ఏపీ బడ్జెట్ 2019 : ప్రచారం ఎక్కువ..పస తక్కువ - యనమల

Submitted on 12 July 2019
Yanamala Slams On AP Budget 2019-20

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018 - 19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ..పస తక్కువ అంటూ విమర్శించారు మండలి ప్రతిపక్ష నేత యనమల. 2019, జులై 12వ తేదీ శుక్రవారం ఏపీ మంత్రి బుగ్గన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. దీనిపై యనమల స్పందించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసిందన్న వైసీపీ..ఇప్పుడు అంతకంటే ఎక్కువగా అప్పు చేస్తోందన్నారు. అప్పుల మీద రాద్ధాంతం చేశారు..వాస్తవాలు వక్రీకరించారన్నారు. 19-20 సంవత్సరంలో 48 వేల కోట్ల రూపాయల అప్పు చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని అర్థమౌతుందన్నారు. ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పు చేస్తారు ? అని ప్రశ్నించారు యనమల. 

మరోవైపు ఏపీ అసెంబ్లీలో అధికారపక్ష తీరును తప్పు బట్టారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. ఆయన 10tvతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం తన శాడియిజాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. సున్నా..వడ్డీపై సవాల్ విసిరిన వ్యక్తి..కనీసం తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని సీఎం జగన్‌ను ఉద్దేశించి డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని రెచ్చగొడుతున్నారు..మైక్ ఇవ్వడం లేదు..కనీసం హక్కులు లేకుండా అధికారపక్షం ప్రదర్శించిందన్నారు. తాము రుజువులతో సహా సభకు వచ్చి వివరాలు చెప్పడం జరిగిందన్న బుచ్చయ్య చౌదరి. 

Yanamala
Slams
AP Budget 2019-20
Buggana


మరిన్ని వార్తలు