ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Submitted on 13 August 2019
Yarlagadda Lakshmiprasad appointed as AP Official Language Society President

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆగస్టు (13, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1953 నవంబరు 24లో కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర వానపాములలో జన్మించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు. హిందీలో ఎమ్ఏ పట్టా పొంది, తెలుగు, హిందీ భాషలలో పిహెచ్ డీ పట్టాలు సాధించాడు. 

నందిగామ కేవీఆర్ కాలేజీలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలా కాలేజీలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పని చేశారు. తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు. ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పిహెచ్ డి మార్గదర్శకం చేశారు. హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నారు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశారు. తెలుగులో 32 పుస్తకాలు రచించారు. 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలందించాడు.

లక్ష్మీ ప్రసాద్ సాంస్కృతిక సాహితి రాయబారిగా యుఎస్ఎ, మలేషియా, కెనడా, ధాయ్ లాండ్, సింగపూర్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, మారిషన్, రష్యా వంటి అనేక దేశాలు పర్యటించారు. లక్ష్మీప్రసాద్‌ ప్రతిష్ఠాత్మక సాహిత్యఅకాడమీ అవార్డు-2009కి ఎంపికయ్యాడు. ఆయన వ్రాసిన 'ద్రౌపది' తెలుగు నవలకు గాను ఈ పురస్కారం వరించింది. లక్ష్మీప్రసాద్‌కు సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఇది రెండోసారి.

బిషన్‌ సహానీ వ్రాసిన 'తామస్‌' అనే హిందీపుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు 1992లో ఆయన సాహిత్యఅకాడమీ అనువాద అవార్డును పొందాడు. కాగా, ఈ సారి ద్రౌపది పాత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని విలక్షణంగా ఆవిష్కరించినందుకు సాహిత్య అకాడమీ సృజనాత్మక అవార్డుకు ఆయన ఎంపికయ్యాడు. ఒకే రచయిత రెండుసార్లు ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.

Also Read : ఏపీలో కేన్సర్, కిడ్నీ ఆసుపత్రులు : రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ

Yarlagadda Lakshmiprasad
appointed
AP
Official Language Society
President

మరిన్ని వార్తలు