అస్సాంలో దారుణం : డ్యాన్సర్ల చేత నగ్న నృత్యాలు

Submitted on 12 June 2019
women dancers to perform nude in Assam

అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన డ్యాన్సర్ల చేత నగ్న నృత్యాలు చేయించారు. ఈ ఘటన అస్సాంలోని కామరూప్‌ జిల్లా‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కేసులు నమోదయ్యాయి. బాధితులు న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. డీజీపీకి తగిన ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఓ సాంస్కృతిక కార్యక్రమం‌లో పాల్గొనేందుకు వెస్ట్ బెంగాల్‌లోని కూచ్ బెహార్ నుంచి  డ్యాన్సర్ల బృందం కామరూప్ జిల్లాకు జూన్ 7వ తేదీన వచ్చింది. వారిని 500 మంది గుంపు చుట్టుముట్టింది. బలవంతంగా బట్టలు విప్పించారు. నగ్నంగా డ్యాన్సులు చేయించారు. వ్యతిరేకించిన వారిపై చేయి చేసుకున్నారు. చంపేస్తామని బెదిరించారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.

ఘటనపై విచారణ చేయించి..బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. అయితే..నగ్నంగా డ్యాన్సులు చేయిస్తామని నిర్వాహకులు ప్రకటించినట్లు..కానీ అలాంటిది జరగకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనను అస్సాం ఫైనాన్స్ మినస్టర్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 700 మంది ఘటనలో ఉన్నారని..ఇప్పటిదాకా ఏడుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని బాధిత మహిళల బృందం ఆరోపిస్తోంది.

women dancers
perform
nude Dance
Assam
Mob molests
National Commission for Women
Chamaria town
Assam police

మరిన్ని వార్తలు