టిక్ టాక్ చేసేందుకు నీళ్లలో దిగి శవమై తేలాడు

Submitted on 11 July 2019
Young Man dies during 'making' Tik Tok video

టిక్ టాక్ సరదా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది. అయినా కూడా యువత మాత్రం స్టంట్లు చేస్తూ ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. లేటెస్ట్‌గా తెలంగాణలోని సంగారెడ్డిలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన నరసింహులు , ప్రశాంత్‌లు ఇద్దరు వరసకు అన్నదమ్ములు. వీరిలో సూరారంలో ఉంటున్న అన్న ప్రశాంత్ దగ్గరకు నర్సింహులు వచ్చాడు. ఇద్దరు సరదాగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలోని తుమార్ చెరువుకు వెళ్లారు. చెరువు దగ్గరకు ఇద్దరు వెళ్లిన తర్వాత ఫోన్‌లో టిక్ టాక్ చేసేందుకు నర్సింహ చెరువులోకి దిగాడు.

చెరువు గట్టుపై నుంచి యువకుడు వీరిద్దరిని  వీడియో తీస్తుండగా నర్సింహులు లోపలికి  ఈత రాక గల్లంతయ్యాడు. దీంతో భయపడిన ప్రశాంత్ స్థానికులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి కావడంతో మరుసటి రోజు గాలించి మృతదేహంను వెలికి తీశారు. ఆ తర్వాత  పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

Young Man dies
Tik Tok Video
sanga reddy


మరిన్ని వార్తలు