జీతం 60వేలు: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలు

Submitted on 9 August 2019
Young Professional Vacancy In NHAI Recruitment 2019

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ప్రస్తుతం 30 ఖాళీలను మాత్రమే  ప్రకటించింది. ఇంకా ఖాళీల సంఖ్య మారే అవకాశం ఉంది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

అభ్యర్థులను కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2018 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు కాంట్రాక్ట్ వ్యవహారాలు, ఆర్బిట్రేషన్, శాసనసభ వ్యవహారాల అంశాల్లో అనుభవం తప్పనిసరి.  

విద్యార్హత: 
అభ్యర్ధులు లా, డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు కామన్ లా అడ్మీషన్ టెస్ట్ (CLAT) 2018 పాసై ఉండాలి.

వయసు: 
అభ్యర్ధుల వయసు 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు.

దరఖాస్తు ప్రారంభం: 2019, ఆగస్ట్ 9.

దరఖాస్తు చివరితేది: 2010, ఆగస్ట్ 23.

Read Also: చెక్ చేశారా? : GATE - 2020 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

Young Professional Vacancy
NHAI
recruitment 2019

మరిన్ని వార్తలు