Xiaomi Mi Super Sale : స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఆఫర్లు ఇవే

Submitted on 13 August 2019
Xiaomi Mi Super sale, discount, Poco F1, Redmi Note 7 Pro, Redmi Y3, Mi A2

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ Mi Super Sale ప్రారంభమైంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ Mi.com ఆన్ లైన్ స్టోర్‌లో ఆగస్టు 12 నుంచి ఆగస్టు 18 వరకు సేల్ కొనసాగనుంది. షియోమీ స్మార్ట్ ఫోన్లపై ఆన్ లైన్‌లో రూ. 8వేల వరకు డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. 
Read Also : 6 కొత్త కలర్లలో : రాయల్ Enfield బుల్లెట్ 350.. ధర ఎంతంటే?

షియామీ అందించే మూడు స్మార్ట్ ఫోన్లలో అదనంగా.. షియోమీ Mi A2, Redmi Y3, Poco F1 స్మార్ట్ ఫోన్లపై Mi Exchange ధర రూ.2వేలు తగ్గింపుతో ఆఫర్ అందిస్తోంది. షియోమీ మార్కెట్లో రిలీజ్ చేసిన 8 స్మార్ట్ ఫోన్లపై అందించే భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఏంటో ఓసారి చూద్దాం. 

1. Redmi Note 7 Pro: రూ.13వేల 999 మాత్రమే 
రెడ్ మి నోట్ 7 ప్రో.. ఇదో బేసిక్ వేరియంట్ స్మార్ట్ ఫోన్.. దీని అసలు ధర రూ.15వేల 999 ఉండగా.. రూ.2వేల డిస్కౌంట్ తగ్గింపు ధరతో రూ.13వేల 999కే సొంతం చేసుకోవచ్చు. నెప్ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లూ, నెబ్యూలా రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. 

ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే :

* 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజీ
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్
* 4000mAh బ్యాటరీ 
* 48MP+5MP డ్యుయల్ రియర్ కెమెరా
* 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 

2. Redmi Note 7S: రూ. 9వేల 999 మాత్రమే
ఈ స్మార్ట్ ఫోన్ రూ.2వేల వరకు డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. రెడ్ మి నోట్ 7ఎస్ అసలు ధర రూ.11వేల 999 ఉండగా.. డిస్కౌంట్ తగ్గింపు ధరతో రూ.9వేల 999కే సొంతం చేసుకోవచ్చు. 

ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే :

* 6.3 అంగుళాల FHD+ డిస్ ప్లే (2340x1080p) రెజుల్యుషన్
* 4000mAh బ్యాటరీ 
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
* 48+5MP రియర్ కెమెరా సెటప్

3. Redmi Y3 : రూ. 8వేల 999 మాత్రమే 
షియోమీ Mi సూపర్ సేల్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8వేల 999లకే లభ్యం అవుతోంది. ప్రైమ్ బ్లాక్, ఎలిగెంట్ బ్లూ, బోల్డ్ రెడ్ కలర్ వంటి మూడు కలర్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంది.  క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ కూడా ఉంది. 

ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే :

* 6.26 అంగుళాల HD + డిస్‌ప్లే
* 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజీ
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్
* 4000mAh బ్యాటరీ
* మూడు కలర్లు.. ప్రైమ్ బ్లాక్, ఎలిగెంట్ బ్లూ, బోల్డ్ రెడ్ 

4. Redmi 7 : ప్రారంభ ధర రూ.7వేల 499 మాత్రమే 
ఈ ఫోన్ రూ. 2వేల 500 డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర మార్కెట్లలో రూ.9వేల 999గా ఉండగా.. తగ్గింపు ధరతో రూ.7వేల 499కే లభిస్తోంది. రెడ్ మి 7 స్మార్ట్ ఫోన్ ఫీచర్లలో ఎక్లిప్స్ బ్లాక్, కమెట్ బ్లూ, లూనర్ రెడ్ కలర్ ఆప్షన్లలో దొరకుతుంది. 

 ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే :

* 6.26 అంగుళాల HD + డిస్‌ప్లే
* 12MP + 2MP AI డ్యుయల్ రియర్ కెమెరా
* 8MP సెల్ఫీ కెమెరా 
* Eclipse Black, Comet Blue, Lunar Red
 

5. Poco F1 : రూ. 17వేల 999 మాత్రమే 
ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.17వేల 999తో షియోమీ ఎంఐ ఆన్ లైన్ సేల్‌లో అందుబాటులో ఉంది. షియోమీ అదనంగా Mi ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్ కింద రూ.2వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 

 ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే :

* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
* 4000mAh బ్యాటరీ 
* 20MP ఫ్రంట్ కెమెరా 
* 12+5MP డ్యుయల్ రియర్ కెమెరాలు

6. Xiaomi Mi A2 : ధర రూ.9వేల 999 మాత్రమే 
షియోమీ సూపర్ సేల్ సందర్భంగా Mi A2 బేస్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.9వేల 999కే లభిస్తోంది. Mi Exchange ప్రొగ్రామ్‌లో భాగంగా అదనంగా రూ.వెయ్యి వరకు డిస్కౌంట్ అందిస్తోంది. Stock ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 

 ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే :

* 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజీ
* స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
* 12MP + 20MP డ్యుయల్ కెమెరా
* 20MP ఫ్రంట్ కెమెరా
Read Also : జియో GigaFiber పోటీగా : Top 7 Broadband డేటా ప్లాన్లు.. ఆఫర్లు ఇవే

Xiaomi Mi Super sale
discount
Poco F1
redmi note 7 pro
Redmi Y3
Mi A2

మరిన్ని వార్తలు