ప్రాణం తీసిన ఈత సరదా

Submitted on 14 August 2019
youth died over falling pond

హైదరాబాద్ ఓల్డ్ మలక్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓల్డ్ మలక్‌పేటకు చెందిన నలుగురు యువకులు బోడుప్పల్‌ దగ్గర ఉన్న నారాపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లారు. వీరిలో ఓ యువకుడు ఈత కొడతానంటూ చెరువులోకి దూకి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. 

మిగిలిన ముగ్గురు యువకులు అతని కోసం చెరువులోకి దూకి ఎంత వెతికినా దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న నారాపల్లి పోలీసులు... గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెతుకుతున్నారు.  
 

youth
died
over falling
Pond
Hyderabad

మరిన్ని వార్తలు