వ‌ర్షాకాలంలో ఈ ఫుడ్స్‌ అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌..?

Submitted on 13 June 2019
You must Avoid these Foods In Rainy Season

వ‌ర్షాకాలం వచ్చేసింది ఇప్ప‌టికే చాలా చోట్ల వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే అందరికి ఈ సీజ‌న్‌ లో వేడి వేడి ప‌కోడి, బ‌జ్జీలు, పునుగులు లాంటివి తినాల‌ని అనిపిస్తుంది. నిజానికి వ‌ర్షాకాలంలో ఈ ఆహార ప‌దార్థాల‌ను అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌. మ‌రి ఏయే ఆహారాల‌ను తిన‌కూడ‌దో తెలుసా..?

* ఫ్రై చేసిన ఆహారం..
బాగా వేయించిన ఆహార పదార్థాల‌ను ఈ కాలంలో అస్స‌లు తిన‌కూడదు. ఎందుకంటే వ‌ర్షాకాలంలో మ‌నం  తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అటువంట‌ప్పుడు ఫ్రై చేసిన ఆహారం తింటే ఇక అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంది. దాంతో అది గ్యాస్‌, అసిడిటీకి దారి తీస్తుంది. అందుకే ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

* ఆకు కూర‌లు..
అదేంటి.. ఆకు కూర‌లను తినొద్దంటున్నారు అనుకుంటున్నారా.. అవును ఈ కాలంలో మాత్రం ఆకుపచ్చ‌ని కూర‌గాయ‌లు, ముఖ్యంగా ఆకుకూర‌ల‌ను తిన‌రాదు. ఎందుకంటే వాటిలో క్రిములు, బాక్టీరియా ఎక్కువ‌గా చేరే అవ‌కాశం ఈ కాలంలోనే ఉంటుంది. బాగా శుభ్రం చేసుకుంటాం అనుకుంటే త‌ప్ప వాటిని తిన‌కూడదు.

* చేపలు..
చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పోట్రీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. వాటిని తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా వచ్చే ప్రమాదముంది.

Avoid these Foods
Rainy Season
2019

మరిన్ని వార్తలు