ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ : రూ.14 కోట్లు 

Submitted on 26 May 2019
World's most expensive injection: Rs 14 crore..Prevention of genetic disorders in toddlers

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ (మెడిసిన్) వచ్చేసింది. దీని ఖరీదు వింటే షాక్ అవ్వక తప్పదు..దాని ఖరీదు  అక్షరాలా రూ.14 కోట్లు. ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు..శాశ్వతం కాదు. అందునా పసిపిల్లల ప్రాణం విషయంలో. ఆ పసిపిల్లల్లో వచ్చే జన్యులోపాలను నివారించేందుకు కనిపెట్టిందే ఈ జోల్‌జెన్‌స్మా అనే మెడిసిన్.
 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందుకు ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ (FDA) మే 24న అనుమతినిచ్చింది. ఆ మెడిసిన్ పేరు జోల్‌జెన్‌స్మా. దాని ఖరీదు రూ. 14 కోట్ల 57 లక్షలు. ఈ మెడిసిన్ ను స్విట్జర్లాండ్‌కు చెందిన మందుల తయారీ సంస్థ నోవార్టిస్‌ తయారు చేసింది. పసిపిల్లలో వచ్చే జన్యులోపాలను నిరోధించడానికి (వంశపారంపర్యంగా వచ్చే లోపాలు) ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. దీని కోసం ఇప్పటికే మందులు ఉన్నాయి.

అయితే వాటిని సంవత్సరానికొకసారి ఇంజెక్ట్‌ చేయాలి. ఇలా పదేళ్లలో రూ.30 కోట్లకు పైనే ఖర్చవుతుంది. కానీ జోల్‌జెన్‌స్మాను ఒకసారి ఇంజెక్ట్‌ చేస్తే సరిపోతుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్  అయినప్పటికీ జోల్‌జెన్‌స్మా వల్ల సగం ఖర్చు తగ్గుతుందని మెడిసిన్ తయారు చేసిన సంస్థ నోవార్టిస్‌ తెలిపింది.

FDA
Novartis
approval
world’s most expensive
drug
genetic disorders
toddlers

మరిన్ని వార్తలు