఎస్‌ క్యాబినెట్‌లో తొలి మహిళా హోం మంత్రిగా సబిత పనిచేశారు.

Image result for jayasudha mLA1989లో సికింద్రాబాద్‌ నియోజక వర్గం..
ఇక్కడి నుండి 1989లో మేరీ రవీంద్రనాథ్‌.. 2009లో జయసుధ ఎన్నికయ్యారు. వీరిద్దరూ కాంగ్రెస్‌ తరఫున గెలిచారు.
కంటోన్మెంట్‌..
కంటోన్మెంట్‌లో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి  వి.రామారావు గెలిచారు. పదవిలో ఉండగానే ఆయన మరణించడంతో 1969లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య వి.మంకమ్మ కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు. 1972లోనూ ఎన్నికయ్యారు.
1952లో  ఏర్పడిన శాలిబండ..
అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మనుమా బేగం కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 1957లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె పత్తర్‌ఘట్టి నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గ్రేటర్‌లో 24 నియోజకవర్గాలుండగా.. ఒక్క మహిళా ఎమ్మెల్యే ఎన్నికవ్వలేదు. కాగా టీఆర్ఎస్ ప్రకటించిన 105 అభ్యర్థులలో నగరానికి సంబంధించి 9మంది అభ్యర్థులను ప్రకటించగా..వారిలో ఒక్క మహిళా లేకపోవటం గమనించాల్సిన విషయం. మరి మిగిలిన జాబితాలో మహిళలకు చోటు కల్పిస్తోరో లేదో చూడాలి. 
బీజేపీ ఇప్పటివరకూ రెండు బాబితాను ప్రకటించినా నగరం నుండి మహిళలను ఎవరూ లేదరు. ఇక కాంగ్రెస్, టీడీపీ కి సంబంధించిన మహా కూటమిలో ఇంకా సీట్ల పంపకాలు తేలనందున వారింకా అభ్యర్ధుల జాబితాను ప్రకటించలేదు. 2018లో కూడా ఎవ్వరూ కానరాకపోవటంతో ఈ నేపథ్యంలో మహిళలు చట్టసభల ప్రాతినిథ్యం ప్రశ్నార్థంగానే వుంది. 
                                                                                                                               - మైలవరపు నాగమణి

 

Don't Miss