చంద్రబాబులా నేను అన్యాయం చేయను : ఏపీ అసెంబ్లీ దేశానికి ఆదర్శం కావాలి

Submitted on 13 June 2019
ys jagan on ap assembly

ఏపీ సీఎం వైఎస్ జగన్.. అసెంబ్లీ వేదికగా టీడీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. స్పీకర్ గా తమ్మినేని సీతారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడిన జగన్.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఈ సభలో విలువలు లేని రాజకీయాలు చూశాము అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రతిపక్ష నేతను మాట్లాడినివ్వని దిగజారుడు వ్యవస్థను ఈ సభలో చూశామని వాపోయారు. ఈ సభలో నేను ఎలా ఉండాలా అని ఆలోచించాను అని ఆవేదనగా చెప్పారు. అటువంటి అన్యాయమైన సంప్రదాయాన్ని నేను పాటించను అని జగన్ స్పష్టం చేశారు. నేను కూడా అలానే చేస్తే ప్రజాస్వామ్యానికి ఏం విలువ ఉంటుందని జగన్ అన్నారు.

పార్టీ ఫిరాయించిన వాళ్లపై అనర్హత వేటు వేయని ప్రభుత్వంపై ప్రజలే అనర్హత వేటు వేశారని జగన్ అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం రాజ్యాంగ విలువల తెలిసిన వ్యక్తి అని, చట్టసభలపై మళ్లీ నమ్మకం కలిగించాలనే ఆయనను స్పీకర్ గా నియమించాని జగన్ చెప్పారు. ఈ సభ దేశానికి ఆదర్శం కావాలని జగన్ అన్నారు. తమ్మినేని సౌమ్యుడిగా మంచిపేరు తెచ్చుకున్నారని చెప్పారు. తమ్మినేని ప్రభుత్వం తరఫున జగన్ అభినందనలు తెలిపారు. మంచి స్పీకర్ అంటే సోమ్ నాథ్ ఛటర్జీ పేరు గుర్తుకు వస్తుందని జగన్ అన్నారు.

AP CM YS Jagan
AP Assembly
Chandrababu
TDP
Tammineni Sitaram
values

మరిన్ని వార్తలు