ఢిల్లీ చేరుకున్న జగన్ : నేరుగా ప్రధాని ఇంటికి

Submitted on 26 May 2019
ys jagan reaches delhi

వైసీపీ చీఫ్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం (మే 26,2019) ఉదయం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధాని మోడీ ఇంటికి వెళ్లారు. ప్రధాని మోడీతో జగన్ మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిన ప్రధానికి వివరించనున్నారు. ఆర్థిక సాయం కోరనున్నారు. అలాగే ప్రత్యేక హోదా అంశంపైనా ప్రధానితో జగన్ చర్చించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి అదనపు నిధులు విడుదల చెయ్యాలని ప్రధానికి విన్నవించనున్నారు. మోడీతో భేటీ తర్వాత ఏపీ భవన్ లో పలువురు అధికారులతో జగన్ భేటీ కానున్నారు.  

ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత జగన్‌ తొలిసారి ప్రధాని మోడీని కలుస్తున్నారు. జగన్‌ వెంట సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై జగన్‌ ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర సాయాన్ని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక సమస్యలను ఉన్నతాధికారులు ఇప్పటికే జగన్‌కు నివేదించారు. ఆ సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ప్రధానితో జగన్‌ భేటీ అవుతున్నారు. ఈ నెల 30న ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీని.. జగన్ ఆహ్వానించనున్నారు.

Ys Jagan
reaches delhi
pm modi
meeting
jagan delhi tour
AP Special Status

మరిన్ని వార్తలు