ప్రపంచంలోనే ఫస్ట్ : ఫోల్డబుల్ Display ల్యాప్‌టాప్‌ వచ్చేసింది

Submitted on 16 May 2019
World's First Foldable Display Laptop from Lenovo

చైనీస్ టెక్ కంపెనీ లెనొవో నుంచి కొత్త మోడల్ ప్రొటోటైప్ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేసింది. అదే.. ఫోల్డబుల్ స్క్రీన్ ల్యాప్ టాప్. ప్రపంచంలోనే ఫస్ట్ ప్రొటోటైప్ Foldable Display Laptop. ఇప్పటివరకూ స్మార్ట్ ఫోన్లలోనే ఈ తరహా డిస్ ప్లే చూసి ఉంటాం. సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ ఫోల్డ్ బుల్ స్మార్ట్ ఫోన్ వచ్చింది.

స్మార్ట్ ఫోన్లతో పాటు పీసీ వెర్షన్ ల్లో కూడా ఫోల్డబుల్ పీసీలు మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారి. పీసీ మేకర్ లెనొవో.. అప్ కమింగ్ ఫోల్డబుల్ డిస్ ప్లే స్ర్కీన్ ల్యాప్ టాప్ డిజైన్ ను యాక్సిలరేట్ కాన్ఫిరేన్స్ లో ఆవిష్కరించింది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. త్వరలో ప్రపంచవ్యాప్తంగా టెక్ మార్కెట్లోకి రిలీజ్ కానున్నాయి. 

ఎట్రాక్టింగ్ ఫీచర్లు :
లెనొవో నుంచి రానున్న ఈ సరికొత్త డిజైన్ ఫోల్డబుల్ డిస్ ప్లే ల్యాప్ టాప్ ఫీచర్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. లెనొవో థింక్ ప్యాడ్ X1 Line, 13.3 అంగుళాల సింగల్ OLED 2K తో 4/3 అస్పెక్ట్ రేషియో ఉంటుంది. డివైజ్ లో సగం వరకు ఫోల్డ్ ఉండగా.. బ్యాడీ డిజైన్ చాలా చిన్నదిగా ఉంటుంది. ల్యాప్ టాప్ ఫోల్డ్ చేసినప్పుడు 9.6 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఇందులో OLED డిస్ ప్లే తో పాు పాలిమర్ స్ర్కీన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇంటెల్ ప్రాసిసర్ పవర్ తో పాటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ డివైజ్ రన్ అవుతుంది.

గెలాక్సీ ఫోల్డ్ తరహాలో లెనొవో ఫోల్డబుల్ స్ర్కీన్ డిస్ ప్లే యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా కనిపిస్తోంది. ఈ డివైజ్ ను LG తయారుచేయడం విశేషం.  బ్యాటరీ ప్లేస్ మెంట్ పై కూడా లెనొవో కేర్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ, గెలాక్సీ ఫోల్డ్ డివైజ్ లో బ్యాటరీని.. ఒక్కో ప్యానెల్ పై రెండు పార్టులుగా డివైడ్ చేశారు. ల్యాప్ టాప్ మోడ్ లో కాస్త అసౌకర్యంగా ఉండే పరిస్థితి ఉంది. అందుకే.. లెనొవో.. ల్యాప్ టాప్.. డివైజ్ లో ఒక బ్యాటరీ, ఒక ప్యానెల్ ఉండేలా డిజైన్ చేశారు. 

2020 నుంచి మార్కెట్లోకి :
‘ఈ ప్రొడక్ట్.. ఫోన్ కాదు.. ట్యాబ్లెట్ కాదు.. ఫెమిలర్ హైబ్రిడ్ అంతకన్న కాదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదొక ఫుల్ ఫ్లెడ్జెడ్ ల్యాప్ టాప్ ఫోల్డబుల్ స్క్రీన్ గా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోల్డబుల్ స్క్రీన్ ల్యాప్ టాప్ 2020 నుంచి సేల్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ల్యాప్ టాప్ ధర, ఎప్పుడు రిలీజ్ చేస్తారనే వివరాలను లెనొవో వెల్లడించలేదు. ఈ ఫోల్డబుల్ పీసీ ఫీచర్లకు సంబంధించి వీడియోను కూడా లెనొవో రిలీజ్ చేసింది. 

Foldable Display
Lenovo Laptop
Samsung Fold
Foldable PC

మరిన్ని వార్తలు