భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

Submitted on 13 June 2019
World cup 2019 India Vs New zealand

వరల్డ్ కప్‌ 2019కు వర్షమే ప్రధాన శత్రువు అయిపోయింది. ఏ మ్యాచ్ కూడా సక్కగా సాగటం లేదు. ఇప్పటికే మూడు మ్యాచ్ లు వర్షంతో రద్దు అయ్యాయి. ఇప్పుడు ఇండియా - న్యూజిలాండ్ మ్యాచ్ పై కూడా వరుణుడు తన ప్రభావం చూపిస్తున్నాడు. జూన్ 13వ తేదీన నాటింగ్ హామ్ వేదికగా జరిగే టీమిండియా  - న్యూజిలాండ్ మ్యాచ్ కు వాతావరణం అనుకూలించటం లేదు.

ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది.  వర్షం ఆగిపోయినా..పిచ్ మాత్రం తడిగానే ఉంది. టాస్ ఆలస్యం కానుంది. 50 ఓవర్ల పాటు మ్యాచ్ సాగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు జట్లు ఇంత వరకు ఓటమి చెందలేదు. న్యూజిలాండ్ హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దని కివీస్ భావిస్తోంది. ఇటీవలే జరిగిన మ్యాచ్ లో టీమిండియా. ఆసీస్ జట్లుపై ఘన విజయం సాధించింది. వరుణుడు కరుణిస్తాడా ? మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. 

world cup 2019
India vs New Zealand

మరిన్ని వార్తలు