ప్రపంచంలోనే ఎత్రైన రాముడి విగ్రహం కోసం యోగీ సర్కర్ యత్నాలు..

10:48 - November 5, 2018

ఉత్తరప్రదేశ్‌ :  రామజన్మ భూమిలో రామ మందిరం కోసం కంకణం కట్టుకున్నామంటున్న బీజేపీ ప్రభుత్వం 2019 ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ అంశాన్ని తెరమీదికి తెస్తోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం రాముడి పేరుతో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహాన్ని సరయూ నది ఒడ్డున ప్రతిష్ఠించాలని యోచిస్తున్న యోగి సర్కారు అందుకోసం శిల్పిని వెతికే పనిలో పడింది. అందులో భాగంగా ఆర్కిటెక్ట్, డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది. షార్ట్ లిస్ట్ అయిన సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి ప్రజంటేషన్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసిన అనంతరం విగ్రహ నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తామన్నారు.  రాముడి విగ్రహం మొత్తం నిర్మాణం ఎత్తు 201 మీటర్లు కాగా, అందులో పీఠం ఎత్తు 50 మీటర్లు, విగ్రహం ఎత్తు 151 మీటర్లు వుండేలా  యోగీ ప్రయత్నాలను ప్రారంభించింది.
 

Don't Miss